'అప్పటి' అంటే నా అర్థం అప్పటి ఎప్పుడో అని కాదు , ఏ కాలమైతే ఆ కాలమని !
ఆ సమయంలో హిట్ లేక ఫట్ ఔతున్న చిత్రాల కథ వాటిలో ఉన్న వ్యంగ్యం లను బట్టి ఆ సమాజం యొక్క ఆలోచనా విధానాలు పసిగట్టవచ్చు .
ఉదాహరణకి ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్నికల తీరు ఏమీ బాలేదు , నాయకుడు ఎలాగో తర్వాత సంపాదిస్తాడు కాబట్టి మనకి అందినది ఇప్పుడే తీసెసుకుందామని జనం వెర్రి . తీసుకోకపోతే తర్వాత ఆ రౌడీలు తమ ఇంటిమీద పది ఏ నానా గొడవ చేస్తారేమో అని అదొక భయం .
ఇప్పటి సినిమాల జోలికి వస్తే మనకి బాగా అర్థమయ్యేదేంటంటే ! కథ చాలా లోతుగా ఉండే ఆలోచనలతో ఉంటే అది తప్పకుండా flop ఐ తీరుతుంది , ఎందుకంటే ఎక్కువమందికి అది అర్థం కాకపోవచ్చు లేక బుర్రకి ఎక్కకపోవచ్చు . కానీ వాటి ప్రభావం తర్వాత తరంలో కనపడుతుంది . ఆరెంజ్,గగనం ,ఆవకాయ బిర్యాని , ఈ కోవకి చెందినవే .
ప్రస్తుతం హిట్ అవుతున్న సినిమాలలో అనవసరమైన సరంజామా /మసాలా ఎక్కువగా ఉంటుంది , పాత సినిమాలలో ఆ గోల లేదు , అప్పటి జనం ఆలోచన ఇల్లు , దేశం అని ఉండేదని చెప్పడానికి ఆరోజుల్లో ఉన్న కథలే ఋజువు . ఇప్పటి కథలన్నీ ఒక వ్యక్తి చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి , ఫంక్షన్లలో హీరో ఒక్కడే మనిషన్నట్టుగా విక్షేపిస్తున్నారు , రాజకీయాలు కూడా ఇంతే , ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంటాయి . జనం ఆలోచనలకి తగ్గట్టే మన సినిమాలు కూడా . ముందుచూపుతో చెప్పిన మాటలకి విలువనిస్తూ ,మరి అలాగే యదార్థ పరిస్థితికి తగ్గట్టు తమ తమ జీవనసరళి మార్చుకోమనే ఆలోచనలన్నీ తొక్కి తుంగలో కలుపుతున్నాం ,అందరం గొర్రెల్లా .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి