ఈనాడులో వచ్చిన ఆర్టికల్ : డబ్బుతో అగ్రరాజ్యాన్నే తొక్కేసింది..!
2010లో జరిగిన 2022 ప్రపంచ కప్ బిడ్డింగ్‌లో ఖతార్ విజయం సాధించింది. దీని వెనుక ఖతార్ అమలు చేసిన వ్యూహం ఇటవల బట్టబయలైంది. దీనికి సంబంధించిన పలు పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రపంచకప్ నిర్వహణకు ఖతార్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌లు పోటీపడ్డాయి.
ఖతార్ వ్యూహం ఇదీ..
పోటీని ఎదుర్కొనేందుకు ఖతార్ అమెరికాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ సంస్థ బీఎల్‌జేను నియమించుకొంది. దీంతోపాటు బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల బృందాలను ‘మేనేజ్’ చేసేందుకు ఒక మాజీ సీఐఏ ఏజెంట్‌ను కూడా నియమించుకొంది. దీంతోపాటు ప్రత్యర్థి దేశాల్లో ఫిఫా ప్రపంచకప్ నిర్వహణపై వ్యతిరేకత ప్రబలే విధంగా ప్రచారం చేయించింది.
* అమెరికా ప్రపంచ కప్ నిర్వహిస్తే ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతుందంటూ ఓ విద్యాసంస్థ ద్వారా నివేదిక తయారు చేయించి ప్రచారంలోకి తెచ్చింది. దీనికి దాదపు 9వేల డాలర్లు చెల్లించింది.
* ప్రత్యర్థి దేశాలకు చెందిన కొందరు ఎంపిక చేసిన జర్నలిస్టులను, బ్లాగర్స్‌ను, హైప్రొఫైల్ వ్యక్తులను నియమించుకొని ప్రపంచకప్ నిర్వహణకు వ్యతిరేకంగా మాట్లాడించింది.
* ముఖ్యంగా బిడ్డంగ్‌లో అమెరికానే ఖతార్‌కు ప్రధాన ప్రత్యర్థి. దీంతో అమెరికాలోని కొందరు ఫిజికల్ ఎడ్యూకేషన్ ఉపాధ్యాయుల బృందాన్ని నియమించుకొంది. ప్రపంచకప్ నిర్వహణ ఖర్చుతో పాఠశాలల్లో క్రీడలను అభివృద్ధి చేయాలని వారు అమెరికన్ కాంగ్రెస్‌ను కోరారు.
* ఆస్ట్రేలియాలో రగ్బీ క్రీడలు జరుగుతున్న చోట్ల ఫిఫా బిడ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించింది.
* బిడ్డింగ్‌లో పాల్గొనే ప్రత్యర్థి దేశాల వ్యక్తులపై నిఘాపెట్టి నివేదికలు తెప్పించుకొంది.
బయటపడింది ఇలా..
తాజాగా వీటికి సంబంధించిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. దీనిని 2022 బిడ్డింగ్ బృందంలో పనిచేసిన ప్రజావేగు ఒకరు సండేటైమ్స్‌కు వీటిని మెయిల్ చేశారు. దీంతో ఈ వ్యహారం బయటకు వచ్చింది. ఈ ఆరోపణలను ఖతార్ కొట్టిపారేసింది.
గతంలో ఖతార్ బిడ్డింగ్ బృందంపై ఆరోపణలు రావటంతో ఫిఫా దర్యాప్తు చేపట్టింది. కానీ ఈ దర్యాప్తులో ఖతార్ బృందాన్ని నిర్దోషులుగా తేల్చారు. తాజా ఆరోపణలతో ఖతార్‌లో ఫిపాకప్ నిర్వహణ వివాదాస్పదంగా మారింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి