About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

రైతుకి నమ్మక ద్రోహం

అటు కేంద్రం లో  ఆర్డినెన్సు పేరుతో , ఇక్కడ రాష్ట్రంలో రాజధాని పేరుతో  అమాయక రైతుని అడ్డంగా మోసం చేస్తున్నారు .
బలవంతంగా దుక్కి దున్నే భూమి లాక్కోవటం కంటే  నీచమైన పని లేదు . పచ్చగా లేని భూములే దొరకలేదా ? కనీసం నోట్లో ముద్ద  పెట్టినప్పుడైనా  కాదా ? ఏది ముఖ్యమో ఏది తరువాతో . అభివృద్ధి పేరుతో ఎవరిని మోసం చేస్తున్నారు ?
ఇక్కడ రాష్ట్రం లో రైతులకి బాబు నచ్చ చెప్తాడంట ! ఏంటి దానర్థం ? అమాయకులకి బెదిరింపులా ?
ఆ నచ్చచెప్పుడేదో తన తెలుగు తమ్ముళ్ళకే  చెప్పవయ్యా , అంత వ్యాపార మదం ఎందుకని ? చైతన్య నారాయణ పేర్లతో ఇప్పటికే విద్యని భ్రష్ట పట్టించారు నారాయణ అండ్ కో . చంద్రబాబు కి  అన్నం పెట్టె పొలాలు పచ్చగా ఉండటం ఎందుకు అర్థం కాదు . కాంక్రీట్ జంగల్ సరైన అభివృద్ధి కాదు .  

కామెంట్‌లు లేవు: