About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Music Manifold or Space of Music

All the good music we hear is rhythmic. Rhythmic means it has a pattern. Pattern means it satisfies some Mathematical properties. So all these rhythms can be seen as a subspace of signal functions in the a Universal function space.
  If this can be proved , rest of all missed out Music by the Musicians/singers up-to-date can be constructed, possibly some other subspaces may be found which can add new genres like
alien-music.

If it is true, then next target is to reign the space of images, next videos, next All Movies with music.
P.S: The word 'Aesthetic' is still not well-defined. 

How to remember more of a good talk/speech

write it down roughly (jot down) on a paper while you are listening. It makes a second copy of information in your brain through motor cortex actions from the movement of your hand.

what makes a Mathematician different from others?

An Engineer, a Physicist ,or a Biologist or a Mathematician , everyone can solve a problem for the time, but A Mathematician never satisfies with just an answer/solution to the problem , he checks each and every line for different possibilities like,
1. Is it the only way to solve ?
2.Can it be done much more simpler?
3. Does the solution stays like that with time?
4. What will happen to the solution if some elements/arguments are taken apart?
5. Is it really a solution or just looks like? if so , how many?
6. What are strengths and weaknesses in a problems solution ?
7. Can the solution process be generalized for abstract problems or nearly equal problems?
8. If the solution is an approximate then how far away it is from the actual?
9. How to classify all the problems that are near  OR equivalent to the current Problem?
10.How to formalize a theory for it so that others can see it easily?

and the last of all, A Mathematician is so economical that he requires only a pen and a paper.


"Biologists think they are biochemists,
      Biochemists think they are Physical Chemists,
      Physical Chemists think they are Physicists,
      Physicists think they are Gods,
      And God thinks he is a Mathematician." -a joke

తమిళుల పరిస్థితి దారుణం .. నూతిలో కప్పల వైనం వీరి ఆలోచనలు

ఈ మధ్యన ఒక workshop కు హాజరయ్యాను , IMA-భువనేశ్వర్లో  . కొంతనది తమిళ్ తంభిలు కూడా వున్నారు .
వారికి హిందీ కొంచెం కూడా తెలియకపోవటం వల్ల , తినే తిండి దగ్గర నుంచి ప్రతి అడుగు వాళ్లకి సమస్యలే . ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లకి తమిళనాడు దాటితే ఏ పండోర గ్రహం లోనో కాలు పెట్టినట్లు వుంది . కనీసం ఏక్  అంటే ఒకటి అని కూడా   తెలీదు. నాకు ఎప్పడు బుర్ర తిరిగిందంటే , పచ్చిమిరపని చిల్లీ అనిగానీ , మిర్చి అనిగానీ పెప్పర్ అనిగానీ అంటారన్న ఇంగ్లీషు పదాలు కూడా తెలియలేదు . హిందీ అంటే కోపమే , సరే దాని అవసరం లేదు , మరి ఇంగ్లీష్ కి ఏమైంది అందులో కూడా పప్పుసుద్దలేనా ?? ఏదో ఒక్క పరభాషా ఐనా నేర్చుకుని ఏడవాలి కదా బయటకు వచ్చే ఆలోచనలుంటే . ఇలాంటి తెగలు ఏవిధంగా అభివృద్ది చెందుతాయో చెప్పటం కష్టమే .
    కానీ ఒక సైన్స్ విషయంలో , తమిళ జాతి నుంచి పెద్ద పెద్ద ఉద్దండులు పైకి వచ్చారు .కానీ ఏం లాభం , అందరినీ కలుపుకొని పోనప్పుడు . ఒక్క క్రమశిక్షణ అనేది పక్కన పెడితే , బెంగాలీలు మనదేశంలో కెల్లా ఆదర్శప్రాయులు , వారికి ఇతర సంస్కృతులను గౌరవించే /గుర్తించే సుగుణాలు వున్నాయి , ఆలోచనలో లోతు , ఇంకా చెప్పాలంటే మంచి తత్వవేత్తలు ... అందుకేనేమో  కట్టుబాట్లు , శుచి- శుభ్రత గాలికొదిలేశారు .
  మన తెలుగువారోకొస్తే , మనం మంచివాళ్ళం , అంటే దానర్థం మన పని  మనం చేసుకుంటాం , మిగతావాళ్ళు ఏమయిపోయినా  చీమ కూడా  కుట్టదు . ఎప్పుడూ డబ్బు యావే , చదువుకి విలువుండదు , కానీ విలువైన చదువు మాత్రమె కావాలి .

ఇది నా పొట్టకూటి కోసం ...

సైన్స్ లెక్కల్లో  ఉన్న చిన్న చిన్న ఆలోచింపచేసే విషయాలను సినిమా నేపధ్యంలో  వినోదాత్మకంగా రాసి , స్కూళ్ళు-కాలేజీల ముందు అమ్ముకోవాలి , అదీను 2 , 3 రూపాయలలో.  
In future: ఈ పని ఖచ్చితంగా నా పిల్లలతో చేయిస్తా .

రూపాయిని రక్షించలేమా ? దారేంటి ?

మన ఆర్థికవేత్తలేమో మనదగ్గర సరిపడినన్ని డాలర్లు లేవంటారు. అంటే పరదేశాలలో రూపాయలు ఎక్కువున్నాయా?
ఖచ్చితంగా  కారణం ఇది కాదు . ఇంకేదో వుంది , అది మనమే .
మనం రొజూ వాడే వస్తువులు తినే పదార్థాలు అసలు ఎవరు మనకి అమ్ముతున్నారో ఆలోచించండి .
అన్నీ తెల్లోడే అమ్ముతున్నాడు , ఊరికే అమ్ముతాడా ? కాదు !లాభం కావాలి .
మరి వాడు లాభపడుతుంటే , దానర్థం మన సొమ్ము వాడి జేబులో పడుతుందని . ఈ తంతు ఎన్నో వందల సంవత్సరాలు అంటే బ్రిటీషు కాలం నుంచి సాగుతుంది . మన దగ్గర పత్తి కొని మనకే జీను పాంటులు అమ్ముతారు . అందుకే విదేశి వస్తు బహిష్కరణ , స్వదేశి వస్తు వాడకం పెరగాలని గాంధి లాంటి గ్యాంగ్ ఎప్పుడో చెప్పారు . కానీ మనం వినం , పెద్ద పెద్ద మాల్ల్స్ లో మంచి మంచి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులే కొంటాం . మన పరపతి , గౌరవం  మరి వేసే బట్టలబట్టి వస్తుందని కదా మన అభిప్రాయం . అలాగే PEPSI co  CEO ఇంద్ర నూయి లాంటి స్వార్థ మహిళలు మన చేత బాగా తగించి ఆ సొమ్మును విదేశాలకి తరలిస్తారు , అందుకుగాను ఆమెకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అంత ఇంత కాదండోయ్ .
   గత సంవత్సరంలో జరిగిన అతి దారుణమైన ప్రభుత్వ విధానం ఏమంటే , FDI ! అంటే ఇకనుంచి విదేశి వస్తువులు రావు ,అవన్నీ ఇక్కడే తయారవుతాయనమాట , అదీను మన స్వంత కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉంటూ . చివరికి మనకి మిగిలేది చిప్పే .
  రూపాయిని రక్షించటానికి ఒకటే దారి . విదేశి వస్తువులు కొనొద్దు . ఆడంబరాలు లేని జీవితం అలవాటు చేసుకోండి , లేకపోతే మన తర్వాత వచ్చే పిల్లల గతి అధోగతే .

Help the Unemployed, Organisation

I would start an office where unemployed will be suggested a job/Idea/support for earning some money for their Life.

మనుజుల్లో మూడు రకాలు

ఉత్తమ వర్గం : వీరి మెదడు కొత్త కొత్త ఆలోచనల పుట్ట
రెండవ రకం : వీరు సంఘటనలను/కార్యక్రమాలను విశ్లేషిస్తుంటారు
మూడవ జాతి: వాడి గురించి వీడి గురించి రచ్చబండ కార్యక్రమాలు నడుపుతుంటారు .

some comments on Raamayanam. రామాయణంలో నా పిచ్చి అనుమానాలు

1.సీతకి రావణుడి మీద పాజిటివ్ కార్నర్ ఏర్పడిందా ??
2. రాముడికి అనుమానం జబ్బు ఉందా ?
3.రావణుడు సీతను ఏమైనా చేసుంటాడని రాముడికి తెలిసిందా ?
4. సీత రాముడిని దూరంగా వుంచి రాముడిలో అనుమానం రేపిందా?
5. రాముడు ఇంట్లోవాళ్ళ మాటలకంటే బయటవాళ్ళకి ఎక్కువ విలువిస్తాడా ?
6. ఇలాంటివి ఏవైనా నిజంగానే జరిగుంటే , రామ భక్తులు కావాలనే ఆ సీన్స్ సెన్సార్ చేసారా??

హే హే ..నేను సూపర్ కదా .. నాకొచ్చినన్ని  అనుమానాలు రాముడికి కూడా వచ్చుండవేమో.... వస్తే  ఉరేసుకుని  చచ్చేవాడు. :D

గమనిక (Note) :ఇది ఖచ్చితంగా కొంతమంది మనోభావాలు  దెబ్బతీయటానికే.. ఇందులో కల్పితాలు ఏమీ లేవు .. అన్నీ నిజాలే. 

P.S:మణిరత్నం వెలగబెట్టిన "రావణ్" చిత్రం నాకు ఇలాంటి ఆలోచనలు రేపింది . వాడి ఉద్దేశ్యం కూడా అదే అయ్యుంటుంది 

Next generation Communication Device like mobile and Videochat

There will be a device in receivers home , creates a 3D Prototype of caller . He /she can see/hear but can't feel the touch.
This is not very complicated Idea, this is so simple to implement using the current technology like Virtual Conferencing  . Right after this we may see A Touch Enabled communication.

Still there are lot of homework left work Electrical Engineers. :D

Best time to generate profits from Indian Market.

As Rupee value soared to nearly 60Rs per US-Dollar , this is the best time to start indigenous ventures in competition to foreign brands. Foreign goods are no more going to be cheaper in this big time, domestic products if marketed properly , can generate huge money .
 To find out the options, just see what are we importing by paying US dollars,
1. Edible Oils
2. Some exotic Fruits
3. Garments and Apparels Market
4. Private Education Sector
5. Bio-Diesel
.
.
.
.

Solution to stop email Spamming

If someone labels a mail as spam , then sender will be Charged some money for each  spam email else his account will be blocked/jeopardized by the email sercvice Provider
  But then an other  problem will arise like,
  one can buy some webspace and start an email server and can send as much junk as he wants.

ఇకనుంచి విద్యుత్తును వృధా చేయను

నాకు రైతులంటే దేవుడుతో సమానం , అందుకే ఒక్క మెతుకు కూడా కింద పోనివ్వను , అవసరానికి మించి పెట్టుకోను .
కానీ  ఈరోజు ఈ కింద ఫోటో చూసినతర్వాత ఏడుపొచ్చింది , పాపం బొగ్గు కార్మికులు ఎన్ని కష్టాలు పడితే ఒక్కో యూనిట్ విద్యుచ్చక్తి తయారవుతుందో అర్థమవుతుంది . వ్యవసాయం , బొగ్గు తవ్వకం  ఈ రెందూ చేస్తున్నవాళ్లు దేవుళ్ళే నా దృష్టిలో .
సింగరేణి కాల్లరీస్ కార్మికులు



Indian farmers plough a field in preparation for sowing cotton seeds in Nani Kisol village.
 పత్తి  విత్తనాలు నాటుతున్న పనిదేవుళ్ళు . 

Sam Panthaky/AFP/Getty Images: Indian farmers plough a field in preparation for sowing cotton seeds in Nani Kisol village . 

మంచి ప్రేరణ కావొచ్చు , పేద పిల్లలకి

ఓసారి నాకు వైద్యం చేసిన డాక్టర్ని తనదగ్గర ఏవైనా  మెడికల్ చార్ట్ లేక జీవశాస్త్ర బొమ్మలుండే నమూనాలు వుంటే ఇమ్మని అడిగాను . తనదగ్గర చాలా పడివున్నాయని , ఎన్నికావాలంటే అన్ని తీసుకెళ్ళమన్నాడు .
   ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి చాలా ఖాళీ సమయం వుంటుంది , ఇటువంటి విద్యావసర సరుకులు వాళ్లకందిస్తే మంచి ప్రేరణ  పొందుతారు . ప్రయివేటు స్కూళ్ళలో ఇలాంటివి కావలసినన్ని వుంటాయి ,కానీ సృజనాత్మకత పెరగటానికి వారికసలు సమయం ఇస్తేగా , ఎప్పుదూ రుద్దుడే రుద్దుడు , ఆ ఇరుకు మూసెసిన గదుల్లో .

beautiful telugu script old


Absolutely No way for electrical Engineers to skip partial Diferential Equations(PDE)

Current trend of image Processing is highly depending on Methods based on PDE. So the old classic recipes  like Fourier transforms(Filters) ,clusterings, set-theoretic approaches,Statistical Filtering will no more be serving you square meals for your Day. So remember ,Signal Processing Experts, you have to learn FEM and therefore some good deal of Advanced Math of Numerical PDE.

నువ్వు కాకివిరా .. అంటే పొగిడినట్టు కూడా అనుకోవచ్చు

ఎందుకంటే కాకి నల్లగా ఉండటంలో దాని తప్పేమీ  లేదు ,ఐనాగానీ , అది ఏమైనా తినడానికి దిరికితే అందరినీ కావ్  కావ్ మని ఆహ్వానించి అందరితో పంచుకుంటూ తింటుంది , చూడండి  మనకంటే ఎంత మంచిదో కాకి బావ / కాకి మరదలు కూడా

పాపం తెలీక అడుగుతారు అంతే

మనవాళ్ళ లేక్కేంటంటే ఏ డిగ్రీనో ,ఇంజనీరింగో ఐపోగానే ఠపీమని ఏదో ఒక ఉద్యోగం వెలగబెట్టాలి , అంటే పొద్దున్నే 9కి షర్టు బూటు  వేసుకుని కంగారుగా వెళిపోయి సాయంత్రం 5కి చెరిగిన జుట్టుతో ఆముదం ముఖం వేసుకుని ఇంటికొచ్చి టివి ముందు వాలిపోవాలి . వీళ్ళందరికీ సరిగా తెలియని ఇంకో లోకం వుంది , అదే పరిశోధనా రంగం . వాళ్ళకున్న జ్జ్ఞానమేమంటే చదువనేది ఉద్యోగం కోసమే , ఆ ఉద్యోగానికి చదువుకి ఏ మాత్రం సంభంధం లేదని వాళ్ళ అభిప్రాయం . జీవితాంతం చదివేవాడిని వెర్రి పుల్లయ్య (అంటే చేతకానోడు ) అని అనుకుంటుంటారు . పాపం వారెప్పుడు ఆలోచించలేదు అసలు cellphoneలు  ,బస్సులు ,బళ్ళో పాఠాలు ,కంపూటర్లు ,కలర్ మూవీలు ఎలా వచ్చాయో , అవిగాను చేసినందుకు లేక చేసేటందుకు ప్రయత్నిస్తున్నందుకు గాను ,పరిశోధన సంస్థలు ఎంతటి మొత్తాల్ని ముట్టజెప్తాయో ,వారికి సమాజంలో లభించే పరపతి ఏమిటో తెలీకనే తప్ప , ఇంకే ఉద్దేశ్యం కాదు .
  మా ఇంటికెళ్ళినప్పుడల్లా  ,"ఇంకా ఏం చదువులు బాబు, ఎంతకాలం !?. ఉద్యోగం ఏమీ దొరకట్లేదా ? " అని ఎవరైనా అని ఎవరైనా అంటే కాస్త కాలుతుంది , ఒక నిమిషంలో కుదుటపడి చిన్న నవ్వుతో నాకు నేనే సర్దిచెప్పుకుంటున్నా . ఒకోసారి కొంతమందికి వివరణ ఇస్తుంటే వాళ్లకి నచ్చట్లేదు , ఎం చేస్తాం వాళ్ళ దృష్టిలో ఉద్యోగమే పరమావధి .


అధర్వణ వేదంలో ఇది చెప్పబడింది ---
   "వ్యవసాయం ఉత్తమం
     వ్యాపారం మధ్యమం
     ఉద్యోగం అథమం
     యాచకం అథమాథం " .

పరిశోధన అనేది  పాతకాలంలో ఋషులు మునులు చేసేవారు , అది కూడా వ్యవసాయమే .

ఇన్ఫోసిస్ లెక్క

ఇప్పుడున్న ఇన్ఫోసిస్ షేర్ ధర అంటే 2390రూ ఖచ్చితంగా 2550-2750 కి చేరుతుంది , అదీనూ గరిష్టంగా రెండే వారాల్లో . ఈ లెక్క ఠంచనుగా అంటే నా బ్లాగు టపా లాగ నిజమై తీరుతుంది . 

ఆంధ్రాలో చైనా చదువులు

ఇదేదో imported  అనుకునేరు , కాదండోయ్ MADE in ANDHRA . ఈ మధ్య శ్రీ చైతన్య , నారాయణ కలిసిపోయి జనాన్ని  అడ్డంగా దోచేయడానికేసిన  మహత్తరమైన పథకం ఇది . అచ్చం చైనా సరుకులానే వీరి విద్యా విధానం కూడా నకిలీవే , రాంక్ తప్ప "ఇంకేమీ" రావు . భలే బాగా పెట్టారు కదా పేరు ,తెలిసి పెట్టారో తెలియక పెట్టారో గాని పాపం , కానీ సరిగ్గా పెట్టారు . 

మీరు పరిశోధన రంగంలో వున్నప్పుడు వచ్చే పెద్ద సమస్య

ఒక్కో సమయంలో బుర్రకి ఏమీ తోచదు , ఉన్న సమస్య ఒక కొలిక్కి రాదు . కొత్త ఆలోచనలు తట్టవు . మరేం చేస్తే బాగుంటుంది మన బతుకు .
    ఒక మంచి పొత్తం చేతబట్టి నిర్మానుష్య ప్రదేశంలో దాని అంతు చూడండి , అంటే నా అర్థం (ఉద్దేశ్యం ) పుటలు అయిపోయేదాకా చదవమని , చింపేయమని కాదండోయ్ దొరవారు . 
  నా వెర్రి కాకపోతే అంత ప్రశాంతంగా ఉండే స్థలాలు ఈరోజుల్లో ఎక్కడ తగలడ్డాయ్ . కార్ల రొద , mp3 సొద .

మీ చుట్టూ ఉన్న ప్రపంచం విసుగ్గా ఉందా ?? How to change the world you see around you

ఒక కత్తిలాంటి పుస్తకం మీకు నచ్చింది చదవండి . అది మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్తుంది .
--నా దరిద్రమో అదృష్టమో ఒక్క లైన్ చదవగానే వెఱ్రి ప్రశ్నలు వంద తగలడతాయి .

dynamic డైనమిక్ అంటే ఏంటి ?

సూటిగా , సుత్తి లేకుండా చెప్పాలంటే 'కాలంతో సంబంధమున్న ప్రక్రియ ' అని  అర్థం

స్టాక్ మార్కెట్ ఊబిలో ఊపిరాడక కొట్టుకుంటున్నప్పుడు ఈ చిత్రం తప్పకుండా చూడండి

చిత్రం పేరు : wallstreet (money never sleeps) 2010
ఈ చిత్రం చూస్తున్నంతసేపు నాకు ఆ రోజులు బాగా గుర్తుకువచ్చాయి . ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి , కానీ అది ఒక వ్యసనం అయితే ఎలావుంటుందో ఈ చిత్రంలో చూడవచ్చు . ఆ ప్రపంచం మనను స్వంతవారినుంచి ఎంతగా దూరం నెట్టేస్తుందో గమనించవచ్చు . ఇవన్నీ చవిచూసాను . ఎపుడైనా మళ్లీ ఆ అగాథంలోకి వెళ్తే ఈ సినిమా గుర్తుంచుకోవాలని ఈ టపా రాస్తున్నాను .
నా  ఫేవరెట్ actor  Matt Damon lead  role  చేసిన "Rounders" చిత్రం లో ఇలాంటి జీవితాల్ని ఇంకా దగ్గరగా చూపించాయి .

దూరమయ్యకే తెలుస్తుంది ఏదీ నునుపు కాదని

మనవాళ్ళు వేరే దేశాలు తరలిపొయిన తర్వాతగానీ తెలియట్లేదు భాషని ఎంత నిర్లక్ష్యం చేసారో . ఏదైనా పరదేశాలవారిని అనుకరించాల్సిందే , అది విద్యలో కానివ్వండి , మాతృభాషని గౌరవించుకోవటం కానివ్వండి . అందరికంటే మన తెలుగువాళ్ళమే దరిద్రులం , కంప్యూటర్ ని తెలుగులో వాడుతుంటే నన్ను చూసి నవ్వని మహానుభావులు లేరు . లుంగీ కడితే అదేదో నేను బికినీ వేసినంత ఆశ్చర్యం మనవాళ్ళకి , కనీసం ఈ విష్యం లో తమిళ్ వాళ్ళు పరవాలేదు . 

Secure Document Authoring/signing

I thought I would make a e-signature based patent to start a venture. but surprised to see that it is a Billion dollar business to create/keep/send documents safe.
P.S: But still I see only pictorial signature embeddings on Google, have to look in to it more to cap on that Idea.