About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

బోర్ కొడుతుందా ???

హుషారుగా ఉండే ఒక మనిషినితో మాట్లాడండి , ఏదోకటి చేయండి కానీ మీరు కలిసే వ్యక్తి చాల హుషారుగా ఉండాలి .
ఖచ్చితంగా మీ మానసిక స్థితి కొంత మారుతుంది . కొత్త ఆలోచనలు మీకూ వస్తాయి . 

భూకంప మేళా !

సరిగ్గా 2015 ఏప్రిల్ 25న  నాకు మొట్టమొదటిగా భూకంప ప్రాసన జరిగింది . ఆ రోజు  పొద్దున్న మంచి నిద్రలో ఉన్నా , 11:45కి సరిగ్గా ఎవరో నా మంచాన్ని ఎత్తి  కొంచెం తేడాగా ఊయల ఊపుతున్నట్టుగా ఉంది , కానీ అదేం  అంత హాయిగా లేదు , కొంచెం తల తిరిగినట్టుగా అనిపించింది .   హఠాత్తుగా లేచి చూసెసరికి కొంచెం భయపడ్డా . రాత్రంతా ల్యాబ్ లో పని చేసి ఉండటం వల్లనేమో , మొదట ఏమైనా నరాల బలహీనత , నిద్రలేమి కారణంగా  అలా అనిపిస్తుందేమో అని కొంచెం బొక్కబోర్లా లేచి నన్ను నేను గట్టిగా బిగపట్టి  పరీక్షించుకుంటున్నా . ఐనా   సరే  తగ్గలేదు . ఇప్పుడు తట్టింది నా బుర్రకి ఇదేదో భూకంపం చాయలతో ఉందని గ్రహించా. నా లాంటి పరిస్థితిలో ఇంకెవరైనా వున్నారా అని బయటికి వచ్చి చూస్తున్నా . ఈలోపు మూడవ అంతస్తు విద్యార్థులు క్రిందకు పరుగు లంఘించారు . నేను సుతారంగా ఓపుకుంటూ నెమ్మదిగా కిందకు వచ్చి అందరితో పాటు నుంచుని భూకంప మేళాలో మొదటి పర్యాయం  కనులవిందుగా  తిలకించాను .( విందా నా బొంద ! ఉచ్చ  పడింది )
   కాసేపటికి అందరం ఎవరి గదులలోకి వారు వెళ్ళిపోయాం . నాకు ఇక రూం లో ఉండటం వల్ల  కాదని  మళ్ళీ మా గణిత పరిశోధన విభాగానికి బయలుదేరా .
     లాబ్ లో ఉండగా మద్యాహ్నం 12:50కు ఇంచుమించుగా మా  IIT కాన్పూర్ ఆరంతస్తుల  FACULTY భవనం (నేను ఐదవ అంతస్తులో , అంటే గాలిలో ఉన్నా )  మేళాలో రెండవ పర్యాయం ఆరంభించింది . ఈసారి ఆలోచించేది లేదు , కిందకు తాపీగా ఓపుకుంటూ దిగాను , అయినా ఎక్కువ సేపు లేదు లెండి . ఆరోజు నిద్రపడితే ఒట్టు , దీనమ్మ జీవితం .
      రెండవ రోజు సరిగ్గా  ,మధ్యాహ్నం 1:25 కి మళ్ళీ నిద్ర లోచి ఉలిక్కి పడ్డా , ఇంకేముంది మళ్ళీ అదే ! పరుగో పరుగు కిందకి.
    మూడవరోజు కూడా అదే సమయానికి నిద్రలో ఉన్నా కానీ భూమీ కంపించలేదు , కానీ నిద్రలో అకస్మాత్తుగా లేచి కిందకి పరిగెత్తా . ఒక్కరూ బయటికి రాలేదు . అప్పుడు అర్థమయ్యింది నాకు బాగా ఎక్కేసిందని .
 ఆ దెబ్బకి రోజూ ఏదో ఒక నిమిషం అంటే ఇప్పటికి  కూడా భూమి కదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది .  థూ  నా జీవితం  ! 

చదువులు మనవి సోకు అమెరికాది

ఇక్కడ ప్రభుత్వాలు కిందో మీదో పది ఐ ఐ టి లో పిల్లల్ని  చదివిస్తే వాళ్ళందరూ అమెరికాకు ఎగిరిపోయి జీవిన్తాంతం అక్కడే సోకులతో గడిపేస్తున్నారు .  
     ఏ మాత్రం చదువు వచ్చినవాడు  బయటికి పోతుంటే  ఇక్కడ సమాజం ఎప్పటికి బాగుపడుతుంది ? 
ఎప్పటికీ విజ్ఞానాన్ని కొనుక్కునే దుస్తితేనా ? 
    ఒక విజ్ఞానవంతుడైన ఆచార్యుడు మన దేశం లొనే ఉంటే  కనీసం తన జీవిత కాలంలో ఇంకో 30 మంది విజ్ఞానవంతుల్ని తీర్చిదిద్దగలడు . తరతరాలుగా ఈ బుద్దిమాంద్యం కొనసాగుతోనే ఉంది . 

ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో ... (పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక )

ఒకరిని పిచ్చిగా అభిమానించి ఇష్టపడటంలో  ఇంతటి మేలుంటుందని ఎప్పుడూ  గ్రహించలేకపోయా .
అభిమానం పేరుతో వెర్రిగా గంతులేసే జనాన్ని చూసి  చాలా  చులకనగా చూసేవాడిని .
  కానీ  కొన్ని కష్ట సమయాల్లో  ఎటూ దారి తోచని స్థితిలో  ఒకరిపై ఉన్న అభిమానం వారిని బ్రతికించటమే కాక గంతులేఇంచేస్తుంది.  పవన్ కల్యాణ్ణి అభిమానించే శ్రీజ అనే ఖమ్మం అమ్మాయి అదృష్టం చూశాక నేను కూడా ఎవరో ఒక ప్రముఖుల్ని పిచ్చిగా అభిమానించడం నేర్చుకోవాలన్న ఆశ (దురాశో ) పుట్టింది .

ఇక్కడ పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడో లెదో తెలియదు కానీ అతన్ని అభిమానించే కుర్రకారుకి  మాత్రం  వారి చావు కాలంలో ఖచ్చితంగా  వెర్రి అభిమానం అనే  ఒక లైఫ్ లైన్ ఉందని గ్రహించాలి .
   ప్రతి దానికీ అతిగా ఆలోచించే నాలాంటి వాళ్ళకి ఉత్త మందులు-మాకులే శరణ్యం తప్ప ఏ దేవుడూ కాపాడలేడు . :D        

Nice quote by Ashish Goyal, A young Blind entrepreneur

"The more you trust people, the more they are empowered to help" -Ashish
Goyal,