About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పీత పొట్ట కష్టాలు

గత ఒక నెల నుంచి బరువు తగ్గటానికి తెగ ప్రయాసపడుతున్నా , కానీ నిజాయతీగా చెప్పాలంటే నా గుండు , నేనేమీ కష్టపడలేదు . ఏదో రెండు రోజులు గ్రౌండ్ చుట్టూ రెండు రౌండ్ లు వేసా అదీనూ  వచ్చే పోయే వాళ్లకి సైట్ కొట్టుకుంటూ . ఇప్పుడు నా పొట్ట మంచి బాన ఆకృతిలో వుంది. ఇలాగే ఉంచితే ఖచితంగా ఏ 80kgs కి సునాయాసంగా వెళ్ళిపోతా. అప్పుడు మా హేమనాథం కూడా నాకు పోటీ వస్తాడు . అసలు 67-68 మధ్యలో ఉండేవాడిని ఒక సంవత్సరం క్రితం . హాల్-4 లో సాంబార్ revolution  వచ్చినప్పటినుంచి నాకు pregnancy మొదలయింది .
  ఇదంతా సరిపోక ఈ మధ్య మా అశ్విన్ గాడు mess chairman అవ్వటం తో వాడు అన్నీ మన ఇంట్లో చేసినట్టు చేస్తున్నాడు . ఇంకా నా పొట్ట తగ్గటం అటు పెట్టు , తిరుపతి హుండీలా ఓ తెగ పెరుగుతుంది .
  ఈ పొట్ట తగ్గాలంటే ఎం చేయాలి ఎలా ఎలా How ?



కామెంట్‌లు లేవు: