About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

అంకెల జోక్

తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది... . ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" అడిగింది.
నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా..
వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.
అలాగే
ఏడు 6ని
ఆరు 5ని
ఐదు 4ని
నాలుగు 3ని
మూడు 2ని
రెండు 1ని లెంపకాయలు వేశాయి.
1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.
....
....
జీవితంలో ఎవరో ఒకరు ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.