About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మెదడు ఎవరికైనా మోకాలునందునుండునా?

మోకాలువరకే కాదు! కాలి బొటన వేలి వరకూ ఉంటుందంటే నమ్మగలరా?

తప్పదండి, నమ్మాల్సిన రోజు వచ్చేసింది.

ప్రతి మనిషి, జంతువుల్లో పొడవైన నాడీకణం వేళ్ళ అంచుల వరకుంటాయి.

ఈ విషయం స్వయంగా Neurological Surgery lab లో చూసేవరకూ నమ్మబుద్దికాలేదు.

నేను ఈ. మధ్యనే UPMC లో Post Doctoral Research Scholar గా నియమించబడ్డాను.

మన తల వరకూ ఉండే సమస్త నాడీకణాల పటం neuronal fibre tracts ను. Mri ల సహాయంతో కనిపెట్టాలి. నేను చేయాల్సిందల్లా తప్పుగా చిత్రించబడిన నాడీమార్గాలను గణిత సూత్రాల సహాయంతో గుర్తించడం.
గణితం ఎందుకంటే! మరి నాడీ కణాలు ఒకటీ రెండూ కాదు 8600 కోట్లు.  అందుకే ఒక గణిత సూత్రాన్ని కనిపెట్టి computer program చేసేస్తే
ఇక చేస్తుంది మనం చేయవలసిన చాకిరీ!

Computer సాదా సీదా రకం కాదు కొంచెం సామర్థ్యంలో గడుసుదేలేండి 😊

కామెంట్‌లు లేవు: