చివరి నాలుగు శతాబ్దాలనుంచి జరిగినదేమిటంటే,
1. ఒక సహజ ప్రక్రియను గమనించటం, తద్వారా ఒక నియమం కనుగొనుట.
2. పిమ్మట అందుగల చరరాసులు, స్థిరరాసులు గుర్తించుట.
3. పై రెండిటినీ మేళవిస్తూ ఒక సూత్రాన్ని ప్రతిపాదించుట.
న్యూటన్ నుంచి నా వరకూ అందరూ ఇదే పద్ధతిని అవలంబిస్తూ వస్తున్నారు.
కంప్యూటర్ యుగంలో కూడబెట్టబడుచున్న పుంఖానుపుంకాల వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించేందుకు మస్తిష్క కణజాలాకార వ్యవస్థను అతి ప్రాచుర్యంగా వాడుచున్నారు.
ఈ neural networks ముఖ్యంగా మనకి తెలియని, అంతుబట్టనటువంటి నిర్లిప్త సూత్రాలను తనంతట తానే నేరుస్తుంది.
ఈ యుగంలో మన శాస్త్రవేత్తలు ప్రాదేశిక నియమాలు ఏర్పరిచే తంతుని వదిలి కంప్యూటరు సహాయంతో మస్తిష్క కణ వ్యవస్థబాటనే పడుతున్నారు.
భవిష్యత్తులో ఈ న్యూరల్ నెట్వర్క్స్ అను అంశం క్రింది స్థాయి పాఠ్యాంశాలలో ముందుగానే మొదలుపెట్టవలసిన ఆవశ్యకత కనపడుచున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి