About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

సిగ్గులేని సినిమా స్టార్స్

ఒక సినిమా తీయటానికి అయ్యే ఖర్చులో 25% కథానాయకుడికి పోతుంది . అంటే మీరు కొనే 100రూ టికెట్ లో 25రూ వాడు తింటాడు . ఫాన్స్ ప్రాణమని ఒకడు,  ఇంకోడు చెట్టు చెప్పి కాయలమ్ము కునేవాడు, ఇంకో పిచ్చోడు వంశం-జాతి-కులం  అంటూ  తెలుగు ప్రేక్షకులు కష్టపడి రోజంతా శ్రమించిన దానిలో సిగ్గులేకుండా వాటా తీసుకుంటున్నారు . ఎందుకంత చెల్లిస్తున్నారో ఆ ఫాన్స్ పిచ్చకే వదిలేస్తున్నా . మక్కీకి  మక్కీ కాపీ కొట్టిన స్మార్ట్ ఫోన్ కూడా చవకగా వస్తుంది . కానీ సినిమాలు మాత్రం కలెక్షన్స్ రికార్డ్స్ పేరుతో ప్రేక్షకుడ్ని పిచ్చి నాయల్ని చేసి రిలీజ్ ని  పండగలా ,  అవార్డులని పెద్ద గొప్పలా ఆ  తర్వాత అవినీతి మీద నీతులు చెప్తూ  సినిమాల ద్వారా యువకులని పచ్చి తాగుబోతులుగా మారుస్తూ తాగడం ఒక హీరో నైజంలా
తయారుచేసారు రాష్ట్ర కుంపటిని . హీరోయిన్ ను అల్లరి చేసి వలలో  వేసుకోవడం  సాధారణ వ్యసనం లా తయారైంది మన చిత్రాలలో . అలాంటివాటిని ఆడపిల్లలు కూడా ఎలా చూడగల్గుతున్నారో  నాకర్థం కాలేదు మరి మాకంటే పుట్టినకాడినుంచి భయం భక్తి లేకుండా పెంచారు (నిజానికి మగాడు భయపడకూడదు అలా అయితే సమాజంలో పిచ్చి కుక్కలా నుంచి తన ఇంటిని రక్షించుకోలేడు ). 
మీ జిమ్మడ :p  !

కామెంట్‌లు లేవు: