సరిగ్గా 2015 ఏప్రిల్ 25న నాకు మొట్టమొదటిగా భూకంప ప్రాసన జరిగింది . ఆ రోజు పొద్దున్న మంచి నిద్రలో ఉన్నా , 11:45కి సరిగ్గా ఎవరో నా మంచాన్ని ఎత్తి కొంచెం తేడాగా ఊయల ఊపుతున్నట్టుగా ఉంది , కానీ అదేం అంత హాయిగా లేదు , కొంచెం తల తిరిగినట్టుగా అనిపించింది . హఠాత్తుగా లేచి చూసెసరికి కొంచెం భయపడ్డా . రాత్రంతా ల్యాబ్ లో పని చేసి ఉండటం వల్లనేమో , మొదట ఏమైనా నరాల బలహీనత , నిద్రలేమి కారణంగా అలా అనిపిస్తుందేమో అని కొంచెం బొక్కబోర్లా లేచి నన్ను నేను గట్టిగా బిగపట్టి పరీక్షించుకుంటున్నా . ఐనా సరే తగ్గలేదు . ఇప్పుడు తట్టింది నా బుర్రకి ఇదేదో భూకంపం చాయలతో ఉందని గ్రహించా. నా లాంటి పరిస్థితిలో ఇంకెవరైనా వున్నారా అని బయటికి వచ్చి చూస్తున్నా . ఈలోపు మూడవ అంతస్తు విద్యార్థులు క్రిందకు పరుగు లంఘించారు . నేను సుతారంగా ఓపుకుంటూ నెమ్మదిగా కిందకు వచ్చి అందరితో పాటు నుంచుని భూకంప మేళాలో మొదటి పర్యాయం కనులవిందుగా తిలకించాను .( విందా నా బొంద ! ఉచ్చ పడింది )
కాసేపటికి అందరం ఎవరి గదులలోకి వారు వెళ్ళిపోయాం . నాకు ఇక రూం లో ఉండటం వల్ల కాదని మళ్ళీ మా గణిత పరిశోధన విభాగానికి బయలుదేరా .
లాబ్ లో ఉండగా మద్యాహ్నం 12:50కు ఇంచుమించుగా మా IIT కాన్పూర్ ఆరంతస్తుల FACULTY భవనం (నేను ఐదవ అంతస్తులో , అంటే గాలిలో ఉన్నా ) మేళాలో రెండవ పర్యాయం ఆరంభించింది . ఈసారి ఆలోచించేది లేదు , కిందకు తాపీగా ఓపుకుంటూ దిగాను , అయినా ఎక్కువ సేపు లేదు లెండి . ఆరోజు నిద్రపడితే ఒట్టు , దీనమ్మ జీవితం .
రెండవ రోజు సరిగ్గా ,మధ్యాహ్నం 1:25 కి మళ్ళీ నిద్ర లోచి ఉలిక్కి పడ్డా , ఇంకేముంది మళ్ళీ అదే ! పరుగో పరుగు కిందకి.
మూడవరోజు కూడా అదే సమయానికి నిద్రలో ఉన్నా కానీ భూమీ కంపించలేదు , కానీ నిద్రలో అకస్మాత్తుగా లేచి కిందకి పరిగెత్తా . ఒక్కరూ బయటికి రాలేదు . అప్పుడు అర్థమయ్యింది నాకు బాగా ఎక్కేసిందని .
ఆ దెబ్బకి రోజూ ఏదో ఒక నిమిషం అంటే ఇప్పటికి కూడా భూమి కదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది . థూ నా జీవితం !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి