About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

రెండు మాత్రికలను ( matrices) అలానే ఎందుకు గుణించాలి?

జవాబు అత్యవసరం ఐతే చెప్పండి, వెంటనే రాస్తా. 
(ఒక నెల గడిచాక......... ) 
ఒక నెల గడిచినా ఎవరూ వివరణ కోసం అభ్యర్థించలేదు . కానీ 
నా బ్లాగ్ శ్రోతలు ఈ ఒక్క టపా ని బాగా వీక్షించారు , అందుకే ఎవరూ అడగకపొయినా  రాయదలిచాను . 

ఎక్కువ మందికి ఈ మాత్రికల గుణకారం అర్థం కావాలంటే రెండు వరసలు (column )రెండు పంక్తులు (row )ఉండే 2x2 matrix తో మొదలుపెడతా .

1. అన్నిటికంటే ముందు ఒక మాత్రికను ఎందుకలా రాస్తారో తెలుసుకుందాం . " | " ఈ అడ్డగీతను మాత్రికల మధ్య గుణకారానికి ఉపయోగించబోవుచున్నాను , అలాగే ఒక మాత్రిక మరియు వరుసల మధ్య గుణకారానికి కూడా వాడుతున్నాను. 
ఒక కథలా చెప్తా! అర్థం కాకపోతే నిర్మొహమాటంగా అడిగిపారేయండి. 
2. బిర్యానీ వెల  200రూ . కోక్  ధర  50రూ .
     పవన్ కళ్యాన్ మూడు బిర్యానీలు ఒక కోక్  కొన్నాడు , అంటే  3*200+1*50 = 650రూ .
     జూ రామారావు  పాతిక బిర్యానీలు పన్నెండు కోక్ లు కొన్నాడు , అంటే 25*200+12*50=5600రూ .
    వీళ్లిద్దరిలో  ఒక విషయం  దగ్గర సారూప్యథ ఉంది , ఇద్దరూ ఒకే రకమైన తిండి కొన్నారు , కానీ పరిమాణాలు వేర్వేరు .
    అందుకే సారూప్య వస్తు విలువలను (అంటే కోక్ , బిర్యానీ ) వేరుగా , వారు ఎంచుకున్న పరిమాణాల సంఖ్య వేరుగా వ్రాస్తే
    ఒక మాత్రిక సమీకరణం తయారవుతుంది .
        3     1     ।   200   =650
       25   12    ।    50    =5600
      గుర్తుంచుకోండి, ఇలాగే వ్యక్తపరచవలసిన అవసరం లేదు. కానీ ఈ మొత్తం కార్యక్రమంలో ఒక పద్దతికి కట్టుబడి ఉండుట వల్ల వివిధవస్తువుల ప్రమాణాలను గుణించటంలో స్పర్థలు ఉత్పన్నం కావు. 
3. ఇప్పుడు ఒక బిర్యానీకి వచ్చే ఆదాయంలో సమంతకి , తమన్నాకి ఎంతెంత వాటా వుందో తెలుసుకుందాం , అలాగే కోక్ అమ్మకాల్లో ఎంతెంతో కూడా చూద్దాం .
4.  ఒక బిర్యానీ అమ్మితే , అనగా 200 రూ . లలో  పావు సమంతాకి , ముప్పావు తమన్నాకి .
        అంటే , 50*1రూ . + 150*1రూ. =200 రూ .
     ఒక కోక్  అమ్మితే సగం  సమంతాకి , మరోసగం తమన్నాకి ,
      అంటే    25*1రూ . + 25*1రూ. =50 రూ .
5. దీన్ని కూడా మాత్రిక సమీకరణం లా వ్రాసుకుంటే ,
        50  150      । 1రూ   =200 రూ
        25    25      । 1రూ   =50 రూ
6. ఇప్పుడు చెప్పండి  చూద్దాం ,  పవన్ కళ్యాన్ ఇచ్చిన సొమ్ములో సమంతా కి ఎంత చెందుతుంది ? తమన్నాకి ఎంత ?
     అలాగే , జూ రామారావు ఇచ్చిన పైకం లో  సమంతకి , తమన్నాకి ఎంతెంత పోతుంది ?
7. రెండవ సమీకరణాన్ని మొదటి దానిలో ఉపయోగిస్తే ఒక కొత్త సమీకరణం తయారవుతుంది .
     
       3     1     ।   200   =650            
       25   12    ।    50    =5600    

      లోకి 
        50  150      । 1రూ   =200 రూ
        25    25      । 1రూ   =50 రూ          ని  జొప్పించిన క్రింది సమీకరణం వచ్చును .

8.  
                3     1     ।  50  150      । 1రూ   = 650 రూ
               25   12    ।  25    25      । 1రూ   = 5600 రూ

9.  ఇప్పుడు మాత్రిక గుణకార నియమంను ఉపయోగిస్తే , ఒక కొత్త మాత్రిక వచ్చును .
              175       475   ।   1 రూ  =650
              1550   4050    ।  1 రూ  =5600

10. పుస్తకాలలో చెప్పినట్టు కాకుండా ఇంకోలా  గుణించ కూడదా  ?

11. ఎందుకంటే ,  ax+by=A            pA+qB=Y
                        cx+dy=B   and   rA+sB =Z    implies an equation in just x and y if A and B are substituted.

12.
      i.e.
                       p(ax+by)+q(cx+dy)=Y                      (pa+qc)x+(pb+qd)y=Y
                       r(ax+by)+s(cx+dy) =Z       implies    (ra+sc)x +(rb+sd)y =Z

13.  పైన ఉదహరించిన విధంగా ఒక సమీకరణంలో ఇంకొకటి చొప్పిస్తే వచ్చే కొత్త మాత్రిక విలువలు మాత్రిక గుణకార పద్దతిని నిర్దేసిస్తాయి . ఇక్కడ జరిగినదేమిటంటే ,  

               p   q   |  a  b              pa+qc        pb+qd
               r    s   |  c  d         =   ra+sc         rb+sd 

14. మీకు నచ్చిన విధంగా ఒక సమీకరణాన్ని ఎలాగైనా వ్రాసుకోండి. ఉదాహరణకు 
            3     1     ।   [200 50 ] = [650   5600] 
           25   12    ।   
కానీ పిదప అన్నిటా ఒకే నియమం పాటించండి. 
ఇది ఎంత ముఖ్యమంటే, ఎవరైనా ఒకరు సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు అంటే అందరూ దానిని తూర్పు అని ఆచరించాలి. లేకపోతే సమీకరణాల మాదిరే ఒకరు చెప్పేది మరొకరికి అర్థం కాదు. 


















కామెంట్‌లు లేవు: