About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

రైతుకి నమ్మక ద్రోహం

అటు కేంద్రం లో  ఆర్డినెన్సు పేరుతో , ఇక్కడ రాష్ట్రంలో రాజధాని పేరుతో  అమాయక రైతుని అడ్డంగా మోసం చేస్తున్నారు .
బలవంతంగా దుక్కి దున్నే భూమి లాక్కోవటం కంటే  నీచమైన పని లేదు . పచ్చగా లేని భూములే దొరకలేదా ? కనీసం నోట్లో ముద్ద  పెట్టినప్పుడైనా  కాదా ? ఏది ముఖ్యమో ఏది తరువాతో . అభివృద్ధి పేరుతో ఎవరిని మోసం చేస్తున్నారు ?
ఇక్కడ రాష్ట్రం లో రైతులకి బాబు నచ్చ చెప్తాడంట ! ఏంటి దానర్థం ? అమాయకులకి బెదిరింపులా ?
ఆ నచ్చచెప్పుడేదో తన తెలుగు తమ్ముళ్ళకే  చెప్పవయ్యా , అంత వ్యాపార మదం ఎందుకని ? చైతన్య నారాయణ పేర్లతో ఇప్పటికే విద్యని భ్రష్ట పట్టించారు నారాయణ అండ్ కో . చంద్రబాబు కి  అన్నం పెట్టె పొలాలు పచ్చగా ఉండటం ఎందుకు అర్థం కాదు . కాంక్రీట్ జంగల్ సరైన అభివృద్ధి కాదు .  

వెంకన్న నోట చల్లని మాట !

ఆంధ్రజ్యోతి నుంచి యథాతథంగా నకలు తీయబడినది క్రింది వెంకయ్య నాయుడు గారి వ్యాక్యాణం . 


మాతృభాషను మరచిన వాడు మనిషే కాడు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు:

తల్లిని, మాతృభాషను మరచిన వాడు మనిషే కాడని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తెలుగును అవమానించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో తెలుగు బోధన తగ్గించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావటం లేదన్నారు. పరభాషా వ్యామోహంలో పడి తెలుగు మాధుర్యాన్ని మరచిపోతున్నారని ఆయన అన్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు.

ఎవడెలా పోతే మనకెందుకు ?

మన వరకు సరే ఏదో దరిద్ర బతుకులు , ఒకడి పొట్ట కొట్టి ఇంకోడు . కానీ అమాయక జంతువులు  ఎం పాపం చేశాయి .
ఉన్న నీరంతా కలుషితం చేసి మనం మాత్రం purifiers తో శుభ్రం చేసుకుని బ్రతికితే చాలు .
మనం తాగే పాలు ఇచ్చే పశువులకు కూడా మంచి నీరు ఉంచలేమా ?
అడవులు కొట్టేసి కోతులు పులుల్ని  నగరాల వైపు తిండి కోసం వచ్చేలా చేసి తర్వాత వాటికి నరకం చూపించడం .
 అన్నీ మనకే కావాలి . ప్రాణులు ఏమైపోతే మనకెందుకు ?

Active contours, Mumford-Shaw, Chan-Vese, level-set, snakes and Active contours without edges

Active contours,
        http://citeseerx.ist.psu.edu/viewdoc/summary?doi=10.1.1.124.5318

 Mumford-Shaw,
       http://www.dam.brown.edu/people/mumford/vision/papers/1985a--BdryDetMinFcnl-DAM.pdf

Level-set,
      https://math.berkeley.edu/~sethian/Papers/sethian.osher.88.pdf

 Chan-Vese, (mix of Mumford-Shaw and Level-set)
      http://cdanup.com/10.1.1.2.1828.pdf

snakes (alias Active contours model)
     
Active contours without edges (alias Chan-Vese Method)
      

ImageJ cannot open compressed DICOM Images --Solution

Just Place this jar file in plugins folder adn you will find a menu to handle whatever the way a DICOM was scaled (16 unsigned bit or 8 unsigned bit)


Bio-formats java jar package for ImageJ

ముడిచమురు ఎందుకు తగ్గింది ?

 ముఖ్యమైన కారణాలు ముందు క్రమంలో వ్రాయబడ్డాయి. 
1. OPEC దేశాలకు అమాంతంగా డబ్బు ఎందుకో కావాల్సివచ్చింది .(ఇసిస్ కోసమా ? ప్రభుత్వ బడ్జెట్ కోసమా ?)   
2. ఆయిల్ పై ఆధారపడ్డ రష్యా ని తొక్కటానికా ? (రష్యాకి పీపా తయారీ ఖర్చు మిగతా దేశాలతో పోలిస్తే చాల ఎక్కువ )
3. అమెరికా, రష్యా లలో  ఉన్న చమురు , షేల్ గాస్ ఉత్పత్తి సంబంధిత పరిశ్రమలను దెబ్బతీయటానికా ? (ఎక్కువ రోజులు వాడకపోతే ఖరీదైన యంత్రాలు పాడవుతాయి )
4. ఇసిస్ కు మున్ముందు వనరులు లేకుండా చేయటానికి అమెరికా సౌదీ అరేబియా ను బలవంతం చేసి ఎక్కువ ఆయిల్ తోడిస్తుందా ?
5. OPEC  వద్ద  విపరీతమైన ఆయిల్ ఇంకా మూలిగి ఉందా ?
6. వ్యంగ్యంగా , అమెరికాలో ఒకరికంటే ఎక్కువ మంది ఒకే కారు లో ప్రయాణించి ఆయిల్ ఆదా చేస్తున్నారా ?
7. విపరీత వ్యంగ్యంగా  , విదేశీ మారక ద్రవ్యం పెంచటానికి  మోడీ గారు  అంబానీ ద్వారా OPEC ని ఒప్పించి  భవిష్యత్లో పేద భారతీయుడు బిజెపి కి రాజకీయ విరాళాలు ఇవ్వగలిగే స్తోమత పెంచటానికా ?

ఇంత కక్కుర్తి ఈనాడుకేలా ?ఇది ఒక న్యూస్  వెబ్ సైట్ ఆ ? లేక న్యూసెన్స్  వెబ్ సైట్  ? ఈ మధ్య ఈనాడు తెరవాలంటే చిరాకేస్తుంది .
 advertisements  మధ్య న్యూస్ వెతుక్కోవాల్సి వస్తోంది .   Fundamental choices for recreation of oneself

1. Any Drama involving more dynamic content, and beyond prediction.
2. Drama induced by some predefined set of rules but unpredictable in
their nature of order of execution and appearance.
3. Sexual related content or activity.
4. Food and Art of making it.
5. Sleep, of course dreaming is an added pleasure.
4. recollection of past events. (nostalgia)
5. Devotion to god or some art/scientific creational work.

Sports and games come under 2nd category. where changing numbers
flush your adrenalin levels.

ఆవు చేనుమేయు దూడ గట్టు మేయునా !

ఈనాటి ఈ తెలుగు  అద్వాన్న స్థితికి కారణం మీ పెద్దలే . డబ్బు మీద విపరీత వ్యామోహం తో పిల్లల్ని ధన క్షీరదాలుగా తయారుచేసారు . తెలుగు తల్లి పేరు చెపితే అదేదో బూతు మాట్లాడిన భావం ఉంది ఇప్పటి పిల్లల్లో . కారణం ఎవరి పెంపకం ? ఇక్కడ ఐ ఐ టి కాన్పూరు లో ఎప్పుడైనా మన తెలుగు పండుగలు జరుపడానికి మెయిల్ వ్రాసినప్పుడు తెలుగు లో కూడా రాయండి మహాప్రభో అన్నందుకు ఇక్కడ ప్రతినిధి ఇచిన జవాబు ఏంటంటే " చాల మంది మన తెలుగు జాతి పిల్లలకి తెలుగంటే తెలీదంట , చదవటం రాదంట !"  ఏం తెగులు పుట్టింది వాళ్ళ తల్లితండ్రులకి ? అక్కడకి వారేమీ అణచివేయబడ్డ కులాల జాతి కూడా కాదాయె ఒకవేళ క్రైస్తవ మత వ్యామోహం లో తెలుగుని పాతరేయటానికి  !  
    ఏం పోయేకాలమో మన రెండు రాష్ట్రాల వెబ్సైటు లు కూడా ఒక్క ముక్క తెలుగు అక్షరం  పెట్టనే లేదు .

         అంటే  ప్రభుత్వం ఆంగ్లం నేర్చిన జనులకేనా ? 

కేంద్రం కూడా ఇదే తంతు హిందీ నేర్చిన వాడే ప్రభుత్వ ప్రకటనలు చదవగలిగేది ?

మరి ఆంగ్లం-హిందీనో   తెలియని వాడికి ప్రభుత్వంతో సంబంధం లేదా ? కానీ వాడి ఓటు మాత్రం కావాలా ? 

చంద్రబాబు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు

1. వ్యవసాయం దండగ అన్నవాడు మళ్ళీ రైతుల అండతోనే మంత్రి అయ్యాడు . అది మర్చిపోయి  నెపంతో పచ్చటి  భూముల్ని కాంక్రీట్ అడవుల్లా మార్చబోతున్నాడు . ఎవరికోసం, ఏ తమ్ముళ్ళ కోసం  ఆ సింగపూర్ ? అదేదో బీడు భూములైన ప్రకాశం ఒంగోలు వినుకొండ చిలకలుర్రిపేట లలో కుదరదా ? అక్కడ మీ తమ్ముళ్ళకి భూములు లేవనా ?
2. రాష్ట్రానికి  నిధులు కేంద్రం నుంచి తేకుండా జనాల మీద పన్నులు  పెంచాలని సలహా ఇచ్చిన సన్నాసి మంత్రి నారాయణ (ప్రజలు ఎన్నుకోలేదు ) లాంటివాడు నీకు మార్గదర్శి ?
3. చైతన్య నారాయణ కలిసి మొదట ఇంటర్మీడియట్ తర్వాత ప్రాధమిక విద్యనూ ఎలా  సర్వనాసనం చేసారో చెప్పాలంటే మాటలు రావు . ప్రభుత్వ పాఠశాలలు బాగుచేద్దామని ఏ రోజూ ఆలోచన రాదా ?  తోడు నారాయణ విద్య సంస్థల ధనోన్మాది స్వయానా మంత్రి పదవి లో ఉన్నాడు . కొన్ని రోజుల తర్వాత SSC బోర్డు కాకుండా నారాయణ స్కూల్ సర్టిఫికేట్ (NSC ) జారే చేస్తారు . IIT  లలో  90% ఆత్మహత్యలు తెలుగు పిల్లలవే, ఇలాంటి చైతన్య నారాయణలు నూరిపోసిన విద్యోన్మాదం మూలానే తల్లితండ్రులు అత్యాశకు పోతున్నారు . వేరే దారి లేదనుకునే స్థితికి తెచ్చారు .
  

పంచె కట్టు పవర్

నిజాయతీ తో పాటు తెలుగు అత్మగౌరవాన్ని ప్రతిభింబించే  వెంకయ్య నాయుడు గారి పంచె కట్టుకి నేను అభిమానిని . 

సిగ్గులేని సినిమా స్టార్స్

ఒక సినిమా తీయటానికి అయ్యే ఖర్చులో 25% కథానాయకుడికి పోతుంది . అంటే మీరు కొనే 100రూ టికెట్ లో 25రూ వాడు తింటాడు . ఫాన్స్ ప్రాణమని ఒకడు,  ఇంకోడు చెట్టు చెప్పి కాయలమ్ము కునేవాడు, ఇంకో పిచ్చోడు వంశం-జాతి-కులం  అంటూ  తెలుగు ప్రేక్షకులు కష్టపడి రోజంతా శ్రమించిన దానిలో సిగ్గులేకుండా వాటా తీసుకుంటున్నారు . ఎందుకంత చెల్లిస్తున్నారో ఆ ఫాన్స్ పిచ్చకే వదిలేస్తున్నా . మక్కీకి  మక్కీ కాపీ కొట్టిన స్మార్ట్ ఫోన్ కూడా చవకగా వస్తుంది . కానీ సినిమాలు మాత్రం కలెక్షన్స్ రికార్డ్స్ పేరుతో ప్రేక్షకుడ్ని పిచ్చి నాయల్ని చేసి రిలీజ్ ని  పండగలా ,  అవార్డులని పెద్ద గొప్పలా ఆ  తర్వాత అవినీతి మీద నీతులు చెప్తూ  సినిమాల ద్వారా యువకులని పచ్చి తాగుబోతులుగా మారుస్తూ తాగడం ఒక హీరో నైజంలా
తయారుచేసారు రాష్ట్ర కుంపటిని . హీరోయిన్ ను అల్లరి చేసి వలలో  వేసుకోవడం  సాధారణ వ్యసనం లా తయారైంది మన చిత్రాలలో . అలాంటివాటిని ఆడపిల్లలు కూడా ఎలా చూడగల్గుతున్నారో  నాకర్థం కాలేదు మరి మాకంటే పుట్టినకాడినుంచి భయం భక్తి లేకుండా పెంచారు (నిజానికి మగాడు భయపడకూడదు అలా అయితే సమాజంలో పిచ్చి కుక్కలా నుంచి తన ఇంటిని రక్షించుకోలేడు ). 
మీ జిమ్మడ :p  !

నా బ్లాగు వీక్షణలు వాటి వెనుకన ఉన్న గణాంకాలు చెప్పే రహస్యాలు

అమెరికా సంయుక్త రాష్ట్రాలు 7220
భారత దేశం                      4637
రష్యా                               873
జర్మనీ                              393
లాత్వియా                        371
ఫ్రాన్స్‌                              361
ఉక్రెయిన్                          152
పోర్చుగల్                        128
మలేషియా                       87
బెల్జియం                          84
  పైనున్న గణాంకాలు 2008 నుంచి తీసుకోబడ్డవి   
. నేను ఎక్కువగా తెలుగులో రాస్తుంటా ఐనా  సరే 
ఆ దేశాలకు నా ఎలా అర్థమవుతుందో నాకు 
బోధపడలేదు . అందుకే కొంచెం లోతుగా
 traffic  data  ని అధ్యయనం చేశా . 
తేలిందేమంటే europe  and  అమెరికాలలొ 
సెర్చ్ రోబోట్స్ ప్రపంచంలో ఉన్న ప్రతి 
వెబ్సైటు ని ట్రాక్ చేస్తున్నాయి . 
అంటే నా బ్లాగుని చదివేది మనుషులు కాదు . 
మరమనుషులు !

చింత చచ్చినా పులుపు చావలేదు .


AAP గెలిస్తే ప్రత్యర్థి పార్టీలు (కాంగ్రెస్స్ , బిజెపి మినహా ) చంకలు గుద్దుకుంటున్నా యంట ! . ఎందుకంటే వాళ్ళని కూడా జనాలు గెలిపించేస్తారని పిచ్చి నమ్మకం . వాళ్లకి ఇంకా తేటతెల్లం కాలేదు రాజకీయాలు మారుతున్నాయని . సరైన ప్రజాస్వామిక విలువలు , సరైన దృక్పధం , సరైన సిద్దాంతం లేకుండా గెలిచేస్తామని  నమ్మకం చూస్తుంటే నాకు జాలేస్తుంది .
AAP  గెలిపించిన ఢిల్లీ జనాలకు  ఐపోయా . ఇక మిగిలింది మన రాష్ట్రంలో లోక్  సత్తా  విజ్రుంభణే  . కాస్త AAP  లా దూకుడు చూపిస్తే చాలు జె పి  మన రాష్ట్ర సారధి కాగలడు . కొంత కుల గజ్జి అనే రొచ్చు ని కూడా దాటి జనాలు రావాలి . అది ఎప్పుడో మరి !

వై ఎస్ అర్ పార్టీ కాంగ్రెస్స్ లో విలీనం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి

ఎంతోకాలం పట్టక పోవచ్చు . ఇది ఖచ్చితంగా ఆంధ్ర ను  టిడిపి నుంచి విముక్తి చేయవచ్చు . ప్రస్తుతం చంద్రబాబు కూడా రైతుల గోడు వినటల్లేదు . అభివృద్ధి పేరుతో పచ్చటి పొలాలు రైతు జీవితాలు రోడ్డు కీడుస్తున్నాడు . నారాయణ , సుజన ఇలాంటి డబ్బే మంత్రంగా బతికే వ్యాపారస్తులు మంత్రుల్లా ఉండి  తమ వ్యాపారాలకోసం  మాత్రమె ఆలోచిస్తున్నారు . అసలు అలాంటి వారికి  ప్రజా సమస్యలు ఎందుకు పడతాయి . ఒక పక్క జగన్ గుంత కాదా నక్క లా కాచుకుని ఉన్నాడు . కాంగ్రెస్స్ ఏమో గుక్కెడు మంచినీళ్ళు దొరికితే పండగ చేసుకోడానికి సిగ్గులేని అద్వాన్న పరిస్థితి లో ఉన్నారు . మన జె పి సరైన వ్యక్తి కానీ దూకుడు  లేదు . ఇక కమ్యూ నిస్టులంటారా ? వారి సిద్దాంతం ఒకటి రాద్దాటం ఒకటి చెప్పేది ఒకటి . పొంతన లేని పార్టీగా పేరుంది .

  టి డి పి నుంచి చంద్రబాబు ని తరిమేస్తే ఖచ్చితంగా వ్యాపార ధోరణి తగ్గుతుంది .  కొంతైనా పాత యెన్ టి అర్ లా పేద బడుగు వర్గాలకు పనికొచ్చే పనులు టిడిపి లో ఉన్న కొద్దో గొప్పో మంచి నాయకులు చేస్తారని ఆశ .   

టిడిపి కూడా రైతుల గోడు వినకుండా పంట పొలాలు లాక్కుని వాళ్ళ రియాల్టీ జాతికి ఇస్తే తర్వాతా ఎన్నికలలో చిప్పే మిగిలిద్ది .

బిజెపి  జనాల గోడు వినకుండా ఓకే   అభివుద్ది అని హడావుడి చెస్తూ రిలయన్స్ ఆదానీల చంక నాకటం వల్లే ఢిల్లీ లో అడ్రస్ లేకుండా పోయింది .  రెండు రాష్ట్రాలలో ఒకసారి లోకసత్తా  అడుగు పెడితే ఏ పార్టీ కి చిల్లర కూడా మిగలదు . అప్పుడు చంద్రబాబు ఏ సింగాపూరో , దావోసో పొవాలు. ఈలోపు రైతుల పొట్ట కొట్టాడో వాడికి కుక్క చావు ఖాయం . ఇప్పటికైనా పసుపు చొక్కాల కుల సేవ మాని కాస్త పేద జనాల కోసం ఆలోచించాలి బాబు గారూ ! 

fastest 3D version median using octave or matlab scilab

New updated version with faster 3D median:


A=ones(14,14,9);


nb=1;

New Version 2.0:

function C=fastmedian3D(A,nbd)
Author: Rowthu Vijayakrishna
Place: Dept. of Mathematics and Statistics, IIT Kanpur
Copyleft: Yes
Copyright: No
version: 2.0
[h w d]=size(A);
B=zeros((2*nbd+1)^3,h,w,d);

for j=-nbd:nbd
 for k=-nbd:nbd
  for l=-nbd:nbd
   v=(l+nbd+1 +(k+nbd)*(2*nbd+1) +(j+nbd)*(2*nbd+1)^2 );
   B(v,:,:,:)=shift(shift(shift(A,l,3),k,2),j,1);
  endfor;
 endfor;
endfor;
C=shiftdim(median(B));

####end of the function fileOld version:
Version 1.0

function C=fastmedian3D(A,nb)

[h w d]=size(A);
axlen=2*nb+1 ;
nb3d=zeros(axlen, axlen,axlen);
B=zeros( numel(nb3d),h,w,d );

tic
for j=1:h
 for k=1:w
  for l=1:d
   nblen=(min(j+nb,h) - max(1,j-nb)+1) *(min(k+nb,w) - max(1,k-nb)+1) *(min(l+nb,d) - max(1,l-nb)+1) ;
   B(1:nblen,j,k,l)=A( max(1,j-nb):min(j+nb,h),max(1, k-nb):min(k+nb,w) ,max(1,l-nb):min(l+nb,d) )(:);

  endfor;
 endfor;
endfor;
C=zeros(h,w,d);
C(:,:,:)=median(B)(1,:,:,:);
size(C)
toc

Still not the fastest

smartprice calculation for smartphones

Depending on their features with the brand value as one more diemnsion, an n-dimensional data can be plotted as 
  feature dimensions Vs cost

After framing the functional, it requires to calculate the right smartphone model for given amount  of money around its neighborhood.

ముస్లిమ్స్ కి terrorism అంటే ఎందుకంత వ్యామోహం ?

వారికి వేరే దారులు (అహింసాయుతం )ఎందుకు నచ్చట్లేదు ?
1. అరబిక్ సంస్కృతిలో చంపటం , ఉరి వేయటం వంటివి సాధారణ శిక్షలు . అక్కడ చంపడం పెద్ద కష్టమైన లేక  మనసునొప్పించె విషయం కాదు . ఖురాన్ అరబిక్ సంస్కృతికి అక్కడున్న ఎడారి వాతావరణానికి వారి ఆహార అలవాట్లకు ప్రతీకగా ఉంటుంది . ఖురాన్ లో మతం కోసం ప్రాణాలు ఇవ్వాలనే ఒక దురాచారం ఉంది .

2. అహింసా యుతంగా పోరాడటానికి ప్రపంచవ్యాప్తంగా సరిపడా జనం లేరు . అందుకు హింసాయుత మార్గం ఆకర్షణీయంగా మరియు ఏకైక మార్గంగా కనపడవచ్చు వారికి .
3. తరతరాలుగా శాస్త్ర సాంకేతిక అభివృద్దిని పక్కన పెట్టినకారణంగా తెలివిగా తర్కించే యోచన వారికి చాలా కష్టతరమైన విషయం . దీనికి ఉదాహరణ ప్రతి విషయానికి కారణం (పురాతన సాంప్రదాయ గ్రంధమైన ) ఖురాన్ ని ఆధారం చేసుకుని తర్కిస్తారు . అది వారి అమాయకత్వాన్ని ప్రత్యర్థికి తెలియచేస్తుంది . తద్వారా న్యూనతాభావం అలవడి హింసాయుతవాదం
మార్గమే దారిగా  కనపడుతుండవచ్చు .
4. మతం అనేది ఒక మత్తు దానికి విరుగుడు ఇంకో మతమే . దేవుడనే వాడు ఉన్నాడని మనం అనుకున్నంత కాలం ఈ గొడవలు పోవు . ఉన్నాడో  లేడో చెప్పే జ్ఞానం ఇంకా మనకు రాలేదు . ఒకవేళ  ఉన్నా  ఈ గొడవలు పెట్టేది తనే కనుక కనపడటానికి శరీరం (ఎలా ఉంటాడో చెప్పలేం ) చాటేసుకోవచ్చు . 
5. పరమతసహనం అనే గొప్ప సూత్రాన్ని ఖురాన్ చెప్పలేదు . మిగతా మతాలవారూ మాట ప్రాతిపదికన ఇలాగే మారణహొమ మార్గమే ఎంచుకుంటే మనిషనేవాడు మిగులుతాడా ? (నా కోరిక ఏంటంటే ఈ ప్రపంచం లో ఉన్న జనాలంతా చనిపోవాలి , అప్పుడు చక్కగా మిగతా ప్రాణులన్నీ వాటర్ purifier  అక్కర్లేని వాతావరణం లో హాయిగా తరతరాలు ఒక జాతిని మరో జాతి ని కాపాడుకుంటూ హాయిగా ఉంటాయి . మనిషి తన స్వార్థం తో అడవులు నరికి జంతువులను నగరాల మీదికి నీళ్ళు ఆహరం కోసం పరుగులు పెట్టిస్తున్నాడు, అవేమో చివరికి మన న్చేతిలో కుక్క చావు చస్తున్నాయి , పాపం ! )
6.తెల్ల   క్రైస్తవులు తెలివైనవారు కావటం వల్ల హింస అహింస రెండు విధాల తమ మతవ్యాప్తికి  ప్రయిత్నిస్తూ  వచ్చారు . వారు ఎక్కువగా సేవ పేరుతో మిషనరీలు స్థాపించి నల్లవారిని , జపనీయులను , మన దేశంలో వర్ణ వ్యవస్థ భాదితులను ఇంకా కొన్ని దీవుల లోని ఆటవిక జాతుల వారిని తమ మత సూత్రాలు నేర్పించారు . వారి దగ్గర ఉన్న అపార ధన సంపత్తిని (ఇందుకు పావుగా ) వాడారు . కానీ వారు కూడా ఒకప్పుడు క్రూసేడుల పేరుతో బలవంత మార్పిడులు వాటి కోసం యుద్దాలు చేసే వున్నారు .
7. ఇంకా ఎటువచ్చి బుద్దులు , జైనులు ,మరియు  హిందూ సంప్రదాయం వారు మాత్రమే హింసామార్గం ఎంచుకోలేదు .
శ్రీలంక , థాయిలాండ్ లలొనూ బుద్దులకి ముస్లిమ్స్ కి హింసాయుత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి . మన దేంలో ఔరంగజేబ్  లాంటివాడు అక్కడ కూడా పుట్టి ఉండవచ్చు .  
   

Defining an addictive game (Addictive game theory)

1. At every move you have large number of choices to make .
2. When the strategies prone to be highly dynamic with respect to the last state of the game.
3. When the rules are simple to understand.
4. Should be time taking for calculating a move
5. (Important) When there is a large chance of success due to opponents miscalculation of a strategy.
6. when your performance measured in the game is either improving or there is a chance to improve in the next trial of the game. 

గుడ్డు మీద ఈకేనా ??

బర్రాక్ ఒబామా ఈరోజు "religious  intolerence "ని ఉటంకిస్తూ  బిజెపి ని టార్గెట్ చేసాడనిపిస్తుంది . ఎందుకు ఇంత హఠాత్తుగా వాడికి భారతదేశాన్ని కేలకాలనిపించింది ? అని ఆలోచిస్తే  ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తొచింది . ఈ పార్టీ కి చాలా వరకు నిధులు అమెరికన్ NSA సహాయం చేస్తుందన్న పురాతన వార్త  గుర్తొచ్చింది . దీన్నిబట్టి ఢిల్లీ లో అమెరిక మాట వినే పార్టీ (here AAP or Congress  may be, god  knows  the truth if  he exists  )గెలవటం కోసం ఒబామా  చేస్తున్న "ఉడతసాయమో" లేక "గురిగింజకింద నలుపులాంటి  వెఱ్రివాగుడో " .