About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

నాన్నకి గుండె నొప్పి వచ్చింది !

29 జూన్ 2020 రాత్రి 10:30కి నిద్రలో ఉండగా నాన్నకి గుండె నొప్పి వచ్చింది . 
ఒక్కడే బయట మంచం మీద కూర్చుని చెమటలు కక్కుతున్నాడు . నేను పడుకోలేదు . బయటికి వఛ్చి చూసేసరికి దోమతెరలో కూర్చుని చెమటలు పడుతూ నిస్సహాయంగా ఉన్నాడు . 
గాలి సరిగా లేదు , ఉక్కపోత కాబోలు అనుకుని టేబుల్ ఫ్యాన్ పెట్టాను . ఎందుకు అలా వున్నావు అని అడిగితే ఏమీ మాట్లాడట్లేదు . 
   మళ్ళీ నా పనిలో నేను ఉండిపోయాను .మళ్ళీ  కాసేపయ్యాక బయటికి వఛ్చి చూస్తే అలాగే ఆందోళనగా ఉన్నాడు .  దోమ తేర తీసేసా గాలి బాగా తగులుతుందని ! ,  చెమటలు కక్కుతున్నాడు . ఈసారి వాటర్ కూలర్ పెట్టా , ఐనా  అదే స్థితి . చూస్తుండగానే వాంతి చేసుకున్నాడు . బహుశా అజీర్తి వల్ల అనుకున్నా , అడిగితే గుండెల్లో నొప్పి అని చూపించాడు . నాకు ఇంకా అనుమానం రాలేదు . 
ఎప్పటి నుంచో మణికట్టు వద్ద నొప్పి అంటున్నాడు , కానీ ఛాతీలో గానీ, చేయిలో గానీ నొప్పి లేదు . 
 ఇంతకూ ముందు చాలాసార్లు అమ్మకి అలానే నొప్పి వచ్చేది కానీ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల . 

 నాన్న ఆరోగ్యం విషయంలో అందరి కంటే జాగ్రత్త  ఎక్కువ , కానీ సిగరెట్ అలవాటు ఉంది .  
బాల్యం నుంచి మాంస భోజన ప్రియుడు , మరి శ్రీకాకుళ వాసి కదా !
   నొప్పికి తాళలేక నేలపై పడుకున్నాడు . నిమ్మకాయ నీళ్లు ఇచ్చాం . ఐన నొప్పి తగ్గట్లేదు . 
rabeprazole  టాబ్లెట్ వేయించా , ఐన మార్పు రాలేదు . వళ్లంతా చెమట , అమ్మ చెప్పింది కాళ్ళు చల్లగా ఉన్నాయని . నాకు అనుమానము వఛ్చి చేతి నాడి పట్టుకున్నా . చాలా ఉబ్బెత్తుగా ఉంది మణికట్టు వద్ద సిరల రక్తనాళం . రక్త  పీడనం ( బీపీ) కొలిస్తే 130/90 ఉంది . ఇక  వెంటనే ఎమర్జెన్సీ కి వెళ్లాలని అర్థమయ్యింది . నాన్న సామాన్యంగా అయితే ఆసుపత్రి అంటే అస్సలు కదలడు  . కానీ ధైర్యం చేసి  అడిగాను , ఎక్కడికి , ఏ ఆసుపత్రికి  అన్నాడు ? .దీనికి ముందే  ఈలోపు నా అద్దె తమ్ముడు నాగరాజు కి ఫోన్ చేసి నాన్నకి నొప్పి  వస్తుంది ఎక్కడికి  తీసుకెళ్తే మంచిది అని అడిగాను . తాను పని చేస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ కి రమ్మన్నాడు .
    
ఆంధ్ర ఆసుపత్రికి అని నాన్నకి చెప్పాను , కాదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళదాం అని చెప్పాడు . సరే వెంటనే బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎన్టీఆర్ govt  ఆసుపత్రికి  వెళ్లాను , కానీ అక్కడ ఒక్క  మనిషి కూడా లేదు . 
COVID -19 బ్లాక్ ఒక్కటే తెరిచి ఉంది కానీ ఒక్క పేషెంట్ కూడా లేడు , కనీసం ఒక్క watchman  కూడా  లేదు  నాన్న   

కామెంట్‌లు లేవు: