About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

అభిరుచులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అభిరుచులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

విజయవాడలో హిల్ ట్రెక్కింగ్ కు అనువైన మూడు కొండలు | Hill trekking in Vijayawada. The three hills of three religions.

1ఆగిరిపల్లి శోభనాచలస్వామి ఆలయం :
      Built by : Nuzvid zamindars in 1626 AD
      Height of the hill : 212m
      740 steps to the Temple.


2. కొండపల్లి కోట :
    Built by : Musunuri nayaks in 1436 AD
      Height of the hill :  242m to Fort and 468m to the peak has no man made trail. 
      Two routes  to reach the fort : one is pedestrian and risky And the other is beautiful ghat road .

3. గుణదల మేరీమాత గుడి :
  Built by : Fr. Pezonni, Fr. P Arlati in 1923 AD
      Height of the hill : 225m
      Two routes  to reach the slave at the cliff  : one is pedestrian path from Kristurajapuram and is very risky And the other one is also pedestrian but well built path of rocks and cement. 

Brownian motion really surprised me when I tried to simulate Stock market

save the following code in a Matlab file and run to see the graph.

clear all
x(1)=1;
sigma=0.1;
N=10000;
for t=1:N
  x(t+1)=x(t)+sigma*sign(2*rand-1);
  %x(t+1)=x(t)+randn*0.1;
endfor
plot(x);






Later I have found an article which says The brownian motion with power Laws is more practical.

was never interested in math, never dreamt of going to iit, never imagined myself in USA

what I always wanted was fishing in the Krishna river canals, cruise in big jungles and mountain ranges, and serving in army.
  This is called fate !
I used to hate physics in my bachelors and PhD. But now everyday dreaming of simulating few fluid dynamics phenomenon  by mathematically modelling them in various daily life situations.
కానీ ఏది ఎలా ఉన్నా  ప్రతిదాంట్లో కిక్కుందప్పా..... 

తినడానికి లేని సిగ్గు వండటానికి ఎందుకు ?

ఇంకొంచెం ఘాటుగా చెప్థా...
"తినడానికి లేని సిగ్గు పండించడానికి ఎందుకు ?"
అవును నేను వ్యవసాయం లోకి దిగాబోతున్నాను .
సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఎందుకు పండించలేమో  చూస్తా .
ఇస్రాయెల్ ఎడారుల్లో అన్ని పంటలు పండిస్తుంటే  మనకేం తక్కువ .
మన రైతుల్ని శాస్త్రీయంగా ఆడుకోవాల్సిన భాద్యత చదువుకున్న యువత పైన ఖచ్చితంగా ఉంది

P.S: ఈ పోస్ట్ టైటిల్ "చిరునవ్వుతో " చిత్రంలో వేణు డైలాగ్ ఇది , చెఫ్ అని ఫ్రెండ్స్ వేళాకోళంగా నవ్వితే ఘాటుగా ఇలా సమాధానం ఇస్తాడు . 

రిజర్వేషన్లను ద్వేషించే మహామహులకు మాత్రమే !

1. అన్ని కులాలు సమానం అని భావిస్తే కులాంతర వివాహం చేసుకోగలరా (ప్రేమించి వాడుకోవడం వరకు కాకుండా )? చారిత్రిక, వైదిక  జ్ఞానాన్ని  పంచివ్వగలరా ?
2. ఒకవేళ అసమానమని అగుపిస్తే  దానికి తగ్గ మూల్యం (ప్రజాతంత్ర వ్యవస్థలో ) అణగదోక్కిన వర్గాలకు  చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయగలరా ?
3. ప్రతి ఊరి చివర మాల మాదిగ కులాలను ఎందుకు వేరుగా దూరంగా  చివరగా ఉంచారు . ఇప్పటికీ పోలేదు ఆ దుర్నీతి మన అగ్ర వర్ణ పాలకులలో. 
4. ఇప్పటికే దేశం వెనకబడిపోయింది . జనాభాలో సగం ఐన ఆడవాళ్ళని ఎదగనివ్వం . మిగతా సగం లో సగం ఐన బడుగు బలహీన వర్గాలని ఇన్నాళ్ళూ విద్యకు అనర్హులని చేసి తరతరాలకు గాని మర్చిపోలేని బానిసతత్వాన్ని వారి DNA లో చేర్చారు . ఇప్పటికైనా చేసిన తప్పులని ఒప్పుకుని , వారి సమానత్వం సాధన పరిపూర్తి అయ్యేంతవరకు రిజర్వేషన్ అమలుకు అంగీకరిస్తూ  దేశభక్తి చూపించుకోవాలి .
5. ఆరోజు రానంతవరకూ మనమంతా పాశ్చాత్య విజ్ఞానాన్ని అర్థిస్తూ (అడుక్కుంటూ ) అమ్మమని బ్రతిమాలుతూ ఉండాలి .   

పంచె కట్టు పవర్

నిజాయతీ తో పాటు తెలుగు అత్మగౌరవాన్ని ప్రతిభింబించే  వెంకయ్య నాయుడు గారి పంచె కట్టుకి నేను అభిమానిని . 

నేను చెప్పేదానిలో నిజమెంత ?

వ్యాపారంలో  డబ్బు సంపాదించటం ఎలా ? అందరిలాగే నేను తెగ ఆలోచించేస్తుంటా ...  కానీ కొంచెం ఎక్కువ అత్యాశగా .

నేను అందరికీ చెప్పేదేంటంటే , లక్ష రుపాయల్ని కోటి చేయటం కన్నా  కోటిని 100 కోట్లు చేయటం మహా కష్టం అని  .
ఇది అందరికీ తెలిసిందే ..  కానీ నేనేమంటానంటే , లక్ష లాంటి చిన్న మొత్తాన్ని కోటి చేయటం  పెద్ద కష్టం కాదంటాను . సరైన ఇల్లుకి కూడా దిక్కు దివాణం లేని నేను ఈ విషయాన్నీ నేనే నిజం చేయాలనుకుంటున్నా ... దిగిన తర్వాత కానీ లోతు నాకు అంతుబట్టదు . నేను మాత్రం ఇప్పటికీ ఆ పనిని సునాయాసంగా చెయ్యొచ్చని నమ్ముతున్నాను , అందరికీ ఒకటి చెప్పలేదు , ఈ తతంగం ఎంత కాలంలో అన్నది ! ;P

ఒక వైపు  గణితపరమైన ఆలోచనలు ఇంకొక  వైపు  ధనవంతుడ్ని కావాలని . ఏ మూట  సద్దేస్తానో ఏ కొంప కూల్చేస్తానో   దేవుడికే*( ఉండి  ఉంటే  ) తెలియాలి 

One of the best played chess game

[Event "Live Chess"]
[Site "Chess.com"]
[Date "2014.05.25"]
[White "rowthu007"]
[Black "aajay76"]
[Result "1-0"]
[WhiteElo "990"]
[BlackElo "1054"]
[TimeControl "30|0"]
[Termination "rowthu007 won by checkmate"]

1.c4 e5 2.d4 e4 3.f4 f5 4.e3 Nc6 5.d5 Nb4 6.a3 Na6 7.Bd2 Ne7 8.g4 g6 9.g5 b6 10.b4 Bg7
 11.Ra2 c5 12.b5 Nb8 13.Nc3 Bxc3 14.Bxc3 Rg8 15.d6 a6 16.Bf6 axb5 17.dxe7 Qc7 18.cxb5 c4 19.Qd5 Rf8 20.exf8=Q+ Kxf8
 21.Qxa8 c3 22.Qa4 Qc5 23.Kf2 d5 24.Bd4 Qe7 25.Bxc3 Qf7 26.Rd2 Nd7 27.Bb4+ Kg8 28.Qa8 Qe8 29.Qxd5+ Kg7 30.Bc3+ Nf6
 31.Bxf6+ Kf8 32.Qd6+ Kf7 33.Bc4+ Be6 34.Bxe6+ Qxe6 35.Qc7+ Kf8 36.Rd8+ Qe8 37.Rxe8+ Kxe8 38.Qe7# 1-0

my best ever checkmate

[Event "Live Chess"]
[Site "Chess.com"]
[Date "2014.02.10"]
[White "rowthu007"]
[Black "dalnoboy"]
[Result "1-0"]
[WhiteElo "967"]
[BlackElo "937"]
[TimeControl "30|0"]
[Termination "rowthu007 won by checkmate"]

1.c4 c6 2.b4 d5 3.Na3 e6 4.d4 Bxb4+ 5.Bd2 Bxa3 6.Qb3 Be7 7.Bb4 a5 8.Ba3 Nf6 9.cxd5 exd5 10.e3 O-O
 11.Qc2 Bxa3 12.Bd3 Bb4+ 13.Ke2 Bg4+ 14.f3 Bh5 15.Bf5 g6 16.a3 Be7 17.Bd3 g5 18.h3 Bg6 19.Kf2 Bxd3 20.Qxd3 Bd6
 21.a4 Qc7 22.Ne2 Na6 23.h4 Nb4 24.Qf5 h6 25.hxg5 Qd7 26.Qxf6 Qd8 27.Qxh6 f6 28.g6 Rf7 29.Qh8# 1-0



Language barrier when teaching to tribal students

As we are imposing our own traditions and constraints on them to become so called civilized people, I have decided to prepare a language free educational content /syllabus for tribal education upto some elementary standards.

P.S: after reading the  report by a tribal teacher
 on tribal education i want to do it in the way, told.

Madly fell in love with chess

The world championship between Anand and the kid, carlsen was the actual point that raised my Epinephrine(adrenalin) levels for the brutal mind game of chess. Previously I was an addict to stock market , now chess making me mad(playing all the nights on chess servers with worldwide players, of course losing all the matches). One more thing that doesn't need any explanation that i am an addict is Cricket(not TV watching). Still suffering from it . Next is, that  amazing math problems enticing me for all the day and night for a tireless romantic battle(won most of the times).
  Third is my fiance :)

అమృతం ధారావాహికలో నాకు పిచ్చపిచ్చగా నచ్చినవి amrutham best episodes

చవితి చందమామ : పెద్ద ఎలుక : https://www.youtube.com/watch?v=vwPXHh1DMcE
నాన్న : నెమ్మదిగా నడిచే  మరణి  parts 1 ,2, 3  :
                        https://www.youtube.com/watch?v=e4s8T9RBkHU
                         https://www.youtube.com/watch?v=rsVt4VmWQO4
                         https://www.youtube.com/watch?v=zpNRaJ5CXhA
రబ్బరు బాలాజీ : సీరియల్  కన్నీటి వరద parts  1 2 :
                         https://www.youtube.com/watch?v=rqyikzvJ6b8
                         https://www.youtube.com/watch?v=rqyikzvJ6b8
ఆం సెట్ , Eamcet exam కోచింగ్ :
                         https://www.youtube.com/watch?v=PTynrM22FZg
రోగం రోగం ,  అప్పాజీ పిచ్చ తిండి :
                        https://www.youtube.com/watch?v=63K8Q_lz6To




            

భారతదేశ పంటలు వాటి mathematical dynamic Models

ఒక్కొక్క పంట రకాన్ని , అది నాటినకాడినుంచి కాయలిచ్చేవరకు జరుగుతున్న మార్పులను ఆధారం చేసుకుని , ఒక Dynamical model చేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించొచ్చు.
   ఆ నమూనాలో intermediate supplements effect ఖచ్చితంగా చేర్చటం వల్ల అది ఒక మంచి శాస్త్రీయ  పద్దతిగా మారవచ్చు . కానీ ఒక మొక్క బ్రతికే కాలం నెలలు కావటం వల్ల మరి numerical timestep చిన్నది కావటం వల్ల , సూపర్ కంప్యూటర్స్ తో parallelize చేయాల్సిన తప్పని పరిస్థితి రావొచ్చు .

   ఖచ్చితంగా చెప్పాలంటే , ఇది weather forecasting model కి బాగా దగ్గరగా ఉంటె బాగుంటుంది , ఎందుకంటే previous data dependency మంచి prediction ఇవ్వగల్గుతుంది. అయితే త్వరగా నేను climate change dynamics త్వరగా చదవాల్సివుందనమాట . చూడాలి ఎంత త్వరగా ముగిస్తానో .
P.S. ప్రస్తుతం మిరియాలు పెంచుతున్నా ... వీటి కోసమే కదా వాస్కోడగామా మన కొంప ముంచాడు . :D

Mathematics Consultancy in India

మన  తెలుగోళ్ళంతా కలిసి పాలు(డబ్బు ) బాగా వస్తాయని బర్రెల్లాగా ఇంజనీరింగ్ , మెడిసిన్ తప్ప మిగతావన్నీ సంక నాకించారు . ఎవరికీ సరిగ్గా లెక్కలు రావు , చెప్పాలంటే కాలేజీ టీచర్లకే తెలీదు వాళ్ళేం లెక్కలు ఎందుకు బోధించారో.
ఇక్కడ IIT కాన్పూరు లో రీసెర్చ్ వెలగబెడుతున్న చాలామందికి తాము చేసే లెక్క ఎవరికీ ఉపయోగపడుతుందో కూడా తెలీదు .
    మరి ఇండస్ట్రీ లో తేలని లెక్కలు కోకొల్లలు . సామాన్యంగా అలాంటి గణిత సమస్య తలెత్తినప్పుడు ఎవరో ఒక తెలిసిన ప్రొఫెసర్ ని సంప్రదిస్తారు . ఆ ప్రొఫెసర్ దానికి అంత త్వరగా  మాత్రం తేల్చడు , చివరికి చేసిపెడతాడో లేదో కూడా చెప్పటం కష్టమే. ఇదంతా ఒక ఎత్తైతే , నా అసలు సమస్య ఏంటంటే .... MSc IIT లో చేసి కూడా చివరికి ఒక పనికిమాలిన (శ్రీ చైతన్య , నారాయణ ) వాళ్ళ చెంతకు వెళ్లి  అర్థిస్తే నాకు 4000Rs నెల ముష్టి ఇస్తామన్నారు .
    ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు , బహుళ ప్రజ్ఞ కలిగి ఉన్నా చివరికి మాధ్యమిక (intermediate +2) కాలేజీల బాట పట్టాల్సి వచ్చింది , నా లాంటి వాళ్ళందరికీ . అది కాదని ఇంజనీరింగ్ కాలేజీ కి కూడా ప్రయత్నించా , అక్కడ రెండింతల ముష్టి అంటే 8వేలు పారేస్తారంట . mathematics లాభసాటి బర్రె కాదని జనం దాన్ని తన్ని తరిమేసారని నాకు అర్థమయ్యింది .
   చివరికి దిక్కు లేదనుకుని software company లో చేరాను . అది ఒక బద్దకస్తుల కేంద్రం . ఒక్కడి కష్టంమీద మొత్తం టీం టీం కాలర్లు ఎగరేస్తాయి , పెళ్లికొడుకైతే   కొండెక్కి కూర్చుంటాడు  కట్నం విషయంలో.  ప్రతి ప్రాజెక్ట్ కి ఎంతో కొంత గణిత సమస్య తప్పకుండా వచ్చి తీరుతుంది . అసలు నాకు ఉద్యోగం లభించింది కూడా అవి పరిష్కరించటానికే .
    అన్ని సంస్థలకి ఇదే పెద్ద సమస్య , దీనికి గాను మనమే ఒక గణిత సలహా /సమాచార సంస్థ పెడితే బాగుండు కదా అనిపించింది . దేశంలో ఉన్న ఏ మాత్రం తెలివైనవారుపరదేశాలు పయనం అవుతారు . ఇక మిగిలిన తెలివైన వారిలో నేనొకడిని . maths లో బహుముఖాభిరుచి  కలిగిన అందరికీ గౌరవప్రదమైన స్థాయి కల్పిస్తా .
   కానీ ఈ పని చేసేముందు , సంస్థలు అసలు ఆసక్తి చూపిస్తాయో  లేదో  అధ్యయనం (survey) చేయాల్సివుంది .        

Business oriented Software Projects using optimization for Nutrition based Food menu for given budget

Idea:
   It is not at all easy for any person to select Food items for his/her daily 3 time meals to match basic Nutritional requirement per day in a given amount per month.
 The idea is as follows,
     Depending on the Nutritional Information of each food item and standard requirements of nutrients for aperson, a design has to be made to chose Items according to the budget allocated for Food in that month . Consequently an Indicator should tell how close the Result is to the the standard required diet for that given budget allocation.


2013 వరకు నా ఇష్టాలు my longtime favorites till 2013

1.  రొయ్యల కూర  Shrimp/prawns fry
2.  పనస తొనలు  jack fruit
3.  ప్లమ్స్ (అల్బకర) albakara plums
4.  దానిమ్మ pomegranate
5.  పుట్టకొక్కుల కూర mushroom curry
6.  సున్నిఉండలు
7.  మామిడి తాండ్ర 

ఈ మధ్య వచ్చిన పాటల్లో మంచి తెలుగు వినగలిగిన పాట

కాంతా  మన  వసీకరా.. (వయోలిన్ పాట )  , చిత్రం పేరు - ఇద్దరమ్మాయిలతో

బిళ్ళ గేట్స్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది

ఒక సాఫ్ట్ వేర్  వ్యాపారిగా చాలా కుతంత్రాలు చేసి ఉండొచ్చు , కానీ ఈరోజు TEDx  talks లో వాడి దూరాలొచన ఇంకా ప్రకృతి పట్ల వాడికున్న భాద్యత నాకు నచ్చాయి .  కానీ ఇప్పటికీ విండోస్ నచ్చదు . వైరస్లకు  విండోస్ ఒక కంచుకోట . లినక్సు లో వాటి ఆట చెల్లదు .