About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

సిగ్గులేని అసోచాం ASSOCHAM

ధనిక పారిశ్రామిక వర్గానికి డబ్బు మాత్రమె ముఖ్యం . నల్ల  ధనం  దాచటం గురించి ఏ మాత్రం   సిగ్గు లేకుండా  వెనకేసుకు వస్తుండటం అసోచాం ద్జనిక దరిద్రులకే చెల్లు .
     ఒక దొంగ పేరు బయట పెడితే ఆ దేశ  ప్రతిష్ఠ దెబ్బతింతున్నదన్న  మహా సత్యాన్ని  మన అసోచాం  ప్రభుత్వానికి భోదిస్తుంది .

అసోచాం - ASSOCHAM--   The Associated Chambers of Commerce & Industry of India.
అసోచాం  నిజంగానే అశోచనీయం .  

బురఖా వేసుకుని ఫోటో దిగితే ఎలా ఉంటుంది ?

నా బొందలా ఉంటుంది . పాపం ఈ విషయంలో ముస్లిం స్త్రీల భాద చెప్పుకోలేనిది . అన్ని ఫామిలీ ఫొటోస్ లో  జీవితాంతం
ముసుగు ఫొటోలే . తలుచుకుంటే ఒక పక్క నవ్వు కూడా వస్తుంది .
పోలా అదిరిపోలా ...అసలు సిసలైన నాయకులంటే గుజరాతీలే

1. మోహన్ దాస్ కరం చంద్ గాంధి
       దేశాన్ని భవిష్యత్తులో హింసకు దూరంగా ఉంచాలని అహింసతో స్వాతంత్ర్యం తెప్పించాడు , ఈ ఆలోచనకి ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోయాడు . ఈరోజుల్లో ఏమైనా సమస్య వస్తే నిరాహారదీక్ష లేక రాస్తారోకో లేక బంద్ (సహాయనిరాకరణ ) తప్ప ఇతర మార్గాలు ఎంచుకోరు చాలామంది , కారణం గాంధీ నే .
2. సర్దార్ వల్లభాయ్ పటేల్
       దేశంలో కాన్సర్ లాంటి రాజ్యాలను బలంతోను , మిగతా 498 మందిని ఒకే ఒక సమావేశంతో  ఒకే ఒక రిపబ్లిక్ గా చేసిన ఘనత పటేల్ గొప్పతనం .
3. నరేంద్ర మోడీ
      ఇతను చేయటం మొదలుపెట్టేసాడు , ఈ పరుగు ఎంత దూరం సాగుతుందో గానీ , జనం మాత్రం కొత్త ఉత్సాహం తెచ్చ్సుకున్నారు . మొదటిసారి దేశం కోసం ఆలోచించటం అనేది ఈ ప్రధాని ఒక్కడే నేర్పించాడు .
ఈ మాత్రం చాలు గుజరాతీ భాయ్ లని ఆకాశానికి ఎత్తటానికి ! 

జ్యోతిష్యం నచ్చకపోతే సైన్స్ నమ్మేస్తారంట !

జ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో  చాలా  ఎక్కువగా  చూస్తున్నాం  . మరి   సైన్స్   ఏం  చెప్పినా నమ్మేస్తారా  !
ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ  మనకి ఆనట్లేదు ఏ విషయమూ .
ఒక గణిత నమూనా (mathematical  model ) ఆధారంగా మీకు సరిపోయే జోడిని చూపిస్తే  గంతులేస్తూ  పెళ్లి చేసుకుంటారు ఈ రోజు మేధావి కుర్రోళ్ళు /కుర్రమ్మలు  .  ఈ లోకం లో  ఉన్న ప్రతి వ్యవస్థని గణిత చిహ్నాలు (mathematical  symbols ), వాటి మధ్య సంబంధాలు (patterns  అండ్ relations )   సహాయంతో  ఒక సూత్రంగా ( as  a  formula ) వ్రాయవచ్చు . కానీ అది న్యూటన్, Einstein,  హాకింగ్ కి కూడా సా సాధ్యపడలేదు  ఏ ఒక్క విషయం లొనూ ...  . వారు అంతా స్థూలంగా  చేసేసారని భావిస్తే అది మీ వెర్రితనం .
   జ్యోతిష్యం పేరుతో వేల కోట్లు గడిస్తున్నారని తెలిసింది  ఈ మధ్యే ఒక బెజవాడ సుపారీ హత్య వల్ల .
ఒక మోడల్ సహాయంతో  ప్రస్తుతమున్న కుర్రకారుని వెర్రివాళ్ళుగా   చెయ్యొచ్చా ??

Famous Statistician,  E.P.Box says  --"ALL models are wrong , only some are of  use"

నా స్నేహితుడు  రామ్ వ్యంగ్యంగా చెప్పినట్టు ,  " ఎందుకో మరి సైన్స్ మాత్రం  గ్రీకు భాషలో చెప్తేనే అర్థమవుతుంది , ఫన్నీ గా ..."

పెను తుఫానులు చూపుతున్న సామాజిక భాధ్యత

ఇదేదో పైత్యంతో  రాశాననుకునేరు ! 
విద్యుత్ స్తంభాలు కూలిపోవటం , బలంగా లేని ఆనకట్టలు తెగిపోవటం , పాత పాత పాఠశాలలు కూలిపోవటం , నాసిరకం రహదారుల్లో ఉన్న డొల్లతనం బయటపెట్టటం ఇవన్నీ ఏ ప్రభుత్వం సాహసించలేని సమాజానికి జరుగుతున్న మహోపకారం . 
  ఎలాగూ తుఫాను హెచ్చరిక వల్ల  పైన ఉల్లేఖించబడిన స్థలాలలో పిల్లలు-జనం ఉండే ప్రసక్తి లేదు . కనుక జన  నష్టం చాల చాల పరిమితం.   

భారతదేశానికి అంటూ ఒక దేశభాష లేదు

 ఏ న్యాయస్థానం  ఎంత మొత్తుకున్నా ఉత్తరప్రదేశం రౌడీలు,  ఢిల్లీ  బలుపు బాబులు హిందీని దేశం మొత్తం రుద్దాలని  శతవిధాల ప్రయత్నిస్తుంటే ఒక్కడూ (కనీసం మన ఉత్తుత్త తెలుగు నాయకులు )ఇది పద్ధతి కాదు , మన దేశ సమాఖ్యకు ఇది విరుద్దమైన చర్య అని నోరు మెదపలేరు .  చిన్న పిల్లల పాఠశాల పుస్తకాలలో ఈ తప్పుడు అసత్యాన్ని ఎప్పటినుంచో నూరిపోస్తున్నారు .  ఈ హిందీ అనేది
ఉత్తరప్రదేశం , ధిల్లీ  తప్ప ఇంకెక్కడా సరిగా మాట్లాడారు . మరి దీనికోసం ఎందుకన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భాషాభివృద్ది  పేరిట వ్యయం చేస్తున్నారు ? .


India has no unique national language

No matter a high court clears that hindi is not a national language and there is nothing in the constitution like that.  Then how could the uttarpradesh and delhi morons (even the so called educated and uneducated political gundas of UP state) falsely promote hindi as NL. The sad thing is that in school text books also it is written that hindi is national language. How could they do that arrogant racist crime of falsely promoting among school children.

పులులు మనుషులని తింటాయా ?

తింటాయి వాటి టైం దగ్గరపడినప్పుడు  లేక  గత్యంతరం లేనప్పుడు . కొన్ని సైకో పులులు కూడా ఉన్నాయి అక్కడక్కడ :D .
బాగా విపులంగా తెలుసుకోవాలంటే  ఈ వికీ వ్యాసం చదవండి . ఒక్కో పులికి ఒక్కో స్వీయకథ . ఒక్కోటి ఒక్కో థ్రిల్లర్ కథలా ఉంటుంది .

దీనమ్మ జీవితం !

మొన్నటి వరకు యూనియన్ బ్యాంకు online transactions కి 3-fold సెక్యూరిటీ ఉండేది .
ఇప్పుడు వాడి వెర్రి ఆరింతలైంది .
 అంటే మూడు పువ్వులు ఆరు పుచ్చులైంది !
 నా దరిద్రం ఇలా ఏడ్చింది .
గాంధీ జయంతి రోజు పొద్దు పొద్దునే నా సహనానికి పరీక్ష  జరిగింది .
sms రిచార్జ్ రూ. 43 చేద్దామని టాటా డొకొమొ వెబ్సైటు కి వెళ్లి  తతంగం ఆరంభించా ...
మొదట , యూనియన్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్  ఐంది , user తర్వాత password ఎంటర్ చేశా .
 తర్వాత,
    మొబైల్ కన్ఫర్మేషన్ కి ఒక "Roaming activation code " వచ్చింది (నా అదృష్టం వాళ్ళ నెట్వర్క్ బాగుంది , త్వరగానే కోడ్ వచ్చింది ).
ఆ తర్వాత , PKI password (with personal assurance message PAM) అడిగింది (దీనికి సంబంధించిన తంతు సరిగ్గా ఒకరోజు ముందే ఏదో పనిలో పనిగా చేయబడింది కనుక నాకు కంప్యూటర్ పగలగొట్టుకోవలసిన సదవకాశం చేజారింది )
ఇప్పుడు 3-fold సెక్యూరిటీ ప్రారంభం , అన్దరూ తప్పట్లు లేదా చిటికెలు ....
భేష్ భేష్ .. మంచి ఉత్సాహంగా ఉంటారు ఎదుటివాడి ఉరావస్థని చూసి పగలపడి నవ్వటానికి . ఇంకా ఆపండి !
  ఇంకా సరే రూ 43 చెల్లించమని సరే బొత్తం (ok  button ) నొక్కా .. నా మొబైల్ కి OTP password  పంపింది . విపరీతమైన పట్టలేని ఆనందం తో అది కూడా నింపాను (ఒక  అర నిమిషం పట్టింది అది నా మొబైల్ కి చేరటానికి ) .
చివరగా , user and transaction password అడిగింది . ఇచ్చేసా అది కూడా ఇచ్చేసా .
  నా మొజిల్లా చక్రం తెగ తిరిగేస్తుంది , ఒక ఎర్రటి గులాబి లాంటి గుచ్చుకునే సందేశం నా (కంప్యూటర్ ) మొహం మీద
విసిరిపారేసింది .  "Your recharge transaction timedout . Please wait for 2-3 days to
get back your money."

 దీనికంటే sms ని speedpost చేయటం చాలా  తేలిక.