About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

My next target is verumaddigudem Buttaayagudem mandalam of manyam

It seems there requires a bridge construction for an easy passage.

If anybody is already belongs to this region please talk to the local MLA or ITDA officers for a speedy establishment of a footpath bridge over there.

Lets see the details .

డికెళ్లాలంటే ఆ విద్యార్థులకు నిత్యం ఓ నరకం.. తాడి చెట్టంత లోతున ఉంటే వాగు గట్టు ఎక్కాలి..దిగాలి.. ఒక్కోసారి పాకుతూ వెళ్లాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పసికూనలు అగాధంలో పడి ప్రమాదముందని ఈ చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇది పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని బుట్టాయగూడెం మండలం వేరుమద్దిగూడెంలోని దుస్థితి. గ్రామానికి దగ్గరలోని మర్రికొయ్యవాగు ఉంది. పాఠశాలకు వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే.. వాగుకు ఇవతలివైపు 60 కుటుంబాలు జీవిస్తున్నారు. వాగుకు ఇరుపక్కల చెట్లు, తుప్పలతో నిండిపోయి పాములకు ఆవాసాలుగా ఉన్నాయి. వర్షాకాలం స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. కనీసం పిల్లల బాధలు చూసైనా తమ గోడును వినాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నిమార్లు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం ఉండటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, బుట్టాయగూడెం

కామెంట్‌లు లేవు: