About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఆకులకు కాదు వేరుకి నీరందాలి !



ప్రాథమిక విద్యను బాగుచేయకుండా దేశం దూసుకెళ్ళిపోవాలనుకోవడం అవివేకం 

చదువులో మనోళ్లు సగటు కంటే దిగువనే.. 
విద్యాసామర్థ్యాల్లో జాతీయసగటు కన్నా కిందనే తెలుగు రాష్ట్రాలు 
దేశవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులపై ఎన్‌సీఈఆర్‌టీ సర్వే 
ఈనాడు - హైదరాబాద్‌ 
దేశవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. సగటు మార్కుల కంటే దిగువనే ఉన్నారు. ఐదు సబ్జెక్టుల్లో విద్యార్థులను పరీక్షించగా బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభ కనబరిచారు. చివరకు గణితంలోనూ బాలికలదే పైచేయిగా ఉండటం విశేషం.
ఎన్‌సీఈఆర్‌టీ ప్రతి ఏటా 3, 5, 8 తరగతి విద్యార్థుల్లో వివిధ పాఠ్యాంశాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుంది. మొదటిసారిగా పదో తరగతి విద్యార్థులపై సర్వే చేశారు. దేశంలోని మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంగ్లం, గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం, ఆధునిక భారతీయ భాషలపై 2015లో ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించిన ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా నివేదికను విడుదల చేసింది. మొత్తం 7,216 ప్రైవేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2,77,416 విద్యార్థులను పరీక్షించారు. ఒక్కో రాష్ట్రంలో 358 పాఠశాలల్లో ఈ సర్వే జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో సర్వే విశేషాలు... 
జాతీయ సగటు కంటే రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వెనకబడ్డారు. 
గణితం సహా అన్ని పాఠ్యాంశాల్లోనూ బాలురు కంటే బాలికలే ముందంజలో ఉన్నారు. 
జాతీయస్థాయిలో పట్టణ ప్రాంత విద్యార్థులు ముందంజలో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గ్రామీణ విద్యార్థులే మెరుగ్గా ఉన్నారు. 
జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు అన్ని విధాలా ముందుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల కంటే ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులే ముందున్నారు. 
విద్యార్థుల స్కోర్‌ను పరిశీలిస్తే తెలంగాణ విద్యార్థులు ఏపీ కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. 
400 పాయింట్లుకు గానూ 250 వస్తే సాధారణ స్కోరుగా పరిగణించారు.



కామెంట్‌లు లేవు: