But vice versa may not be true
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
Things you can't do that we can do.
1. We can park a vehicle that you can never.
2. We can control emotion that you can never in your life
3. We show our courage that you can never.
4. We can propose like you never can.
5. We can build things that you can never.
6. We can impress people that you never can.
చరిత్రలు అడగవద్దు! by musunuri subbaiah toka
చరిత్రలు అడగవద్దు! Charitraladagoddu
నాయకులు, మత ప్రవక్తలు, విప్లవకారులు, ఆధ్యాత్మికవాదుల జీవిత చరి త్రలు గ్రంథాలయాల్లో మనకు కనిపిస్తాయి . ఆఖరికి దుర్యోధనుడు, గాడ్సే కథలూ ఉన్నాయి. సామాన్యుడి కథ మాత్రం లేదు . అతను అదే ఆలోచించాడు . ఒక కూలివాడి చరిత్ర రాయాలని బయలుదేరాడు . ఒక తాత దొరికాడు బస్టాండులో . ఆ తాత కథ విన్నాక ఆ రచయితకు భయం వేసింది. మరి అతడికెందుకు భయం వేసింది ? కారణం ఏమిటి ?
చాలా రోజుల్నుంచీ నాకో అనుమానం. నా అనుమానానికి కారణం. నాలో ఉన్న అసంబద్ధమైన ఆలోచనలేమోనని చాలాసార్లు అనుకున్నా. పైకి చెప్పలేకపోతున్నానుగానీ, నావి మరీ అంత అసమంజసమైన ఆలోచనలు కావేమోనని మరో అనుమానం.ఈ అనుమానానికి కారణం నాలాగా ఆలోచించిన కొంతమంది కనిపించడం. ఇలా పోల్చడం తప్పేగానీ, వాళ్ళలాగే నేనుకూడా ఆలోచిస్తున్నప్పుడు, నా ఆలోచన అసంబద్ధమెలా అవుతుంది. ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ‘శ్వేదం చిందించిన శ్రమను మేలి వస్త్రంగా మలిచారని’ ఆరుద్రగారు అన్నారు. ‘కండలు కరగేసి, బండలు పగలేసేమ్’ అన్నాడు బంగోరె.
‘సామాన్యుడి ఆలోచనలు, అక్కరలు పెనుఉద్యమాలకు మూలమవుతాయి’ అని మార్క్స్ లాంటి వాళ్ళన్నారు.ఇట్టా అన్న వీళ్ళందరి జీవిత చరిత్రలు, ఆత్మకథలు మనకున్నాయి.గానీ వారన్న సామాన్యుడి జీవిత చరిత్రగానీ, ఆత్మకథగానీ, ఎక్కడాలేదు. పోనీ చదువులేని నిరక్ష రాస్యులు కాబట్టి ఆత్మకథలు రాసుకోలేరు. కానీ పెద్దలనుకున్న వాళ్ళలో ఒక్కరైన జీవిత చరిత్ర రాయొచ్చు కదా ఇది నా ఆలోచన. అది తప్పా? ఒప్పా? ఎవరిని అడగాలి? ఎవరు చెబుతారు?ఒకవేళ నాకు తెలియకుండా అలాంటి సామాన్యుడి జీవిత చరిత్ర ఎవరైనా రాశారేమోనని అన్ని గ్రంథాలయాలు చుట్టబెట్టాను. అందులో రాజకీయనాయకులు, మత ప్రవక్తలు, విప్లవకారులు, ఆధ్యాత్మికవాదుల జీవిత చరి త్రలు ఉన్నాయి. ఆఖరిగా గాడ్సే, రావణుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళ కథలూ ఉన్నాయి. సామాన్యుడి కథ మాత్రం ఎక్కడాలేదు!
బస్టాండ్‌కి వెళితే అక్కడ పల్లెటూరు వాళ్ళు చాలామంది వస్తారు. అక్కడ కూర్చుని కాపువేస్తే నాకు కావాల్సిన మనిషి దొరుకుతాడు అని నిర్ణయించుకుని మా ఊరు బస్టాండ్‌కి చేరుకున్నా. సమయం ఏడుగంటలైంది. పల్లెవెలుగులన్నీ వెళ్ళి పోయాయి. మళ్ళీ రాత్రి 10 గంటలకు పల్లెలకు బస్సులు వెళ్తుంటాయి. పట్టుదలగా అలాగే బస్టాండ్ అంతా వెతుకులాట మొదలు పెట్టాను. బాగా చీకటైంది. బస్టాండ్‌లో జనం పలచబడుతున్నారు. నేను తిరుగుతూనే ఉన్నా. అప్పుడు కనిపించాడు. ఒక బల్లమీద ముణగదీసుకుని కూర్చున్న ఓ ముసలాడు.
నెమ్మదిగా వానిదగ్గరకు వెళ్ళి, పక్కగా కూర్చున్నా. పరిచయస్తుడిలా నవ్వా. అతను నన్ను ఎగాదిగాచూసి, పట్నపోడితో మనకెందుకు అనుకున్నాడో ఏమోగానీ, మరింతగా ముడుచుకుపోయి కూచున్నాడు. అది వర్షాకాలం. పైగా ముసురు పట్టింది. మధ్యమధ్యలో చలిగాలి ఈడ్చిఈడ్చి కొడుతోంది. ఆ చలికి సిగరెట్ తాగాలనిపించింది. కానీ సిగరెట్‌తాగితే ముసలాడు నమ్మడేమోనని, అంతకుముందే నా జేబులో పెట్టుకున్న బీడీకట్ట తీశా. ఒక బీడీ వెలిగించా. గుప్పుమని లాగా. అలవాటు లేదేమో ఒక్కసారిగా గొంతు మంటెక్కింది. బీడీపొగను ముసలాడు ఆశగా చూశాడు. నేను నవ్వి ఒక్క బీడీ తీసి వానికిచ్చి ‘‘ఫర్వాలేదు తీసుకో’’ అన్నా.నేనిచ్చిన బీడీ తీసుకుని వెలిగించి జమాయించి ఒక పీల్చు పీల్చి వదిలాడు. అప్పుడు చూడాలి. ముసలాడి కళ్ళలోని ఆనందం.
‘‘లే... మందులు రాసిచ్చిండ్రు. అద్దాలు వేయించుకో మన్నరు’’.‘‘అచ్చా. అది సరేగానీ... ముసలోనివైనవుకదా బతికే టందుకు ఏం చేస్తున్నవ్?’’‘‘ఏందీ నేను ముసలోడ్నా... ఇప్పుడు కూడా వడ్ల బస్తా లేపుతా’’.‘‘నిజంగానే. నీ వయసు వచ్చేసరికి మేము మాత్రం ముసలోళ్ళమైపోతాం. ఎంతైనా పాత మనుషులు కదా. మీ ముందు మేమాగలేములే!’’ నెమ్మదిగా అతన్ని నా వైపు తిప్పుకోవడానికి మెచ్చుకోలు మాటలు అన్నాను. అది పనిచేసినట్టుంది.‘‘ఔ... నిజమే మేముతిన్న జొన్న అన్నం, రాగి సంగటి, మీరేడ తిన్నరు. అప్పట్లో మేము రాళ్ళను అరాయించుకునేటోళ్ళం. రెండుముద్దలు సంగటి తిని పనిలోకి వంగుంటే మళ్ళీ పొద్దు వాలినాకనే నడుం ఎత్తేటోళ్ళం. ఆ తిండి, ఆ పని ఇప్పుడేడున్నాయ్.
ఇప్పుడంతా నాజూకు లేగా. ఒక్కడూ లాగు, చొక్కా ఇప్పుతలేదు. అంటే అనికి పనిచేస్తే చెమట కూడా పట్టడం లేదన్నట్టు లెక్క. అంత అలకంగా అయిపోయినయ్ ఇప్పటిపనులు. జమాన మారింది కదా’’ పాత కొత్త పోకడల గురించి అలవోకగా వివరించాడు.‘‘అంత పని చేసేటోనివా? సొంత పొలమున్నదా?’’ అతను భూస్వామి కాదని చూస్తేనే అర్థమవుతున్నా, నువ్వు కూలోనివా అని డైరెక్ట్‌గా అడగలేక ఇలా అడిగానంతే.‘‘నాకెక్కడిది పొలం. పొలమూ లేదు, చేనూ లేదు, నేను పొలాల్లో కూలీచూసుకునేటోణ్ణి. చిన్నప్పుడు పాలేరుగా ఉన్నా. ఇప్పుడెవరూ పాలేర్లను పెట్టుకోవడం లేదు. ఆళ్ళననేదేం ఉంది. మా ఓళ్ళలో ఎవరూ పాలేర్లుగా ఉండేటందుకు ముందుకు రావడంలేదు. రోజు కూలీల్లెక్కనే బాగున్నదంటున్నరు. ఏం చేస్తం... కాలంతోపాటు పోవాలి కద’’ తలపాగావిప్పి తెల్లబడిన జుట్టు సరిచేసుకుని మళ్ళీ కట్టుకున్నాడు.
‘‘మా తాత పేరు యాదయ్య, బాపు పేరు నర్సయ్య. నా పేరు యాదగిరి. మా తాతపేరు కలిసిందని పెట్టాడంట మా బాపూ. మా తాత అయ్యకూడా మా ఊరి దొర రాంచందర్‌రావు దగ్గరే పాలేర్లుగా పనిచేశారు. నేను లాగులు కట్టడం నేర్చుకున్నాక ఆ దొర దగ్గరే పశువులు కాసేటందుకు కుదిరినా. మా తాత, బాపూ, నేనూ ఆ దొర దగ్గర చేస్తున్నప్పుడే మా తాత, బాపూ పోయారు. దొర కూడా పోయారు. నాకు మీసకట్టు వచ్చేసరికి దొర కొడుకు కిష్ర్టావ్‌దొర జమానా వచ్చింది. ఆయన ఉన్నంతకాలం ఆయన దగ్గర పాలేరుగా పనిచేసినా. దొర పోయిండు. అతని మొఖంలో బాధో, మరోటో తెలియని ఒక నిట్టూర్పు వెలువడింది.
‘‘కొడుకులు వ్యవసాయం గురించి పట్టించుకోలేదు. జమాన మారి పాలేర్లతనం తక్కువై రోజుకూలీలు ఎక్కువైనయ్. నేను కూడా రోజు కూలీకే పోతున్నా’’ బీడీ చివరిపీల్పు పీల్చి అవతల విసిరేస్తూ అన్నాడు తాత.‘‘ఏంటీ ఇంకా పనిచేస్తున్నవా? కొడుకులున్నరన్నవు కదా’’ నాకు తెలుసు. అయినా అడిగా.‘‘ఉంటే ఆళ్ళ బతుకు ఆళ్ళు బతుకుతరు. నాకు, నా ముసలి దానికి కూడెట్టాలంటే యాడైతది. అందుకనే నేను, నా ముసల్ది రోజుకూలీమీదే బతుకుతున్నం. ఎప్పుడన్నా పెయ్యి (శరీరం) బాగాలేకపోతే మానేస్తం. ఏదో అట్ట నడుస్తాంది. బతక్కతప్పదుకదా..’’ ఆత్మవిశ్వాసంతో పాటు పిలాసఫీని కలిపి చెప్పాడు తాత.
బీడీల వాసన నాకు పడటంలేదు. కానీ తప్పేట్టు లేదు. తాత పూర్తి ఇంటర్వ్యూ పొందాలంటే ఓపిక పట్టక తప్పదు మరి. బస్టాండ్‌లో జనం పల్చబడుతున్నారు. లాస్ట్‌బస్‌లకు వెళ్ళెటోళ్ళు మాత్రం అక్కడక్కడా కూర్చుని ఉన్నారు. అలసిపోయినవాళ్ళు బల్లలమీదే పడకసీను వేశారు. తాత బీడీమీద బీడి తాగుతూ నిద్రరాకుండా చేసుకుంటున్నాడులా ఉంది. ‘‘బాగా చలిగా ఉంది. ఛాయ్ ఏమైనా తాగుతవా తాతా’’ చలిగాలికి తలపాగా చెవుల మీదికి దించుకుంటున్న తాతనుచూసి అన్నాను.‘‘మాలాంటోళ్ళకు చలి పోవాల్నంటే తాగాల్సింది ఛాయ్ కాదు. అది వేరేటుందిలే’’.
‘‘వేరొకటా... ఎక్కడా?’’ చుట్టూచూశాను. ఏం కనిపించలేదు. ఒకామె నా ముందునుండి వెళ్ళి తాత ముందు రెండుసెకన్లు నిలబడింది. తాత బుర్ర ఊపాడు. ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎందుకు వచ్చిందో, తాత ఎందుకు బుర్ర ఊపాడో నాకు అర్థం కాలా, ఆశ్చర్యంగా తాత వంక చూసి ‘‘ఏమంటున్నది ఆమె’’ అన్నా.‘‘నువ్వు చదువుకున్నోనివిలాగున్నవ్. అవన్నీ నీకు చెప్పేటందుకు లేదులే’’ బీడి పొగ గాల్లోకి వదులుతూ అన్నాడు తాత.‘‘ఫర్వాలేదు చెప్పు. మనం ఇంతసేపూ ఒకే బల్లమీద కూర్చుని ముచ్చట్లాడుకున్నం. దోస్తులంగామా. దోస్తు దగ్గర దాచేటిదేముంటది?’’ బుజ్జగిస్తున్నట్లు అన్నా.
‘‘ఆవ్... ఆవ్...’’ నవ్వుతూ అన్నాడు తాత.‘‘అది సరేగానీ తాత... నువ్వు పాలేరుగా పనిచేసేప్పటి రోజులే మంచిగున్నయ్ అన్నవ్ కదా.. అలా ఎప్పుడెప్పు డనిపించింది. యాది చేసుకుని చెప్పు’’.‘‘ఏడేళ్ళ వయసులో పశువులతో తిరుక్కుంటా, దూడ పెయ్యిలతో ఆడుకుంటా ఉంటే మస్తు మజాగా ఉండేది. దసరా పండక్కి దొర అందరికీ కొత్త బట్టలు ఇచ్చెటోడు. నాకూ ఇచ్చెటోడు, మస్తనిపించేది. పనంతా చేసి పొద్దు గూకినంక ఇంట్లో అవ్వదగ్గర బబ్బునేవోణ్ణి. అవ్వ నా తల నిమురుతా కథలు చెబుతా ఉండె. భలేగుండేది. బతు కమ్మలకి తంగేడుపూలు కోసుకురమ్మని చిన్న దొరసాని అంటే కిష్ర్టావ్‌దొరబిడ్డ చెప్పినప్పుడు పూలు తెచ్చేటోన్ని.
నేను, చినదొరసాని కలిసి అయన్నీ బతుకమ్మలు కట్టేటోళ్ళం. మస్తు మజాగుండేది. చిన్న దొరసాని బోనాలకు తీసుకుని వచ్చేటప్పుడు, గుడిదాకా నేనే మోసుకొని వచ్చేటోన్ని. గుడి వచ్చినాంక దొరసాని తలమీద పెట్టుకునేది. బోనాలు మోస్తుంటే మస్తనిపించేది...’’చిన్నప్పటి సంగతులు హుషారుగా చెప్పుకుపోతున్నాడు తాత. నిజానికి ఆ వయసులో చదువుకోవాలి. అమ్మా నాన్నలతో ఆడుకోవాలి అవన్నీ కాక పడిన బాధలే. కానీ సంతోషాలని చెబుతున్నాడు పాపం. ఇప్పుడు తలచుకుంటే అలా అనిపిస్తున్నాయేమో. ‘‘అది సరే తాత. నీ చిన్నప్పటి సంగతి కాదు. నువ్వు పెద్దోనివైనాంక, మీసాలు వచ్చినాంక అనుకో, అప్పట్నుంచి నీకు సంతోషమనిపించినయి చెప్పు’’.
‘‘అట్టనా. అయి తల్చుకుంటే నువ్వు మస్తు ఖుషీ కొడుతున్నవ్ తాతా. బాగానే ఉందిగనీ. నువ్వు పాలేరు తనం చేసినప్పుడు బాధనిపించినయి, కష్టమనిపించిన రోజులు లేవా?’’నా వంక అమాయకుడిలా చూశాడు తాత. చిన్న నవ్వు నవ్వి, ‘‘పట్నపోనివి కదా అట్నే అడుగుతావ్‌లే. మాయన్నీ బాధలే బాన్చన్. ముందుగాల చెప్పినవన్నీ అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో ఖుషీ అయిన రోజులుతప్ప అన్నీ బాధలే. విడమర్చి చెప్పేదేముంది, పొద్దుగాలే లేచి దొర పశువుల్ని తోలుకుని చీకటిమాటున ముల్లు గుచ్చుకున్నా కాళ్ళతో ఉతికి చీకట్లో పడి వచ్చినాంక తినడానికి ఏమీ లేక ఖాళీ బొచ్చె కనిపించినప్పుడు మస్తు బాధనిపించిన రోజులెన్నో.
బత్తెం కోసరం జొన్నలు అడిగితే దొర కొట్టిన రోజులెన్నో, పెళ్ళియిన మొదటిరాత్రే చేలో కాపలా పడుకోవాల్సి వచ్చి నప్పుడు, పండక్కి కొడుక్కి కొత్తగుడ్డ కొనలేనప్పుడు, రోగమొచ్చినప్పుడు మా అవ్వకు, అయ్యకు మందిప్చిచ్చలేక పోయినప్పుడు ఆళ్ళు రోగంతోనే, ఈ చేతులలోనే పాణాలు ఇడిసినప్పుడు నా కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకుని నాతో సంబంధాల్లేకుండా దూరంగా పోయినప్పుడు.. చెప్పుకుంటే ఇయే ఎక్కువుంటాయ్ బాన్చన్. ఎన్నని చెప్తా, ఏదో అట్ల బతికేసినా, తప్పదు బాన్చన్. ఈ కట్టెకు పిలుపొచ్చేదాంకా... ఇంతే ఏం చేస్తాం’’ నిర్వేదంగా అన్నాడు తాత.తాత చెప్పినవన్నీ బాధలే. కానీ ప్రతి పేదవాడికి ఉండే బాధలే. కానీ తీర్చేవాళ్ళు లేరు. ఆర్చేవాళ్ళూ లేరు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా ఆ బతుకులు అంతే. పునాదిని కదపలేని పై పై మెరుగులు ఎన్ని అద్దినా, దిద్దినా ఆ బతుకులు అంతే ఉంటాయి. తాత ముఖం చూస్తే ఇంకా ఏదో దాస్తున్నాడనిపిస్తాంది. నేను చూసుడులో ఉందో లేక తాత దాపరికం పెడుతున్నాడా. ఒకవేళ ఉన్నా ఎట్టా బయటికి లాగాలి?
నీ బతుకులో నీకు చాలా సంతోషమనిపించినవి ఏమున్నయి?’’‘‘ఏమున్నయి. ఆ... యాదొచ్చింది. మా కిష్ర్టావ్‌దొర కూతురు మస్తుగుండేది. నేనంటే మంచిగా చూసుకునేది. ఓరోజు ఏదో పనిబడి దొర ఇంటికి వచ్చిన. ఇంట్లో ఎవరూ లేరు. దొర కూతురు ఉన్నది. నా దగ్గరికి వచ్చి ఏమేమో మాట్లాడింది. నా ఒంటిమీద చేత్తో పాముతా ‘మస్తున్నవ్ రా. కొరుక్కుతినాలనిపిస్తోంది’ అంది కళ్ళు మూసుకుంటా. అప్పుడు దొరా ఏం ఖుషీ అనిపించిందో తెలుసా? ఈలోగా ఏదో అలికిడి అయితే దొరకూతురు లోనకు వెళ్ళిపోయింది’’ తాత మాటలు ముద్దగా వస్తున్నాయి.‘‘తప్పుకాదా... ఆ అమ్మాయి ఏదో చేసినా నువ్వొద్దని చెప్పొచ్చుగా ఆ...?’’తాత నవ్వాడు. ఎందుకో అర్థం కాలేదు. ‘‘అలికిడి అయిందని చెప్పాను కదా. ఆ అలికిడి మా కిష్ర్టావ్‌దొరదే. జరిగిన దానికి నా తప్పు లేకున్నా మస్తు కొట్టిండు. ఇదిగో ఈ చేతులమీద వాతలున్నయ్‌గదా అయి అప్పుడు దొర కొట్టినయే... ఆ బాధకి మస్తు ఏడ్చినా... ముందుగాల్న చెప్పిన జూడు. నా మొదటిరాత్రికి దొర పని ఉందని చేలోకి పంపించినాడని ఆరోజు రాత్రి మనసు నిలవక ఇంటికొచ్చిన.
ఇంట్లోంచి గాజుల చప్పుడు ఇనిపించింది. తొంగిచూసిన. నా పెండ్లాంమీద దొరున్నడు. మనసు మండింది. కానీ ఏం చేసేడిది లేక, కళ్ళల్లో నీళ్ళు పొక్కుకుంటూ పొలంలోకి పోయిన. అట్టా నేను చాలా రాత్రులు పొలంలో కాపలాకు పోయినా.. నాకు మొదటి కొడుకు పుట్టినప్పుడు నా పెళ్ళాం నవ్వుతా ‘అచ్చం దొరలాగున్నడు కదా మామా’ అని సంబరపడతావుంటే పిచ్చకోపంవచ్చి దాన్ని బండకొట్టుడు కొట్టిన. నిజం చెప్పనా దాన్నలా కొడుతుంటే నాకు మస్తు మజాగనిపించింది. దొర నన్ను తిట్టినప్పుడు, కొట్టి నప్పుడు మస్తుకల్లు తాగొచ్చి నా పెళ్ళాన్ని, కొడుకునీ చావ గొట్టేటోన్ని. అప్పుడే నాకు నిద్ర మంచిగొచ్చేది’’ ఎటో చూస్తూ అన్నాడు తాత.
చూసినవా ఎంత ఘోరమో. ఆడి బిడ్డ నా మీద చెయ్యేసినా నన్నే కొట్టిండు. ఆడు నా పెళ్ళాం మీద చెయ్యేసినా నన్నే కొట్టిండు. మనిసన్నోనికి ఎట్లుంటదో చెప్పు. మరలాంటోనికి ఇలువెంతో చెప్పు. ఇలాంటి బాధకి ఎంత ఇలువుంటది. మాలాంటి వాళ్ళ సంతోషానికి ఎలాంటి విలువుంటది’’ తాత కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. బీడి కాలుస్తూనే ఉన్నాడు. అలా కాల్చినప్పుడల్లా దాని చివర ఎర్రగా మండుతానే ఉంది.
‘‘అంటే నువ్వు దొర కొడుకువా...’’ఏమంటాడోనని భయపడుతూనే అడిగా.‘‘అంటే మాత్రం పెద్దోళ్ళు ఒప్పుకుంటారా? ఎవరో చెప్పి నారు. మొన్నొకాయిన ఢిల్లీలోనే, ఇంకేదో ఊళ్ళోనో ఒకడు ఒక పెద్దాయనను నువ్వే మా నాన్నవని మొత్తుకున్నా, పెద్దాయన ఒప్పుకున్నాడా. ఎంతోమంది చెప్పినారట. అయినా ఒప్పుకుంటే మాత్రం ఏమవుతాది. నేను దొర కొడుకునవుతానా. ఒకేలైతే నీకీ పాటికి ఏ పెదబాబునో, పెదమామనో అయుంటాను వరసకి’’ తాత వికవికమంటూ నవ్వి ‘‘నేను పాలేరోడి బిడ్డను పాలేరోన్నే అవుతా అంతే, అదిగోదొరా లాస్ట్ బస్ వచ్చేసినాది. వస్తా బాన్చన్’’ అని చెప్పి బస్సెక్కాడు తాత.నాకప్పుడనిపించింది. కూలోళ్ళ గురించి ఆళ్ళ బాధల గురించి రాయాలిగానీ, వాళ్ళ జీవిత చరిత్రలు రాస్తే, జాతకాలు తిరగబడతాయని. వాడు ఎక్కడో అక్కడ వరసకి అన్నో, మామో అయితే... ఆ ఊహ తల్చుకుంటేనే భయంగా ఉంది. అందుకేనేమో పెద్దపెద్ద కవులందరూ ఆల్ల బతుకులు గురించి రాశారు గానీ... ఆళ్ళచరిత్రల గురించి రాయలేదన్న సత్యం కొద్దికొద్దిగా బోధపడింది.తాత ఎక్కిన బస్సు కదిలి చీకట్లో పడి వాళ్ళ ఊరువైపు వెళ్ళిపోతోంది. అటువేపు వెలుగెప్పుడొస్తుందో..
భార్య భర్త ల jokes
😁😁😁😁😁😁😁😁😁
''ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో
"ఏం.. ఆరు ముక్కలుగా కోస్తే ఇబ్బందేంటో?" ప్రశ్నించాడు భర్త
"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.
😀😀😀😀😀😀😁😁😁
సుబ్బారావు తల పగిలి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు, తల కి కట్టుకడుతూ నర్స్ అడిగింది అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్.
సుబ్బారావు : నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది
మా ఆవిడని సర్ ప్రైజ్ చేద్దామని ఇంటికెళ్ళగానే రేపటినుంచీ నువ్వు మేనేజర్ తో కాపురం చెయ్యాలోయ్ అన్నాను
అంతే.....
🤕🤕🤕🙄🙄🙄🙄🙄🙄
ఒక నల్లని మనిషి చనిపోయాక
స్వర్గానికి వెళ్లాడు..
దేవకన్య: ఎవరు నువ్వు?
నల్లని వ్యక్తి: (ఆమెని ఇంప్రెస్ చేయడానికి)
'టైటానిక్' సినిమాలో హీరోని
దేవకన్య: టైటానిక్ షిప్
మునిగిపోయిందిరా వెధవా.. కాలిపోలేదు..
😅😜😃😆😅😂😅😅
మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''
అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .
మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* 😱😱
😁😁😁😁😁😁😁😁😁
అలిగి పుట్టింటికొచ్చిన కూతురు , తిరిగి కాపురానికి వెళ్తుంటే తల్లి అడిగింది...
" ఏమ్మా తప్పు తెల్సుకున్నావా..?? అని.
కూతురు : నిజం తెలుసుకున్నా...
ఇక్కడ నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది... అక్కడైతే అన్ని పనులు ఆయనే చేస్తారు...
😁😁😁😁😁😂😁
తండ్రి కొడుకుతో కోపంగా..
కొత్తిమీర తీసుకొని రమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా. నీకు కొత్తిమీరకు పుదీనాకూ తేడా తెలియదా..? తాడిచెట్టులా పెరిగితే సరిపోయిందా వెళ్ళు వెళ్ళు. ఇల్లు వదిలి వెళ్ళిపో తెలుస్తుంది జీవితం అంటే ఎంటో..?!
కొడుకు : సరే నాన్న పద ఇద్దరమూ ఇల్లు వదిలి వెళదాం పద..
తండ్రి : ఎందుకు నేనెందుకు..?!
కొడుకు : అమ్మ చెప్పింది ఇది మెంతికూర అంటా..!!
😂😂😂
Nature or Nurture or none ??
The ongoing discussion around the question of Nature(Brain) vs Nurture(social upbringing) is missing an important scenario.
Factor that decides a person's character
is actually a combo of both.
The more weight goes to the Nature rather than the way a person is nurtured.
I would say this affirmly because I have seen cases where both the parents are calm natured and the society around is also peaceful but the Nature of the kid is different. This may be because the kid has a brain that has a different configuration in contrast to ones parent's.
Why would a children's brain can be so much different than his parents ? It can be because of the time's technological changes and variation in supplied nutrition in contrast to their parents , while his brain was growing.
