About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

భూకంప మేళా !

సరిగ్గా 2015 ఏప్రిల్ 25న  నాకు మొట్టమొదటిగా భూకంప ప్రాసన జరిగింది . ఆ రోజు  పొద్దున్న మంచి నిద్రలో ఉన్నా , 11:45కి సరిగ్గా ఎవరో నా మంచాన్ని ఎత్తి  కొంచెం తేడాగా ఊయల ఊపుతున్నట్టుగా ఉంది , కానీ అదేం  అంత హాయిగా లేదు , కొంచెం తల తిరిగినట్టుగా అనిపించింది .   హఠాత్తుగా లేచి చూసెసరికి కొంచెం భయపడ్డా . రాత్రంతా ల్యాబ్ లో పని చేసి ఉండటం వల్లనేమో , మొదట ఏమైనా నరాల బలహీనత , నిద్రలేమి కారణంగా  అలా అనిపిస్తుందేమో అని కొంచెం బొక్కబోర్లా లేచి నన్ను నేను గట్టిగా బిగపట్టి  పరీక్షించుకుంటున్నా . ఐనా   సరే  తగ్గలేదు . ఇప్పుడు తట్టింది నా బుర్రకి ఇదేదో భూకంపం చాయలతో ఉందని గ్రహించా. నా లాంటి పరిస్థితిలో ఇంకెవరైనా వున్నారా అని బయటికి వచ్చి చూస్తున్నా . ఈలోపు మూడవ అంతస్తు విద్యార్థులు క్రిందకు పరుగు లంఘించారు . నేను సుతారంగా ఓపుకుంటూ నెమ్మదిగా కిందకు వచ్చి అందరితో పాటు నుంచుని భూకంప మేళాలో మొదటి పర్యాయం  కనులవిందుగా  తిలకించాను .( విందా నా బొంద ! ఉచ్చ  పడింది )
   కాసేపటికి అందరం ఎవరి గదులలోకి వారు వెళ్ళిపోయాం . నాకు ఇక రూం లో ఉండటం వల్ల  కాదని  మళ్ళీ మా గణిత పరిశోధన విభాగానికి బయలుదేరా .
     లాబ్ లో ఉండగా మద్యాహ్నం 12:50కు ఇంచుమించుగా మా  IIT కాన్పూర్ ఆరంతస్తుల  FACULTY భవనం (నేను ఐదవ అంతస్తులో , అంటే గాలిలో ఉన్నా )  మేళాలో రెండవ పర్యాయం ఆరంభించింది . ఈసారి ఆలోచించేది లేదు , కిందకు తాపీగా ఓపుకుంటూ దిగాను , అయినా ఎక్కువ సేపు లేదు లెండి . ఆరోజు నిద్రపడితే ఒట్టు , దీనమ్మ జీవితం .
      రెండవ రోజు సరిగ్గా  ,మధ్యాహ్నం 1:25 కి మళ్ళీ నిద్ర లోచి ఉలిక్కి పడ్డా , ఇంకేముంది మళ్ళీ అదే ! పరుగో పరుగు కిందకి.
    మూడవరోజు కూడా అదే సమయానికి నిద్రలో ఉన్నా కానీ భూమీ కంపించలేదు , కానీ నిద్రలో అకస్మాత్తుగా లేచి కిందకి పరిగెత్తా . ఒక్కరూ బయటికి రాలేదు . అప్పుడు అర్థమయ్యింది నాకు బాగా ఎక్కేసిందని .
 ఆ దెబ్బకి రోజూ ఏదో ఒక నిమిషం అంటే ఇప్పటికి  కూడా భూమి కదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది .  థూ  నా జీవితం  ! 

చదువులు మనవి సోకు అమెరికాది

ఇక్కడ ప్రభుత్వాలు కిందో మీదో పది ఐ ఐ టి లో పిల్లల్ని  చదివిస్తే వాళ్ళందరూ అమెరికాకు ఎగిరిపోయి జీవిన్తాంతం అక్కడే సోకులతో గడిపేస్తున్నారు .  
     ఏ మాత్రం చదువు వచ్చినవాడు  బయటికి పోతుంటే  ఇక్కడ సమాజం ఎప్పటికి బాగుపడుతుంది ? 
ఎప్పటికీ విజ్ఞానాన్ని కొనుక్కునే దుస్తితేనా ? 
    ఒక విజ్ఞానవంతుడైన ఆచార్యుడు మన దేశం లొనే ఉంటే  కనీసం తన జీవిత కాలంలో ఇంకో 30 మంది విజ్ఞానవంతుల్ని తీర్చిదిద్దగలడు . తరతరాలుగా ఈ బుద్దిమాంద్యం కొనసాగుతోనే ఉంది . 

ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో ... (పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక )

ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో  ఇంతటి మేలుంటుందని ఎప్పుడూ  గ్రహించలేకపోయా .
అభిమానం పేరుతో వెర్రిగా గంతులేసే జనాన్ని చూసి  చాలా  చులకనగా చూసేవాడిని .
  కానీ  కొన్ని కష్ట సమయాల్లో  ఎటూ దారి తోచని స్థితిలో  ఒకరిపై ఉన్న అభిమానం వారిని బ్రతికించటమే కాక గంతులేఇంచేస్తుంది.  పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక నేను కూడా ఎవరో ఒక ప్రముఖుల్ని పిచ్చిగా అభిమానించడం నేర్చుకోవాలన్న ఆశ (దురాశో ) పుట్టింది .

ఇక్కడ పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడో లెదో తెలియదు కానీ అతన్ని అభిమానించే కుర్రకారుకి  మాత్రం  వారి చావు కాలంలో ఖచ్చితంగా  వెర్రి అభిమానం అనే  ఒక లైఫ్ లైన్ ఉందని గ్రహించాలి .
   ప్రతి దానికీ అతిగా ఆలోచించే నాలాంటి వాళ్ళకి ఉత్త మందులు-మాకులే శరణ్యం తప్ప ఏ దేవుడూ కాపాడలేడు . :D        

Nice quote by Ashish Goyal, A young Blind entrepreneur

"The more you trust people, the more they are empowered to help" -Ashish
Goyal,

మనస్సుకి బుద్దికి తేడా

అసంకల్పిత చర్యలను  (unconscious  activities ) మనసు అంటాం . 
సంకల్పిత చర్యలను (conscious  activities ) బుద్దితో  ప్రత్యేకంగా ఆలోచించి  చేస్తుంటాం . 

విశ్వం ఒకవైపు మాత్రమే చూడగలం

ఇంకా చెప్పాలంటే సగం కూడా పూర్తిగా చూడలేం .
Universe visible on nights only to telescopes
రాత్రిళ్ళు మాత్రమె చూడగలిగిన విశ్వాంతరాళం 

ఈ  అనంత విశ్వాన్ని  రాత్రి మాత్రమే చూడగలం . 
ఒక నెలలో అంటే 360 డిగ్రీల కోణంలో కొంత భాగం (12 వ భాగం )మాత్రమే  చూడగలం . సూరుద్కి అవతఃలి నక్షత్రాలు చూడాలంటే కనీసం 6 నెలలు ఆగాల్సిందే . 

రాతి యుగం జీవన శైలి . దానికొక మతం అనే ముసుగు

ఇసిస్ ఆవిర్భావ తదనంతర వార్తలు ఇలా ఉన్నాయి .

1. లాటరీ వేసుకుని మరీ రేప్ చేశారు.. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అకృత్యం! 

2. Peter Kassig beheaded by ISIS with 16 Syrians 

3. Islamic State Beheads Japanese Journalist Kenji Goto 

4. Now even CHILDREN are re-enacting ISIS beheading videos in sick stunt staged for YouTube . 
5. Fifteen beheadings in Afghanistan
6. Kobane and eastern Syria beheadings
7. ISIS releases horrifying sex slave pamphlet, justifies child rape
8. ISIS escapee: 'Men would come to buy girls to rape them'
9. ISIS militants- A young Yazidi woman raped 30 times in just a few hours
10. For ISIS, rape is a calculated strategy
The Islamic State sees the abuse of women as a weapon, not only a means of punishment and show of power.

11. British female jihadis running ISIS 'brothels' allowing killers to rape kidnapped Yazidi women
12. ISIS welcomes women — if they’re young and bring lingerie


Modeling spread of Air pollution to control the levels

Modeling India's Air pollution map dynamically will help the people
understand the serious
consequences of their surrounding air quality. And to improve one's
city's fresh air quotient.

మన్మోహన్ బొగ్గు స్కాం ఉదంతం, మంచివాడి మౌనం వల్ల జరిగే దారుణాలకి నిదర్శనం

ఒక ప్రధాని పదవి విలువని చెప్పే ఉదాహరణ మన్మోహన్ బొగ్గు స్కాం దస్త్రం . 
ఒక అసాధారణ శక్తివంతమైన పదవి లో ఉన్నప్పుడు కొన్ని చోస్తూ ఊరుకోవడం మహా నేరం . దీనికి ఖచ్చితంగా పూర్వ ప్రధాన మంత్రి  ఖచ్చితంగా భాద్యుడే . 
  రానున్న రోజుల్లో ఎవరైనా ఇలాంటి మరమనిషి ప్రధానులకు ఇది ఒక గుణ పాఠం . 

మందుబాబులకి శుచి -శుభ్రతల గురించి మాట్లాడే అర్హత లేదు

శుచి -శుభ్రతలు ఎందుకుండాలి ? 
    ఆరోగ్యం కుదురుగా ఉంచుకోవడానికి , జబ్బుల  పాలవకుండా ఆసుపత్రుల పాలవకుండా  ఇల్లు-వళ్ళు  గుల్ల కాకుండా బ్రతకడానికి . ఇంతా మాట్లాడే మనం మద్యం , సిగరెట్ట్ విషయానికొస్తే అవన్నీ పక్కన పెట్టేసి ఇష్టమొచ్చినట్టు తాగుతారు . అప్పుడు కాలేయం గురించో , ఊపిరితిత్తుల గురించో ఆలోచన రాదు . 
అందుకే మద్యపాన మహాశయులు పరిశుభ్రత , ఆరోగ్యమైన ఆహారం గురించి మరచిపోవాలని నా విన్నపం . 

వెబ్ పేజి నుంచి వ్యాపార ప్రకటనలు తొలగించాలంటే ....

గూగుల్ క్రోం , ఫైర్ ఫాక్స్ అయితే  right  click  చేసి "Inspect Element " ఆప్షన్ నొక్కండి . 
కనిపించిన code మీద ఎలుకను కదపండి , ఆ code కి  సంబంధించిన భాగం అసలుపేజీలో  ప్రస్ఫుటమవుతుంది . 
మీఋ ఆ భాగం తీసేయాలనుకుంటే code మీద right  click చేసి delete  చేయండి . 

                    గంతనే !


తెలుగుని బ్రతికించే చిన్న చిన్న పనులు

1. తెలుగులో దినచర్యలను మన డైరీ లలో చేతివ్రాతలో వ్రాసుకోవటం . ఇందులో ఒక లాభం ఉంది  (తెలుగు నేర్చిన తెలుగు  వారు తప్ప ఇంకెవరూ చదవలేరు )
2. youtube , facebook  లలో తెలుగు లిపిలో వ్యాఖ్యలు వ్రాయాలి .
3. పిచ్చాపాటిగా నచ్చిన మాటలు , నేర్చిన విషయాలు  బ్లాగులలో  ప్రచురించాలి . (కొన్ని ఏళ్ళ తర్వాత మొత్తం కలిపి ఒక పుస్తకంగా  అచ్చు వేయించుకుని మన జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు )
4. శా స్త్రజ్ఞులైనచో  విషయ పరిజ్ఞానాన్ని కుదిరినంతలో తెలుగులో  వికీపీడియా నందు పొందుపరచుట .
5. గూగుల్ మెయిల్ లో తెలుగు లిపిలో chatting చాయవచ్చు . ఈరోజుల్లో చాల సులువు .
6. మీ ఆపరేటింగ్ సిస్టం ను తెలుగులో వాడవచ్చు , కుదరకపోతే కనీసం browser  నైనా తెలుగుభాష version  ని వాడవచ్చు.
7.  ఆండ్రాయిడ్ OS లో తెలుగు SMS ( శుభాకాంక్షల  సందేశాలు ) పండుగలనాడైనా  పంపుకోవచ్చు . 
8. విరివిగా onlline లో నచ్చిన తెలుగు పుస్తకాలు క్రయంగావించవచ్చు. (కొనవచ్చు ) .
9. స్థానికంగా ఒక తెలుగు లైబ్రరీ ని సంఘ సహకారంతో నడపచ్చు . 

Great Historical Urgency to know what happens right after you die

Since most of the religions believe there is an after life equipped with virgins, drinks, food, 'what not' ...etc..

But nobody knows the reality. Here science has to do something to spoil all the innocence created and developed by these religious prophets or fanatics.

I would rather say this is more important problem to tackle than Rosetta Philae asteroid lander mission(Though it is a really amazing historical event).

Science has to very quickly decide whether there exists an after life or NOT. It should give more authentic results than the Higgs-Boson existence. 

చిరంజీవి-బాలకృష్ణ లకి అసలు నాయకత్వ లక్షణాలు సున్నా .

వీళ్ళు పప్పుసుద్దలు , ఇద్దరూ బావల సంక నాకేవాళ్ళే .  వీళ్ల  ప్రగల్భాలు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు .
వెంకయ్య నాయుడు కూడా ప్రత్యెక హోదా విషయంలో ఏమి ఏడవలేక మూసుకున్నాడు , తన RSS స్వామిభక్తి ఇక్కడెలా అడ్దొచ్చిందో  నాకర్థం కాలేదు .  

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలుగు కళాకారులంతా నిరసన వ్యక్తం చేయాలి

తమిలోళ్ళని చూసి మనవాళ్ళకి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు .  ఎన్నో పనికిమాలిన విషయాలకి బజారుకేక్కే తమిళ నటులు నేతలని  ఎన్నోసార్లు చూసాం .
తెలుగు నటులంతా రాష్ట్ర ప్రత్యెక హోదా కోసం  ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలి . ఇంతవరకు పవన్ కళ్యాణ్, శివాజీ  తప్ప ఒక్క నాయకుడు కూడా ఆ ఊసు ఎత్తలేదు . బాలకృష్ణ ఉన్న ఒక పెద్ద దద్దమ్మ , బావ ఎం చెప్తే దానికి గంగిరెద్దులా తలూపుతాడు . వీడికి చిరంజీవికి అసలు నాయకత్వ లక్షణాలు సున్నా .  

Mana Naanna gurinchi - Sri Trivikram gari maatallo

అంతా అమ్మ గురించి అందరూ మాట్లాడుతాం. కానీ మనం నాన్న వేలి పట్టుకునే నడుస్తాం. ఐదేళ్ల
ప్రతి పిల్లాడు తన తండ్రే సూపర్ హీరో అనుకుంటాడు. పదేళ్ల తర్వాత నాన్న కంటే ఇంకా పెద్దోళ్లు ఉన్నారనుకుంటాడు.
20 ఏళ్లప్పుడు మా నాన్నేంట్రా బాబు, పెద్ద నసగాడిలా ఉన్నాడు అనుకుంటాడు. 25 ఏళ్లప్పుడు నాన్న భలే మేనేజ్ చేశాడని
అనుకుంటారు. అదే 35 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి నాన్న చాలా గొప్పవాడని భావిస్తాం. 

Scan the food item to know its nutrition and details

1. Scanning a food item will guess the item name. This requires good data
base of food items and Image processing Algorithms.
2. Once the item being scanned it is the fetching of nutritional and
junk-value data on to the screen of the smart phone user.

I hope that this will make our youngsters to be little cautious of the
junk they are drinking and fancy-eating.

Farm Insurance for Peasants

How about arranging Insurance against Natural disasters/Price-fall
according to the Crop selected in a particular season.
This would diminish the prospects of a farmer getting into an idea of
suicide when he is in huge psychological trouble.