ఆవునెందుకు చంపకూడదు? మిగతా జీవులకంటే అది గొప్పదా? అని అడిగే వారిని నేనడుగుతున్నా ,
కుక్కని ఎందుకు చంపకూడదు? పిల్లిని ఎందుకు చంపకూడదు?
ఎందుకంటే అవి రోజూ నీతో పాటే జీవిస్తూ నీ దైనందిన జీవితంలో ముఖ్యమైన, ప్రియమైన, స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయి గనుక. అవి చనిపోతే మనకి దగ్గరి వ్యక్తి చనిపోయిన భావన కల్గుతుంది.
ఒకవేళ మీకు కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులనే తినే సంస్కృతి ఉంటే, ఆయా సంబంధిత సమాజంలో మీరు మీ ఇష్టం.
కానీ ఆవుని పవిత్రంగా భావిస్తూ వాటిని తమ కుటుంబంలో ఒక భాగంగా పరిగణించేవారిని నొప్పించకండి!
ప్రతి వాడికీ ఏదో జంతువు అసహ్యం అవ్వ్వొచ్చు, ప్రేమ అవ్వ్వొచ్చు. కానీ ఎందుకు అనేముందు మీ ఆలోచనల్ని అద్దంలో చూసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి