మొన్నటి వరకు యూనియన్ బ్యాంకు online transactions కి 3-fold సెక్యూరిటీ ఉండేది .
ఇప్పుడు వాడి వెర్రి ఆరింతలైంది .
అంటే మూడు పువ్వులు ఆరు పుచ్చులైంది !
నా దరిద్రం ఇలా ఏడ్చింది .
గాంధీ జయంతి రోజు పొద్దు పొద్దునే నా సహనానికి పరీక్ష జరిగింది .
sms రిచార్జ్ రూ. 43 చేద్దామని టాటా డొకొమొ వెబ్సైటు కి వెళ్లి తతంగం ఆరంభించా ...
మొదట , యూనియన్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్ ఐంది , user తర్వాత password ఎంటర్ చేశా .
తర్వాత,
మొబైల్ కన్ఫర్మేషన్ కి ఒక "Roaming activation code " వచ్చింది (నా అదృష్టం వాళ్ళ నెట్వర్క్ బాగుంది , త్వరగానే కోడ్ వచ్చింది ).
ఆ తర్వాత , PKI password (with personal assurance message PAM) అడిగింది (దీనికి సంబంధించిన తంతు సరిగ్గా ఒకరోజు ముందే ఏదో పనిలో పనిగా చేయబడింది కనుక నాకు కంప్యూటర్ పగలగొట్టుకోవలసిన సదవకాశం చేజారింది )
ఇప్పుడు 3-fold సెక్యూరిటీ ప్రారంభం , అన్దరూ తప్పట్లు లేదా చిటికెలు ....
భేష్ భేష్ .. మంచి ఉత్సాహంగా ఉంటారు ఎదుటివాడి ఉరావస్థని చూసి పగలపడి నవ్వటానికి . ఇంకా ఆపండి !
ఇంకా సరే రూ 43 చెల్లించమని సరే బొత్తం (ok button ) నొక్కా .. నా మొబైల్ కి OTP password పంపింది . విపరీతమైన పట్టలేని ఆనందం తో అది కూడా నింపాను (ఒక అర నిమిషం పట్టింది అది నా మొబైల్ కి చేరటానికి ) .
చివరగా , user and transaction password అడిగింది . ఇచ్చేసా అది కూడా ఇచ్చేసా .
నా మొజిల్లా చక్రం తెగ తిరిగేస్తుంది , ఒక ఎర్రటి గులాబి లాంటి గుచ్చుకునే సందేశం నా (కంప్యూటర్ ) మొహం మీద
విసిరిపారేసింది . "Your recharge transaction timedout . Please wait for 2-3 days to
get back your money."
దీనికంటే sms ని speedpost చేయటం చాలా తేలిక.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి