విపరీతంగా పెట్రోల్ డీజిల్ వంటనూనె మద్యం ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం , మరి మన జనం ఎమన్నా తక్కువా ? 117 కోట్లు . అన్ని దేశాలకి వుండే నిత్యావసరాలే ఇవి , మరి మనం మిగతావారికంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సివస్తుంది .
1. దేశంలో పుట్టి పెరిగిన తెలివైన వారంతా విదేశాలకి అంటే ఖచ్చితంగా US లో స్తిరపడి తమ తెలివిని అక్కడి కంపెనీలకి వాడి భారతదేశానికి ఏమీ చేయకపోగా దేశాన్ని మరింత అద్వాన్న స్థితికి చేర్చడానికి కారకులయ్యారు .
2. దేశం కోసం తలపెట్టిన IIT విద్య US వెళ్ళటానికి ఒక coaching center లా తయారయ్యాయి .
3. దేశంలో ఉన్నవారికి చేయుతమివ్వకుండా FDI పేరుతో కోలుకోలేని దెబ్బ తీసారు .
4. వ్యవసాయమంటే భారమనిపించేలా పరిస్థితిని కల్పించి యువతను ఎందుకు పనికిరాని విద్యాప్రమాణాలతో తయారుచేసారు.
5. ఒక్కడికి కూడా పొదుపుగా oil వాడాలన్న ఇంజ్ఞిత జ్ఞానం లేకుండా పోయింది . చాల మంది IIT professors కూడా వెధవలే ఈ విషయంలో .
6. ఒక పక్క petrol గ్యాస్ నిల్వలున్నా Reliance అనే ఒక నిక్రుష్ట కంపెనీ యజమాని ముకేష్ అంబానీ దేశంలో పెట్రోల్ గ్యాస్ ని దాచిపెట్టుకుని మనం బయటనుంచి డాలర్లలో కొనుక్కునే దరిద్రం కల్పించాడు ,కేంద్ర ప్రభుత్వం కుట్ర తో .
7. అవసరం లేకపోయినా LAPTOP లు కొత్త mobiles కావలి మనకి , పోనీ అవి మనం మన దేశంలో చేసుకున్నవా ! కాదు . చైనా నుంచి తెచ్చుకున్న విదిభాగాలతో చేసినవి .
8. దేశానికి శరద్ పవార్ లాంటి చండాలుడు వ్యవసాయ మంత్రిగా ఉండి అటు రైతులను ఏడ్పిస్తూ ఇటు దేశాన్ని ధరలతో దండుకుంటూ చివరికి వంటనూనె కూడా పర దేశాల నుంచి డాలర్లలో కొనుక్కునే తిప్పలు తప్పవనిపించేట్టు తయారుచేసాడు .
మరి రూపాయిని బతికించేది ఎలా ? చదువుకున్నవారే ఆలోచించగలరు . 65% యువత మనం . ఎప్పటికీ ఉద్యోగ బానిసలుగా బతకటమేనా ... దేశానికి కావాల్సింది మనమే తయారుచేద్దాం . మనకు ముఖ్యంగా కావలసినవి మనమే పండిద్దాం . నేను సైతం .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి