About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

సిగ్గులేని అసోచాం ASSOCHAM

ధనిక పారిశ్రామిక వర్గానికి డబ్బు మాత్రమె ముఖ్యం . నల్ల  ధనం  దాచటం గురించి ఏ మాత్రం   సిగ్గు లేకుండా  వెనకేసుకు వస్తుండటం అసోచాం ద్జనిక దరిద్రులకే చెల్లు .
     ఒక దొంగ పేరు బయట పెడితే ఆ దేశ  ప్రతిష్ఠ దెబ్బతింతున్నదన్న  మహా సత్యాన్ని  మన అసోచాం  ప్రభుత్వానికి భోదిస్తుంది .

అసోచాం - ASSOCHAM--   The Associated Chambers of Commerce & Industry of India.
అసోచాం  నిజంగానే అశోచనీయం .  

బురఖా వేసుకుని ఫోటో దిగితే ఎలా ఉంటుంది ?

నా బొందలా ఉంటుంది . పాపం ఈ విషయంలో ముస్లిం స్త్రీల భాద చెప్పుకోలేనిది . అన్ని ఫామిలీ ఫొటోస్ లో  జీవితాంతం
ముసుగు ఫొటోలే . తలుచుకుంటే ఒక పక్క నవ్వు కూడా వస్తుంది .
పోలా అదిరిపోలా ...



అసలు సిసలైన నాయకులంటే గుజరాతీలే

1. మోహన్ దాస్ కరం చంద్ గాంధి
       దేశాన్ని భవిష్యత్తులో హింసకు దూరంగా ఉంచాలని అహింసతో స్వాతంత్ర్యం తెప్పించాడు , ఈ ఆలోచనకి ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోయాడు . ఈరోజుల్లో ఏమైనా సమస్య వస్తే నిరాహారదీక్ష లేక రాస్తారోకో లేక బంద్ (సహాయనిరాకరణ ) తప్ప ఇతర మార్గాలు ఎంచుకోరు చాలామంది , కారణం గాంధీ నే .
2. సర్దార్ వల్లభాయ్ పటేల్
       దేశంలో కాన్సర్ లాంటి రాజ్యాలను బలంతోను , మిగతా 498 మందిని ఒకే ఒక సమావేశంతో  ఒకే ఒక రిపబ్లిక్ గా చేసిన ఘనత పటేల్ గొప్పతనం .
3. నరేంద్ర మోడీ
      ఇతను చేయటం మొదలుపెట్టేసాడు , ఈ పరుగు ఎంత దూరం సాగుతుందో గానీ , జనం మాత్రం కొత్త ఉత్సాహం తెచ్చ్సుకున్నారు . మొదటిసారి దేశం కోసం ఆలోచించటం అనేది ఈ ప్రధాని ఒక్కడే నేర్పించాడు .
ఈ మాత్రం చాలు గుజరాతీ భాయ్ లని ఆకాశానికి ఎత్తటానికి ! 

జ్యోతిష్యం నచ్చకపోతే సైన్స్ నమ్మేస్తారంట !

జ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో  చాలా  ఎక్కువగా  చూస్తున్నాం  . మరి   సైన్స్   ఏం  చెప్పినా నమ్మేస్తారా  !
ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ  మనకి ఆనట్లేదు ఏ విషయమూ .
ఒక గణిత నమూనా (mathematical  model ) ఆధారంగా మీకు సరిపోయే జోడిని చూపిస్తే  గంతులేస్తూ  పెళ్లి చేసుకుంటారు ఈ రోజు మేధావి కుర్రోళ్ళు /కుర్రమ్మలు  .  ఈ లోకం లో  ఉన్న ప్రతి వ్యవస్థని గణిత చిహ్నాలు (mathematical  symbols ), వాటి మధ్య సంబంధాలు (patterns  అండ్ relations )   సహాయంతో  ఒక సూత్రంగా ( as  a  formula ) వ్రాయవచ్చు . కానీ అది న్యూటన్, Einstein,  హాకింగ్ కి కూడా సా సాధ్యపడలేదు  ఏ ఒక్క విషయం లొనూ ...  . వారు అంతా స్థూలంగా  చేసేసారని భావిస్తే అది మీ వెర్రితనం .
   జ్యోతిష్యం పేరుతో వేల కోట్లు గడిస్తున్నారని తెలిసింది  ఈ మధ్యే ఒక బెజవాడ సుపారీ హత్య వల్ల .
ఒక మోడల్ సహాయంతో  ప్రస్తుతమున్న కుర్రకారుని వెర్రివాళ్ళుగా   చెయ్యొచ్చా ??

Famous Statistician,  E.P.Box says  --"ALL models are wrong , only some are of  use"

నా స్నేహితుడు  రామ్ వ్యంగ్యంగా చెప్పినట్టు ,  " ఎందుకో మరి సైన్స్ మాత్రం  గ్రీకు భాషలో చెప్తేనే అర్థమవుతుంది , ఫన్నీ గా ..."

పెను తుఫానులు చూపుతున్న సామాజిక భాధ్యత

ఇదేదో పైత్యంతో  రాశాననుకునేరు ! 
విద్యుత్ స్తంభాలు కూలిపోవటం , బలంగా లేని ఆనకట్టలు తెగిపోవటం , పాత పాత పాఠశాలలు కూలిపోవటం , నాసిరకం రహదారుల్లో ఉన్న డొల్లతనం బయటపెట్టటం ఇవన్నీ ఏ ప్రభుత్వం సాహసించలేని సమాజానికి జరుగుతున్న మహోపకారం . 
  ఎలాగూ తుఫాను హెచ్చరిక వల్ల  పైన ఉల్లేఖించబడిన స్థలాలలో పిల్లలు-జనం ఉండే ప్రసక్తి లేదు . కనుక జన  నష్టం చాల చాల పరిమితం.