1. రాజకీయ వారసత్వాలు.
2. పెళ్ళి, ఉద్యోగాలకు మారని కులవివక్ష.
3. ఆడదాన్ని ఆడదే హింసించటం.
4. అమెరికా పిచ్చి
5.
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు!
Restrict Internet access to Android apps
Settings app - - - > System apps - - - > security - - - > data usage - - - > test network - - - > test network - - - > view network permissions details.
The most you wonder at the facts the most innocent you are.
Everybody has a level of intelligence which makes them understand the things as simple as they can be.
To the most intelligent human being it seems very obvious to something happen as it is. Only the sub level intelligent creatures makes the things as extraordinary or of surprising nature.
Walking speed of a man at age 31.5 with 24.8 bmi
[26/06/2016 9:39 pm] 3.71km walking in 34'10 minutes which Google predicted as 44'30 minutes under 5km per hour speed of normal human being.
My walking speed today has been 6.5km per hour with weight 168 lbs.
P. S: This is purely for my personal records.
Redemption from Nail biting habit
Finally, it seems I almost lost my 32 year old habit of biting nails, successfully.
It took nearly 30 days to convince myself that I did it finally. Eureka !
The treatment involved a non-materialistic and psychological approach.
It involves four basic steps of two phases and Strong determination.
Stage-I
1. Identify the triggering event that leads you to take your nails up to mouth.
In my case, It is some X which I don't want to disclose to you for your own benefit as it may effect your mind.
2. Install this app to your screen for easy access and to count the number of instances you had the urge to bite. Every day, when your first bite create a new counter with the date as the name.
3. GIVE PRIORITY ALWAYS TO PRESSING THE COUNT BUTTON IN THE APP THAN
TO BITE YOUR FLESH.
Stage-II
4. This phase occurs when you have nearly stopped biting nails and the sharp nails
have started bothering you when you scrub your skin during bathing.
Also, sometimes you may tend to get rid of your small torn up edges of your nails.
Try to refrain as much as you can but surely count the urge to perfect you nail shape.
You may use google spreadsheet to plot your data day-wise.
P.S: Nail biting is a trait of perfectionism. So don't be obsessive to perfect your nails using teeth or other finger nails, this is the heart of the treatment.
After first 30 days it is advised to use nail cutter to make up your nails, else you will end up removing your nails again using your nails which may cause bleeding.
X in my case is "groping with the fingers to check if there are any nail-leads protruding out"
నాకు అమెరికా ఏం నేర్పింది!
1. ఎంత చిన్న సహాయమైనా సరే కృతజ్ఞతలు తెలపటం చాలా ముఖ్యమని.
2. ఎవడి పని వాడే చేసుకోవాలి, అది వంట పని కావొచ్చు దొడ్డి పని కావొచ్చు.
3. అనవసరంగా ఒకరి వ్యక్తిగత జీవితం గురించి అతిగా మాట్లాడకూడదు.
4. మన మాటకు కట్టుబడి ఉండాలి.
5. ఎదుటి వ్యక్తి ఎంత తక్కువలో ఉన్నా సరే వారి సమయానికి విలువివ్వాలి.
6. పెద్దవారు కూడా తనకంటే చిన్నవారితో మర్యాదగానే ప్రవర్తించాలి.
7. ఏ పనివారైనా సరే వారికంటూ ఒక గౌరవాన్ని ఇవ్వాలి, అది బార్ గర్ల్ కావొచ్చు లేదా రోడ్లు ఊడ్చేవారు కావొచ్చు.
8. మన వస్త్రధారణ, తిండి మన సొంతం. దీనికి బయటివారి మనోభావాలకు నిమిత్తం లేదు.
Every Luxurious item is of short Life of exuberance !
స్థూల జాతీయ ఆనంద’ సర్వే చేయించే ఏకైక దేశం భూటాన్
అమెరికా కోమటి, చైనా చోరుడు, భారత్ యాచకుడు!
అమెరికా తన ధనబలంతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఏలుతుంది.
చైనా చడీచప్పుడు లేకుండా దొంగిలించి అందరికీ చౌకగా అమ్మేస్తుంది.
మన దేశం అటు కొత్తగా చేయాలని అనుకోదు, అలాగని దొంగలా వకిలీవి చేయడం చేతకాదు. కానీ ముష్టి మాత్రం రాజసంతో అడుక్కుంటాం.
మనం అడిగామని అమెరికా ఏమీ దానం చేసేయట్లేదుగానీ, తన దగ్గర పాడవటానికి సిధ్దంగా ఉన్న పాచి అన్నం మనకి అమ్ముతూ మహోపకారం చేసినట్టు డప్పాలు వాయిస్తుంది.
Fractal looks like a piglet made from Mobius-Log -Tan Transform
Fractal from periodic conjugate and periodic parameter
Power-grid-pole like Fractal using periodic parameterization and conjugates injection
Octave code:
My first fractal drawing using Octave for the Mandelbrot
Octave Code:
Imaginary number i is still the biggest mathematical mystery!
సంతకాలు ఆంగ్లభాషలోనే ఎందుకు పెడతాము?
దయచేసి మీరు మీ పిల్లలకైనా తెలుగులో సంతకం చేయటం నేర్పించండి.
సంతంకం అంటే అర్థమయ్యేలా వ్రాయాలన్న మూఢనమ్మకాన్ని వదులుకోండి.
గుడ్డు సున్నా కాదు..అన్నింటికన్నా మిన్న! (Eenaadu article)
పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక్క చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తూ గుడ్డును అమింతంగా ఆస్వాదిస్తోంది. చాలామంది రుచిగా ఉండే ఆహారంలో పోషకాలుండవనీ, పోషకాలుండే ఆహారానికి రుచీపచీ ఉండవని భావిస్తుంటారు. కానీ రుచినీ, ఆరోగ్యాన్నీ.. రెంటినీ రంగరించి మనకందించే సహజ ఆహారం.. గుడ్డు! అందుకే దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ.
సాధారణంగా మనం ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమై, దాన్ని మన శరీరం గ్రహించి, వినియోగించుకునే క్రమంలో ఎంతోకొంత వ్యర్థమై పోతుంటుంది. తిన్న పదార్థంలో ఎంతమేరకు మన శరీరానికి ఉపయోగపడుతోందనే దాన్ని ‘బయోలాజికల్ వాల్యూ’ అంటారు. దీని ప్రకారం గుడ్డు బయోలాజికల్ విలువ నూటికి నూరు! మరే పదార్ధానికీ ఇంటి సంపూర్ణ విలువ లేదు. పాల విలువ 93, చేపలు 75, మాంసాహారం 75, కూరగాయల విలువ ఇంకా తక్కువ. ధాన్యాల దగ్గరకు వచ్చేసరికి ఇది 70-50 వరకూ పడిపోతుంది. కాబట్టి గుడ్డు ఒక్కటే సంపూర్ణంగా శరీరానికి వినియోగమవుతోందని గుర్తించాలి.
గుడ్డులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ప్రోటీన్లు. గుడ్డుతో పోలిస్తే పప్పుల వంటి వృక్ష సంబంధ పదార్ధాల నుంచి వచ్చే ప్రోటీను నాణ్యత కొంత తక్కువగా ఉంటుంది. పప్పుల్లో ప్రోటీను కొన్నిసార్లు సరిగా జీర్ణం కాదు. సాధారణ వృక్ష సంబంధ ప్రోటీను 1 గ్రాముకు గుడ్డులోని ప్రోటీను 0.8 గ్రాములు సమానం.
మన దేశంలో చాలామంది వారానికి ఒక గుడ్డు తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న, 47% ప్రజలు బరువు తక్కువగా ఉన్న మనదేశంలో గుడ్డు వాడకాన్ని పెంచటం, ప్రోత్సహించటం చాలా అవసరం. వారానికి 5-6 గుడ్లు తినొచ్చు. పిల్లలకు, గర్భిణులకు తప్పనిసరిగా రోజుకు ఒక గుడ్డు ఇవ్వటం మంచిది. గర్భం దాల్చినప్పుడు, కాన్పు కాగానే, పిల్లలకు పాలిచ్చేటప్పుడు.. ఇలా ప్రతి దశలో గుడ్డు స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది.
కొందరికి చేపలు పడవు, కొందరికి పప్పుదినుసులు పడవు.. ఇలా చాలామందికి మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్ధాలతో ఇబ్బంది ఉంటుంది. అలాగే గుడ్డులోని తెల్లసొన కూడా కొందరికి పడకపోవచ్చు. అందుకని పసిపిల్లలకు గుడ్డు పెట్టేటప్పుడు ముందుగా పచ్చసొన ఒక్కటే పెడతారు. సాధారణంగా ఆరేడు నెలలకు ఘనాహారం పెట్టటం ఆరంభిస్తారు కాబట్టి 7-8 నెలల నుంచి ఉడికించిన పచ్చసొన పెట్టొచ్చు. దాంతో అలర్జీలేమీ ఉండవు. పిల్లలకు కావాల్సిన పోషకాలూ దొరుకుతాయి. దాన్ని కొనసాగిస్తూ ఏడాది నిండే సరికి పూర్తి గుడ్డు మెత్తగా చేసి పెట్టొచ్చు.
చాలామంది నాటుకోడి గుడ్లు మరింత బలవర్ధకమైనవనీ, వాటిలో పోషకాలు ఎక్కువుంటాయనీ భావిస్తుంటారుగానీ అది నిజం కాదు. నాటు గుడ్డులో అయినా, ఫారం గుడ్డులో అయినా లోపలుండే పోషకాలు ఒకటే. వాటిలో తేడా ఏమీ ఉండదు. అలాగే గుడ్డుపైన పెంకు రంగుకీ, లోపలి పోషకాలకూ కూడా ఎలాంటి సంబంధం ఉండదు. పైగా నాటు కోడి గుడ్డు సైజులో చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి అందే పోషకాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. కాబట్టి మొత్తమ్మీద చూసుకుంటే నాటు గుడ్డు కంటే ఫారం గుడ్డు నుంచి పోషకాలు అధికంగా అందుతాయని గుర్తించాలి. పైగా ఫారం కోడికి పెట్టే ఆహారంలో విటమిన్-డి వంటివన్నీ ఉండేలా చూస్తారు కాబట్టి కొన్నిసార్లు వీటిలోనే విటమిన్-డి వంటి అరుదైన పోషకాలు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
మన ప్రాంతంలో చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అది సరికాదు. గుడ్డును ఉడికించి తినటమే మంచిది. రెండోది- తెల్లసొనలో ఎవిడిన్ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. ఇది బయోటిన్‌తో కలిసిపోయి దాన్ని శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంటుంది. గుడ్డును వేడిచేస్తే అది బయోటిన్ నుంచి విడిపోతుంది. గుడ్డులో ట్రిప్సిన్ అనే ఎంజైమ్‌ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. వేడి చేసినప్పుడు ఇది కూడా నిర్వీర్యమవుతుంది. అందువల్ల గుడ్డును ఉడికించి, వండుకొనే తినటం మంచిది.
చాలామంది శరీరానికి అధికంగా శక్తినిచ్చే పదార్ధాలు వేడి చేస్తాయని భావిస్తుంటారు. కానీ గుడ్డు లభించే శక్తి చాలా తక్కువగానే (70 క్యాలరీలే) ఉంటుంది కాబట్టి గుడ్డు వేడి చేస్తుందన్నది పూర్తిగా అపోహే.
పిల్లల్లో ఎదుగుదలకు, బరువు పెరిగేందుకు ఉపయోగపడే గుడ్డు.. పెద్దవారిలో, ముఖ్యంగా వూబకాయులు బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది. ఎందుకంటే గుడ్డు తెల్లసొనలోని ప్రోటీన్ కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. పైగా ఈ ప్రోటీను జీర్ణం కావటానికీ కొంత శక్తి ఖర్చవుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది.
చాలామంది పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావిస్తూ, దాన్ని తీసేసి తెల్లసొన మాత్రమే తింటుంటారు. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉండే మాట నిజమే. ఒక గుడ్డులో 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇతరత్రా ఆహార పదార్ధాల నుంచి అందే కొలెస్ట్రాల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. మామూలుగా మన శరీరం రోజుకు 800-1500 మిల్లీగ్రాములు వరకు కొలెస్ట్రాల్ తయారుచేసుకుంటుంది. ఇది కాకుండా మనం ఆహారం ద్వారా అదనంగా 300 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు. మనం రోజుకు ఒక గుడ్డు తిన్నా 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాలే లభిస్తుంది. అంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన మొత్తంలో ఇది సగానికన్నా కాస్త ఎక్కువ. పైగా కొలెస్ట్రాల్‌ను నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసిథిన్ వంటి రసాయనాలూ గుడ్డులో ఉంటాయి. కాబట్టి గుడ్డుతో సమస్య ఉండదు. నిజానికి వనస్పతి, నెయ్యి, నూనె, మాంసం వంటి వాటి ద్వారా లభించే కొలెస్ట్రాల్‌తోనే ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఒకట్రెండు గుడ్లు తింటుంటారు. అదే మాంసం విషయానికి వస్తే ఒకేసారి పావు కిలో కూడా తినేయొచ్చు. కాబట్టి దీంతో పోలిస్తే గుడ్డు నుంచి లభించే కొలెస్ట్రాల్ చాలా తక్కువ. కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న భయంతో గుడ్డు మానేయ్యాల్సిన అవసరం లేదు. నిజానికి గుడ్డులోని తెల్లసొనలో 90% నీరు ఉంటుంది. మిగిలిన 10%లో అల్బుమిన్, గ్లోబులిన్ వంటి ప్రోటీన్లు, కొద్దిగా రైబోఫ్లావిన్ (బీ2) కూడా ఉంటాయి. అన్ని రకాల పోషకాలూ దండిగా ఉండేది పచ్చసొనలోనే. మాంసకృత్తులు, కొవ్వు, ఎ-డి-బి12 వంటి రకరకాల విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం, ఇనుము, జింకు, సెలీనియం అనే యాంటీఆక్సిడెంటు వంటివన్నీ ఉంటాయి. కాబట్టి పచ్చసొన తీసేసి తినాల్సిన అవసరం లేదు.