ఖచ్చితంగా..
కేవలం సంవత్సరానికి 700₹తో 10వ తరగతి పూర్తిచేసా.
ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 3000₹తో అయిపోయింది.
డిగ్రీ లో సంవత్సరానికి 2500₹.
IITలో నాలుగు సెమిస్టర్ లకు కలిపి 50000₹.
6సం.ల PhD కు 7 లక్షలు ₹ ప్రభుత్వం నాకు చెల్లించింది.
నేను చెల్లించిన సొమ్ముతో నాకు చదువు చెప్పిన భారతీయ సంస్థలు తమ ఉపాధ్యాయులకు ఒక నెల జీతం కూడా ఇవ్వలేరు.
ఈ రకంగా దేశ ప్రజల సహకారంతో చదివిన నేను చివరికి వచ్చేసరికి పరాయి దేశ సంస్థలకు ఊడిగం చేస్తున్నాను.
ఎందుకు అంటే లక్ష కారణాలు చెప్తా. కానీ నన్ను దేశద్రోహి అంటే సహించను, ఎందుకంటే నాకు మన దేశం తిండి తప్ప వేరేది నచ్చదు. డాలర్స్ ఐతే మింగుడు పడతాయి. 😂
ప్రతి నెలా నా దేశానికి డాలర్స్ పారేస్తా.
అది కూడా దేశభక్తి అని నన్ను నేను సిగ్గులేకుండా సమర్తించుకుంటాను.
ఇప్పటికి ఎన్నో లక్షల డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తమను పెంచిన మాతృభూమిని వదిలి పిల్లలకు పరాయి దేశ పౌరసత్వం కోసం తిరిగి స్వదేశం మొఖం చూడలేదు.
మా లాంటి అతి తెలివి వారందరూ కొంత కాలం మాత్రమే బయట ఉండి తిరిగి దేశానికి తిరిగి వచ్చి ప్రజల కోసం కష్టపడితే ఈ పాటికి మన దేశం కూడా చైనాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉండేది.
పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని తొక్కి నార తీసేది.
ఈ పాటికి మన దేశంలో ఇంకో గూగుల్, ఇంకో ఫేస్ బుక్ మొదలయ్యేది. పిల్లలకు అత్యున్నత సాంకేతిక విలువలున్న ఉపాధ్యాయులు కరువయ్యేవారు కాదు. ప్రభుత్వ వైద్యాలయాల హీనస్తితిని ఖచ్చితంగా చూసి ఉండేవాళ్ళం కాదు.
మాకు మా దేశం కంటే డబ్బే ముఖ్యం. మాలాంటి అమ్మ కడుపు కొట్టిన దేశద్రోహులకు పరాయి దేశంలో తెల్లవాడి మాటలకు కట్టుబడి ఉండటమే బాగా రుచి.
అవును గత 80 యేళ్ళు గా దేశానికి నమ్మక ద్రోహం చేశాం. మాకు జాతికి కొంచెం కూడా మానం, అభిమానం ఖచ్చితంగా లేవు, లేవు, లేవు!
మాకు ఊరగాయ , గోంగూర, ఉలవచారు, నేతి మిఠాయిలు పంపండి. అవి లేకపోతే మళ్లీ బతకలేం.
జైహింద్ 😂😂😂
జై తెలుగుతల్లి 😂😂😂
ROFL, LOL, SHIT and Fuck you!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి