About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Telugu News Judge channel

ప్రస్తుత అంధ్ర దేశంలో ఇన్నిన్ని తెలుగు ఛానల్స్  ఉండటంవల్ల  , వాళ్ళలో పోటీ పెరిగి లేనిపోని న్యూస్ అనవసరంగా తయారుచేసి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు . ఎప్పుడు చూసినా ఏదోఒక పిచ్చి వార్తతో ( బ్రెయినేసుకుని పడిపోవలన్నట్టు ) ఒక వెర్రి కథనంతో  మొదలుపెట్టి  చివరికి అది జనం అలా అనుకుంటున్నారని పెద్ద అబద్దంతో  ముగించటమే కాకుండా  పాపం ఆ కథ ఎవరి చుట్టూ చుట్టారో  వాళ్ళకి కూడా  మనశ్శాంతి లేకుండా లేనిపోని సమస్యలు తెచ్చి పెడతారు .
   అందుకే ఒక న్యాయనిర్ణేత ఛానెల్  ఉండాలి , అందులో ప్రతి పేరుమోసిన వెర్రి వార్త గురించి జనం అభిప్రాయాన్ని live గా చూపించాలి . అప్పుడు తెలుస్తుంది నిజంగా జనానికి అసలు ఏ న్యూస్ ఛానల్ సుత్తి  సోది లేకుండా చెపుతుందో .  

కామెంట్‌లు లేవు: