తమ పారితోషికాలు తగ్గించుకుంటే టికెట్ ధర తగ్గుతుందని తద్వారా వాళ్ళ అభిమానుల రోజువారీ కూలీ డబ్బులకు చిల్లు తగ్గుతుందని తెలిసినా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి అభిమానులు వెర్రి పప్పల్లా కనపడుతుంటారు. నిజానికి వారి నిస్వార్ధ అభిమానాన్ని అడ్డంగా పెట్టుకుని ఇంకా వాళ్ళ తరతరాలు ఎలా ఎదగాలో చూపించిన వారిలో మొదటివాడు రామారావు, తర్వాత చిరంజీవి.
నాగేశ్వరరావుకు, కృష్ణకు మహిళా అభిమానులు ఉండటం వల్ల ఆ పప్పులు ఉడకలేదు. కానీ వారి తర్వాత తరం వారికి మాత్రం అభిమాన సంఘాలు ఉండటం ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు.
ఈ తంతు ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఏడ్చింది. మన లోకంలో సినిమా హీరోలు వాళ్ళ లోకంలో పాప్, రాక్ గాయకులు. ఫుట్ బాల్ ఐతే ఇక మన పిచ్చి వాళ్ళ మూలకు కూడా రాదు.
ఒక్కసారి టికెట్ దర చూస్తే కళ్ళు తిరుగుతాయి.
ఇదంతా చూస్తుంటే మన మీద వాళ్ళ కంటే మనకే వాళ్ళ మీద ఎక్కువ అవసరం ఉన్నట్టు కనబడుతుంది.
అందరూ కలిసి ఒక పెద్ద లంచగొండి వెధవని ఎలా ఎన్నుకుంటామో అలాగే ఒక సినిమా స్టార్ ను కూడా మన డబ్బుతో మనమే తయారుచేస్తున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి