About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఆవు చేనుమేయు దూడ గట్టు మేయునా !

ఈనాటి ఈ తెలుగు  అద్వాన్న స్థితికి కారణం మీ పెద్దలే . డబ్బు మీద విపరీత వ్యామోహం తో పిల్లల్ని ధన క్షీరదాలుగా తయారుచేసారు . తెలుగు తల్లి పేరు చెపితే అదేదో బూతు మాట్లాడిన భావం ఉంది ఇప్పటి పిల్లల్లో . కారణం ఎవరి పెంపకం ? ఇక్కడ ఐ ఐ టి కాన్పూరు లో ఎప్పుడైనా మన తెలుగు పండుగలు జరుపడానికి మెయిల్ వ్రాసినప్పుడు తెలుగు లో కూడా రాయండి మహాప్రభో అన్నందుకు ఇక్కడ ప్రతినిధి ఇచిన జవాబు ఏంటంటే " చాల మంది మన తెలుగు జాతి పిల్లలకి తెలుగంటే తెలీదంట , చదవటం రాదంట !"  ఏం తెగులు పుట్టింది వాళ్ళ తల్లితండ్రులకి ? అక్కడకి వారేమీ అణచివేయబడ్డ కులాల జాతి కూడా కాదాయె ఒకవేళ క్రైస్తవ మత వ్యామోహం లో తెలుగుని పాతరేయటానికి  !  
    ఏం పోయేకాలమో మన రెండు రాష్ట్రాల వెబ్సైటు లు కూడా ఒక్క ముక్క తెలుగు అక్షరం  పెట్టనే లేదు .

         అంటే  ప్రభుత్వం ఆంగ్లం నేర్చిన జనులకేనా ? 

కేంద్రం కూడా ఇదే తంతు హిందీ నేర్చిన వాడే ప్రభుత్వ ప్రకటనలు చదవగలిగేది ?

మరి ఆంగ్లం-హిందీనో   తెలియని వాడికి ప్రభుత్వంతో సంబంధం లేదా ? కానీ వాడి ఓటు మాత్రం కావాలా ? 

కామెంట్‌లు లేవు: