About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

రిజర్వేషన్లను ద్వేషించే మహామహులకు మాత్రమే !

1. అన్ని కులాలు సమానం అని భావిస్తే కులాంతర వివాహం చేసుకోగలరా (ప్రేమించి వాడుకోవడం వరకు కాకుండా )? చారిత్రిక, వైదిక  జ్ఞానాన్ని  పంచివ్వగలరా ?
2. ఒకవేళ అసమానమని అగుపిస్తే  దానికి తగ్గ మూల్యం (ప్రజాతంత్ర వ్యవస్థలో ) అణగదోక్కిన వర్గాలకు  చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయగలరా ?
3. ప్రతి ఊరి చివర మాల మాదిగ కులాలను ఎందుకు వేరుగా దూరంగా  చివరగా ఉంచారు . ఇప్పటికీ పోలేదు ఆ దుర్నీతి మన అగ్ర వర్ణ పాలకులలో. 
4. ఇప్పటికే దేశం వెనకబడిపోయింది . జనాభాలో సగం ఐన ఆడవాళ్ళని ఎదగనివ్వం . మిగతా సగం లో సగం ఐన బడుగు బలహీన వర్గాలని ఇన్నాళ్ళూ విద్యకు అనర్హులని చేసి తరతరాలకు గాని మర్చిపోలేని బానిసతత్వాన్ని వారి DNA లో చేర్చారు . ఇప్పటికైనా చేసిన తప్పులని ఒప్పుకుని , వారి సమానత్వం సాధన పరిపూర్తి అయ్యేంతవరకు రిజర్వేషన్ అమలుకు అంగీకరిస్తూ  దేశభక్తి చూపించుకోవాలి .
5. ఆరోజు రానంతవరకూ మనమంతా పాశ్చాత్య విజ్ఞానాన్ని అర్థిస్తూ (అడుక్కుంటూ ) అమ్మమని బ్రతిమాలుతూ ఉండాలి .   

కామెంట్‌లు లేవు: