About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తేరగా వాడుకోండి .

http://e5.onthehub.com/WebStore/ProductsByMajorVersionList.aspx?ws=d79970cf-5f9b-e011-969d-0030487d8897&vsro=8&JSEnabled=1

ఇది IIT కాన్పూర్ కాంపస్ లోపల మాత్రమే పనిచేస్తుంది.
ఉచితంగా ఇవ్వటం అనేది మైక్రోసాఫ్ట్ భారతదేశ విద్యార్థులతో ఆడుతున్న ఒక పెద్ద మాయలాట
 మన దేశంలోని చాలా సంస్థలలో మైక్రోసాఫ్ట్ ఈ అందమైన కుట్ర చేస్తూ వస్తుంది.
ఇప్పటి తరం లినక్సు OS అంటే పడిచస్తుంది , ఎందుకంటారా?  ఏంచేతంటే అంతా ఉచితం , అసలు సత్యం చెప్పాలంటే  GNU /LINUX మీ చేతి కీలుబొమ్మ , మీరు ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు ఒకవేళ  మీకు వెర్రి ఎక్కువుంటే .
మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ ఆటలు చెల్లవు , అది ఎలా చెప్తే అలా మీరు చేయాలి . మీ సమాచారం ఎంత బయటికి చేరవేస్తుందో ఎవరికీ తెలీదు .
అదంతా సరే , మరి దీనికినూ , మైక్రోసాఫ్ట్ తేరగా ఇవ్వటానికినూ  కారణం ఏమిటి ?
చెప్తా వినుకోండి ! ఎంతంటి కష్టమైనా సరే దున్నేయాలనే సత్తా యవ్వన(teenage ) కాలంలోనే ఉంటుంది , అలాంటి సమయంలో మన భారత దేశ యువత  LINUX  నేర్చుకుందంటే  ఇంకేమన్నా ఉందా ! మైక్రోసాఫ్ట్ దివాలా తీస్తుంది అంతే .
  LINUX  పుట్టి పెరుగుతూ  వస్తుంది శాస్త్రీయ మహామహుల నిలయమైన ఐరోపా ఖండం నుంచే . ఇప్పటికే IIT 's  లో LINUX ఒక మహావృక్షం అయ్యే స్థాయికి చేరువవుతోంది . మరి మైక్రోసాఫ్ట్ ఎలా నెగ్గాలనుకుంటోంది ?
ఎలాగంటారా? ప్రతి సంవత్సరం విద్యాలయాల్లో కొత్త నీరు వస్తుంది పాత నీరు పోతుంది .ఇక్కడే మైక్రోసాఫ్ట్ వస్తువుల్ని ఫ్రీగా ఇచ్చేస్తే  వాటికి అలవాటు పడి , చివరికి పట్టా తో బయటికి వెళ్లేసరికి linux ఏంటో తెలియకుండా ఉంటుంది . తద్వారా వారి తర్వాతి జీవితం మరింకా వారు పని చేసే కంపెనీలలో కూడా windows  మాత్ర్తమే దిక్కయ్యే పరిస్థితి తెప్పించుకోవటం కోసం . BillGates ! నువ్వు కాదురా !
   LAPTOP ఖర్చులో విండోస్ ఖర్చు కనీసం 4000Rs   ఎంతమందికి తెలుసు ? ఏదో ఫ్రీగా వస్తుందనుకుంటారు చాల మంది . కొంతమందికి windows  కాకుండా GNU/LINUX OS , APPLE OS  వంటి వినూత్నమైనవి ఉన్నాయనే తెలీదు .
 ఈరోజుల్లో LINUX 1000 రకాల పైనే లభిస్తున్నాయి ,ఒక్కో  రకానికి ఒక్కో ప్రత్యేకత .
చెప్పాలంటే  UBUNTU  దూసుకుపొతుంది , ఎందుకంటే windows  కంటే easy పైగా అన్నీ ఉచితం and  మార్పులు చేసుకోవచ్చు .
ఒక్క UBUNTU లోనే 10 రకాలు ఉన్నాయి , edubuntu  చదువు కోసం
                                                                  xubuntu  మంచి graphics games  కోసం
                                                                  lubuntu   తేలికపాటి పరికరాలలో అతిశీఘ్రంగా పనిచేయుటకు
                                                                  kubuntu  windows  లాంటి look  కోసం
                                                                 ఇంకా బోలెడు .......
ఈ UBUNTU  అనేది లినక్సు సముద్రం లో ఒక నది మాత్రమే , దీనిని మించిన OS  లు కోకొల్లలు .ఒక్క్కోక్కదానిది ఒక్కో గొప్ప .
programming  కి వస్తే LINUX  లో ఉన్నంత హాయి లేదమ్మా !
Germans వాడేది openSUSE
స్పానిష్ వారు వాడేది MANDRAKE
మన భారతదేశం CDAC  వారు BOSS  LINUX చేసారు ,
  స్వేచ్చా ఫౌండేషన్ వారు స్వేచ్చా తెలుగు లినక్సు  చేసారు .
ఇంతేకాక ఇప్పుడు ప్రతి లినక్సు లో మీరు తెలుగును తెలుగు అక్షరాలలో మెనూ నుంచి folder ల వరకు  అన్ని స్థాయిలలో వాడుకోవచ్చు , వాడుక కూడా కడు సులభం సుమీ ! :D

కామెంట్‌లు లేవు: