నాకు అతిథిని గౌరవించే సంస్కృతి ఇష్టం,
కానీ మన దేశంలో దాన్ని ఆచరించే తీరులో ఎంతో పక్షపాతం కనిపిస్తుంది.
ఎలాంటి తెల్లవాడైనా సరే, విపరీతమైన అభిమానం కుప్పించేస్తారు.
మీరు ఎక్కడైనా చూసారా ఒక నల్ల జాతీయుడికి బొట్లు పెట్టి, వంగి వంగి సలాం చేస్తూ దండేసి హారతి పట్టడం!
అంతెందుకు, మన పక్కింటి వాడిని సరిగా గౌరవించే సంస్కృతి కొరవాయె మనకు.
ఇంట్లోకి పిలిచేముందు కులం ఆరా తీసే జాతి మనది.
తెల్లోడిదే కులమో అడిగారా ఎప్పుడైనా?
కులాలు, మతాలు తప్పు అని డబ్బా మోత చేసి ఆరక్షణ చట్టాన్ని వెక్కిరించే ఒక్కడైనా పర కుల, పర మత స్త్రీని గాని లేక తన ఇంట్లో ఆడపిల్లనుగానీ అన్యమతస్తులకి, అన్యకులస్తులకి ఇచ్చి పెళ్ళిచేసిన సందర్భాలున్నాయా?
అందుకే మూసుకుని అనవసరమైన ఎక్ష్ట్రాలు చేయకుండా కుల, మతాలని గౌరవిస్తూ బ్రతికయడం మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి