About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మందు పిల్లలం బాబు మందు పిల్లలం .... మందు కొట్టక మునుపు మేము మంచి పిల్లలం (అంటే ఐఐటి కి రాక మునుపు )

ఔను రా భై , ఈడ IIT  కాన్పూరులో ఆడ మగ తేడా లేదు Btech  PhD  అని తేడా లేదు , మందు(అంటే బీరు వోడ్కా లాంటివనమాట ) తాగటం ఒక సాధారణ విషయం ఐపోఇందిరో . ఒకోసారి తాగుడు అలవాటు లేనోడు తప్పు చేస్తున్నాడేమో అనే భావన కలుగుతుంది ఇక్కడ . సక్కంగా బాగ్ తగిలించుకుని busy  busy గా campus  gate  బయటికి రాత్రి 9PM  తర్వాత వెళ్తున్నాడు /వెళ్తుంది అంటే ఖచ్చితంగా అమృతం  కోసమే.
కానీ మన తెలుగు పిల్లలు కొంత పర్వలేదనిపిస్తారు . బెంగాలీ పిల్లలైతే ఉగ్గుపాలతో పాటు మందు ఉగ్గు కుడా పోసరేమో అన్నట్టు మద్యపానం లో మునిగి తేలుతుంటారు , ఆడ మగ తేడా లేదండోచ్ వీళ్ళ జాతికైతే . ఉత్తర భారత దేశం పిల్లలకి గంజాయి , సిగరెట్టు , మందు , XXX  ఇవన్నీ ఇంట్లో కొట్టిన పిండి .అలవాట్ల సంగతి ఆ పక్కన పెడితే , ఇక వస్త్రధారణలో పాశ్చ్యాత్య ధారణకి అమ్మమ్మలు వీళ్ళు . ఎందుకింత కష్టాలో వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడికి చదవటానికి వచ్చారో లేక BOLLYWOOD  ఎంట్రన్స్ కోచింగ్ కి వచ్చారో అర్థం కాదు . ఇంకా మిగతా BTech  పిల్లలగురించి చెప్పాలంటే వీళ్ళు ఖచితంగా IIT  కి వచ్చేది US  పోయి ఊడిగం  చేయటానికే. అంతే కాదండోయ్ కొంతమంది పిల్లలు పరీక్షల్లో కాపీ కొట్టటానికి కొంచెం కూడా సిగ్గుపడరు. హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగామ్మయైతే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడదు .    

కామెంట్‌లు లేవు: