ఈ సంవత్సరం హొలీ అదిరింది .
దాక్కున్న ప్రతిఒక్కడికీ రంగు పడింది .
అసలు ఇందులో వున్నా వెర్రి ఆనందం ఎలా వస్తుందో చెప్తా వినండి . !
ప్రొద్దునే లేవగానే హొలీ అని తెలిసి తలుపు తీయకుండా పడుకున్న.
ఈ లోపు ఒక చిన్న కోతి గ్యాంగ్ తలుపు తట్టాయి.
expect చేశా కాబట్టి , వెంటనే పాత బట్టలు వేసుకుని ఓపెన్ చేశా.. రంగు పడింది మాముఉలుగా కాదు.
వాళ్ళకున్న దురదతో వున్నా దూల అంత తీర్చుకున్నారు.
నేను పండు కోతినన్న విషయం నాకు గుర్తొచింది. రంగు ప్యాకెట్ లు పట్టుకుని నేను కుడా నాకున్న దురద ఇంకొంతమందికి అంటిద్దామని బయలుదేరా.
"ఎవడి దురద వాడికి ఆనందం "
ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే , అన్నయ్య ! మనకు దురదఎంత అన్నది కాదు ముఖ్యం , అవతలివాడు ఎంత గోక్కున్నాడ అన్నది ముఖ్యం.
ఇంత energetic గ హొలీ ఉండటానికి కారణం , ఇది చిన్నప్పటి దొంగ- పోలీసు ఆట ల వుంది .
నాకు ఒక విషయం అర్థమయ్యింది , జనమంతా పండగ చేసుకుంటుంటే ఒక్కరిమే ఇంట్లో కూర్చొని సొల్లు టీవీ ఇంటర్నెట్ programmes చూడటం వెర్రిపని . భవిష్యత్తులో ఏవైనా విపత్తులు వచ్చినా కలిసి , కలగలిసి సమస్య ని పరిష్కరించటానికి ఇలాంటి అవకాశాలు తోడ్పడతాయని నా ఉద్దేశం.
"మీ దురద ఇద్దరికీ అంటించండి , ఆ ఇద్దరు ఇంకో నలుగురికి , అలా అందరికీ తీర్చేయండి దూల !
శ్రీ శ్రీ శ్రీ రౌతు విజయకృష్ణ గారి మనవి "
ఒరేయ్ శ్రీనాథ్ నీకు కూడా ....