మన తెలుగోళ్ళంతా కలిసి పాలు(డబ్బు ) బాగా వస్తాయని బర్రెల్లాగా ఇంజనీరింగ్ , మెడిసిన్ తప్ప మిగతావన్నీ సంక నాకించారు . ఎవరికీ సరిగ్గా లెక్కలు రావు , చెప్పాలంటే కాలేజీ టీచర్లకే తెలీదు వాళ్ళేం లెక్కలు ఎందుకు బోధించారో.
ఇక్కడ IIT కాన్పూరు లో రీసెర్చ్ వెలగబెడుతున్న చాలామందికి తాము చేసే లెక్క ఎవరికీ ఉపయోగపడుతుందో కూడా తెలీదు .
మరి ఇండస్ట్రీ లో తేలని లెక్కలు కోకొల్లలు . సామాన్యంగా అలాంటి గణిత సమస్య తలెత్తినప్పుడు ఎవరో ఒక తెలిసిన ప్రొఫెసర్ ని సంప్రదిస్తారు . ఆ ప్రొఫెసర్ దానికి అంత త్వరగా మాత్రం తేల్చడు , చివరికి చేసిపెడతాడో లేదో కూడా చెప్పటం కష్టమే. ఇదంతా ఒక ఎత్తైతే , నా అసలు సమస్య ఏంటంటే .... MSc IIT లో చేసి కూడా చివరికి ఒక పనికిమాలిన (శ్రీ చైతన్య , నారాయణ ) వాళ్ళ చెంతకు వెళ్లి అర్థిస్తే నాకు 4000Rs నెల ముష్టి ఇస్తామన్నారు .
ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు , బహుళ ప్రజ్ఞ కలిగి ఉన్నా చివరికి మాధ్యమిక (intermediate +2) కాలేజీల బాట పట్టాల్సి వచ్చింది , నా లాంటి వాళ్ళందరికీ . అది కాదని ఇంజనీరింగ్ కాలేజీ కి కూడా ప్రయత్నించా , అక్కడ రెండింతల ముష్టి అంటే 8వేలు పారేస్తారంట . mathematics లాభసాటి బర్రె కాదని జనం దాన్ని తన్ని తరిమేసారని నాకు అర్థమయ్యింది .
చివరికి దిక్కు లేదనుకుని software company లో చేరాను . అది ఒక బద్దకస్తుల కేంద్రం . ఒక్కడి కష్టంమీద మొత్తం టీం టీం కాలర్లు ఎగరేస్తాయి , పెళ్లికొడుకైతే కొండెక్కి కూర్చుంటాడు కట్నం విషయంలో. ప్రతి ప్రాజెక్ట్ కి ఎంతో కొంత గణిత సమస్య తప్పకుండా వచ్చి తీరుతుంది . అసలు నాకు ఉద్యోగం లభించింది కూడా అవి పరిష్కరించటానికే .
అన్ని సంస్థలకి ఇదే పెద్ద సమస్య , దీనికి గాను మనమే ఒక గణిత సలహా /సమాచార సంస్థ పెడితే బాగుండు కదా అనిపించింది . దేశంలో ఉన్న ఏ మాత్రం తెలివైనవారుపరదేశాలు పయనం అవుతారు . ఇక మిగిలిన తెలివైన వారిలో నేనొకడిని . maths లో బహుముఖాభిరుచి కలిగిన అందరికీ గౌరవప్రదమైన స్థాయి కల్పిస్తా .
కానీ ఈ పని చేసేముందు , సంస్థలు అసలు ఆసక్తి చూపిస్తాయో లేదో అధ్యయనం (survey) చేయాల్సివుంది .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి