అమెరికా వచ్చాక ప్రతిఒక్కరూ తమకి తెలిసో తెలియకో కొన్ని నేర్చేసుకుంటారు. వాటిలో ముఖ్యమైన ఐటమ్స్ :
1.పులిహోర కలపటం,
ప్రతి చిన్న దగ్గుకి, తుమ్ముకీ సారీ చెప్పటం! అదేదో చేతితో అడ్డుపెట్టుకుని చేస్తే సరిపోతుంది కదా, గాలిలోకి నేరుగా తుంపరలు వెదజల్లకుండా!
నా దృష్టిలో కృతజ్ఞత తెలుపటం చాలా పవిత్రమైనది. కానీ ప్రతి పూంపుహార్ పనికీ దాన్ని వాడేయటం వల్ల అసలైన సందర్భంలో ఆ మాట వాడినప్పుడు చప్పగా తోస్తుంది.
2.బిస్కెట్లు వేయటం!
America is land of opportunities, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడికొచ్చాక బిస్కెట్ వేయటం రాకపోతే మిమ్మల్ని పేద్ద పప్ప కింద జమకడతారు. అర్థం ఐనా కాకపోయినా ఆహా ఓహో అని బుర్రకథ లాగా భరించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి