ఘుం ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం.
ఈ పాటలో వెతకాలేగానీ ఎన్ని బూతు పదాలో.
తెలుగు భాషకున్న వైవిధ్యమైన మాయను రచయిత బాగా వాడాడు.
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
ఘుం ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం.
ఈ పాటలో వెతకాలేగానీ ఎన్ని బూతు పదాలో.
తెలుగు భాషకున్న వైవిధ్యమైన మాయను రచయిత బాగా వాడాడు.
తమ పారితోషికాలు తగ్గించుకుంటే టికెట్ ధర తగ్గుతుందని తద్వారా వాళ్ళ అభిమానుల రోజువారీ కూలీ డబ్బులకు చిల్లు తగ్గుతుందని తెలిసినా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు వెర్రి పప్పల్లా కనపడుతుంటారు. నిజానికి వారి నిస్వార్ధ అభిమానాన్ని అడ్డంగా పెట్టుకుని ఇంకా వాళ్ళ తరతరాలు ఎలా ఎదగాలో చూపించిన వారిలో మొదటివాడు రామారావు, తర్వాత చిరంజీవి.
నాగేశ్వరరావుకు, కృష్ణకు మహిళా అభిమానులు ఉండటం వల్ల ఆ పప్పులు ఉడకలేదు. కానీ వారి తర్వాత తరం వారికి మాత్రం అభిమాన సంఘాలు ఉండటం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు.
ఈ తంతు ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఏడ్చింది. మన లోకంలో సినిమా హీరోలు వాళ్ళ లోకంలో పాప్, రాక్ గాయకులు. ఫుట్ బాల్ ఐతే ఇక మన పిచ్చి వాళ్ళ మూలకు కూడా రాదు.
ఒక్కసారి టికెట్ దర చూస్తే కళ్ళు తిరుగుతాయి.
ఇదంతా చూస్తుంటే మన మీద వాళ్ళ కంటే మనకే వాళ్ళ మీద ఎక్కువ అవసరం ఉన్నట్టు కనబడుతుంది.
అందరూ కలిసి ఒక పెద్ద లంచగొండి వెధవని ఎలా ఎన్నుకుంటామో అలాగే ఒక సినిమా స్టార్ ను కూడా మన డబ్బుతో మనమే తయారుచేస్తున్నాం.
ఈత వచ్చండి.
ఇంకా?
బొమ్మలేస్తానండి. Drawing drawing!
గోడలమీదా?
బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నా!
ఇది నువ్వునాకునచ్చావ్ లో వెంకటేష్ మాటలు.
అదే వెంకటేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లో ఇలాఅడిగితే కోపంగా చూసాడు.
ఈమధ్యనే వచ్చిన కంచెలో వరుణ్ తేజ ఇంకోలా ఘాటుగా చెప్పాడు కులపిచ్చి మీద, ఇలాగే అడిగితే.