About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పాపం తెలీక అడుగుతారు అంతే

మనవాళ్ళ లేక్కేంటంటే ఏ డిగ్రీనో ,ఇంజనీరింగో ఐపోగానే ఠపీమని ఏదో ఒక ఉద్యోగం వెలగబెట్టాలి , అంటే పొద్దున్నే 9కి షర్టు బూటు  వేసుకుని కంగారుగా వెళిపోయి సాయంత్రం 5కి చెరిగిన జుట్టుతో ఆముదం ముఖం వేసుకుని ఇంటికొచ్చి టివి ముందు వాలిపోవాలి . వీళ్ళందరికీ సరిగా తెలియని ఇంకో లోకం వుంది , అదే పరిశోధనా రంగం . వాళ్ళకున్న జ్జ్ఞానమేమంటే చదువనేది ఉద్యోగం కోసమే , ఆ ఉద్యోగానికి చదువుకి ఏ మాత్రం సంభంధం లేదని వాళ్ళ అభిప్రాయం . జీవితాంతం చదివేవాడిని వెర్రి పుల్లయ్య (అంటే చేతకానోడు ) అని అనుకుంటుంటారు . పాపం వారెప్పుడు ఆలోచించలేదు అసలు cellphoneలు  ,బస్సులు ,బళ్ళో పాఠాలు ,కంపూటర్లు ,కలర్ మూవీలు ఎలా వచ్చాయో , అవిగాను చేసినందుకు లేక చేసేటందుకు ప్రయత్నిస్తున్నందుకు గాను ,పరిశోధన సంస్థలు ఎంతటి మొత్తాల్ని ముట్టజెప్తాయో ,వారికి సమాజంలో లభించే పరపతి ఏమిటో తెలీకనే తప్ప , ఇంకే ఉద్దేశ్యం కాదు .
  మా ఇంటికెళ్ళినప్పుడల్లా  ,"ఇంకా ఏం చదువులు బాబు, ఎంతకాలం !?. ఉద్యోగం ఏమీ దొరకట్లేదా ? " అని ఎవరైనా అని ఎవరైనా అంటే కాస్త కాలుతుంది , ఒక నిమిషంలో కుదుటపడి చిన్న నవ్వుతో నాకు నేనే సర్దిచెప్పుకుంటున్నా . ఒకోసారి కొంతమందికి వివరణ ఇస్తుంటే వాళ్లకి నచ్చట్లేదు , ఎం చేస్తాం వాళ్ళ దృష్టిలో ఉద్యోగమే పరమావధి .


అధర్వణ వేదంలో ఇది చెప్పబడింది ---
   "వ్యవసాయం ఉత్తమం
     వ్యాపారం మధ్యమం
     ఉద్యోగం అథమం
     యాచకం అథమాథం " .

పరిశోధన అనేది  పాతకాలంలో ఋషులు మునులు చేసేవారు , అది కూడా వ్యవసాయమే .

కామెంట్‌లు లేవు: