About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మిక్సర్ మెషీన్ లో తిరిగే చక్రం పట్టుకున్నారా?

2008 లో M. Sc. అయ్యాక ఇంట్లో పనిపాట లేనపుడు ఒకసారి తిరుగుతున్న మిక్సర్ చక్రం గట్టిగా పట్టుకుంటే ఆగుతుందా లేదా అని ప్రయత్నించా! దూల తీరిపోయింది!
  ఆ మిక్సర్ యొక్క భ్రమణ బలం ముందు నా వేళ్ళ బలం అస్సలు సరిపోలేదు. మొత్తం పట్టుకున్న మూడు వేళ్ళు వాచిపోయాయి, ఇంకా నయం వేళ్ళు విరగలేదు! అక్కడికీ చాలా బలంగానే పట్టు బిగించా!
    ఈ కొంటె ఆలోచన తట్టడానికి కారణమైన ఉపోద్ఘాతం వివరిస్తా.
మా ఇల్లు తాటాకులతో,  తాటి దూలాలతో, తాటి బొత్తలు, పేడతో అలికిన ఎర్రమట్టి గోడలతో నిర్మించబడ్డది. ఇంటి మధ్యలో అడ్డంగా కట్టిన వెదురు బొంగుకి మా ఇంటిలోని ఏకైక సీలింగ్ ఫాన్ వేలాడుతూ ఉండేది.
  చిన్నప్పటి నుంచీ ఫాన్ మధ్య భాగాన్ని స్పృశించాలని గెంతులేస్తూ ఎవరూ లేనపుడు తెగ ప్రయాసపడేవాడ్ని.
   కొంచెం వయసొచ్చి కాడిలా ఎదిగాక చాలా తేలికగా అందేది. అంతటితో ఆగక గిర గిరా తిరిగే ఫాన్ ను మధ్య భాగంలో వేళ్ళ వత్తిడి సాయంతో నొక్కిపట్టి ఆపటానికి ప్రయత్నించేవాడిని!
చాలా సునాయాసంగా చేయగలిగేవాడిని.
కానీ మిక్సర్ విషయంలో దాని ధాటికి నా వేళ్ళ శక్తి ఓ మూలకు కూడా రాలేదు!

ఇలాంటిదే 2003లో ఒకటి చేసా. షేవింగ్ బ్లేడ్ కి ఎలక్ట్రిక్ వైర్లు తగిలించి బకెట్ నీళ్ళలో పెట్టా!
షార్ట్ సర్క్యూట్ అయి కొంచెం నిప్పులొచ్చాయి.

కామెంట్‌లు లేవు: